
Rangareddy : రంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ముచ్చర్ల గ్రామ శివారులో ఓ మహిళను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఆపై కిరాతకంగా కాల్చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని ఘటనాస్థలంలో ఆధారాలు సేకరిస్తున్నారు. మృతురాలు జాపాల్ గ్రామానికి చెందిన మంథని యాదమ్మగా అనుమానిస్తున్నారు. కాగా యాదమ్మ తప్పిపోయిందని మంచాల పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదయ్యింది.