
Varun Tej- Lavanya Reception : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఎట్టకేలకు తమ ఆరు సంవత్సరాల ప్రేమను పెళ్లి పీటల వరకు తీసుకువచ్చారు. కుటుంబ సభ్యుల మధ్య ఇటలీలో ఈ ఇద్దరి పెళ్లి ఘనంగా జరిగింది. ఆ తర్వాత హైదరాబాద్ కు తిరిగి వచ్చిన ఈ జంట కోసం.. కుటుంబ సభ్యులు హైదరాబాదులో ఘనంగా రిసెప్షన్ ని కూడా ఏర్పాటు చేశారు. ఈ రిసెప్షన్ కి సినీ ,రాజకీయ ప్రముఖులు విచ్చేసి సందడి చేశారు.
ఈ రిసెప్షన్ కి సంబంధించిన పలు ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. పెళ్లి కుదిరిన క్షణం నుంచి మెగా ఫ్యామిలీ ఏదో ఒక ఫంక్షన్ చేస్తూ హడావిడి చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో వీటికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఇక లావణ్య పెళ్లయినప్పటి నుంచి అత్తగారింట్లోనే ఉంటుంది. పెళ్లి తర్వాత లావణ్య, వరుణ్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి.
రీసెంట్ గా పెళ్లి తర్వాత వచ్చిన దీపావళి కూడా లావణ్య అత్తగారింట్లోనే జరుపుకుంది. పెళ్లి తర్వాత ఆమె ఇప్పటివరకు పుట్టింటికి వెళ్ళింది లేదు. వరుణ్ ఫ్యామిలీ గురించి తెలిసినంతగా చాలామందికి లావణ్య ఫ్యామిలీ గురించి తెలియదు.ఈ నేపథ్యంలో లావణ్య ,వరుణ్ మరొక రిసెప్షన్ కి రెడీ అవుతున్నారు అన్న న్యూస్ వైరల్ అవుతుంది.ఈ రిసెప్షన్ లావణ్య వాళ్ళ పుట్టింటిలో వాళ్ల బంధువుల మధ్య జరగబోతున్నట్లు తెలుస్తోంది.
లావణ్య త్రిపాఠిది ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య దగ్గర ఒక ఊరు.. అయితే ప్రస్తుతం ఆమె ఫ్యామిలీ డెహ్రాడూన్ లో సెటిల్ అయ్యారు. అందుకే ఇప్పుడు వరుణ్ ,లావణ్య సెకండ్ రిసెప్షన్ డెహ్రాడూన్ లో ఆమె పుట్టింటి వారు ఆర్గనైజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 2012 లో అందాల రాక్షసి అనే తెలుగు మూవీ తో లావణ్య వెండితెరకు పరిచయం అయింది. ఇక ఆ తర్వాత మంచి గుర్తింపు రావడంతో పలు చిత్రాల్లో నటించి మాంచి పేరు తెచ్చుకుంది. ఈ రిసెప్షన్లో వీళ్ళ ఏ స్టైల్ లో రెడీ అవుతారు, మెగా వారు ఈ రిసెప్షన్లో ఎలాంటి సందడి చేస్తారు అన్న విషయం పై ఆన్లైన్ లో చర్చలు జరుగుతున్నాయి.
Ponguleti: అసెంబ్లీని సామ్రాజ్యంగా చేసుకొని దోచుకుంటున్నారు.. కేసీఆర్ పై పొంగులేటి తిరుగుబాటు