BigTV English
Advertisement

Avatar 2 Day 1 collections: ‘అవ‌తార్ 2’ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌.. కెవ్వు కేక‌

Avatar 2 Day 1 collections: ‘అవ‌తార్ 2’ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌.. కెవ్వు కేక‌

Avatar 2 Day 1 collections :హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో రూపొందిన విజువల్ వండర్ ‘అవతార్ 2: ది వే ఆఫ్ వాట‌ర్‌’. 13 ఏళ్ల ముందు అంటే 2009లో ఈయ‌న తెర‌కెక్కించిన అవ‌తార్ సినిమాకు సీక్వెల్ ఇది. అంద‌రూ ఎంతో ఆస‌క్తిగా ఈ సినిమా కోసం ఎయిట్ చేశారు. ఈ శుక్ర‌వారం (డిసెంబ‌ర్ 16న‌) ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ క‌లెక్ష‌న్స్‌ను ఓ రేంజ్‌లో కొల్ల‌గొట్టేసింది. తొలి రోజున రూ.30-35 కోట్ల రూపాయ‌ల వ‌సూళ్ల‌ను ఇండియాలోనే సాధించింద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి. ఇండియాలో అవెంజ‌ర్స్ ది ఎండ్ గేమ్ త‌ర్వాత భారీ క‌లెక్ష‌న్స్ సాధించిన చిత్రంగా అవ‌తార్ 2 రెండో స్థానంలో నిలిచిందంటున్నారు.


వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ‌మ‌నిస్తే అవ‌తార్ 2 మూవీ.. 124 మిలియ‌న్ డాల‌ర్స్ క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి. యు.ఎస్.ఎలో అయితే తొలి రోజున 55 మిలియ‌న్ డాల‌ర్స్ వ‌సూళ్లు వ‌చ్చాయి. ఈ వారాంతంలో ఈ వ‌సూళ్లు 500 మిలియ‌న్ డాల‌ర్స్‌ను అవ‌తార్ ట‌చ్ చేస్తుంద‌ని సినీ ట్రేడ్ వ‌ర్గాలంటున్నాయి. విజువ‌ల్ వండ‌ర్‌గా 3D, 4DX టెక్నాలజీతో రూపొందిన అవతార్ 2 సినిమాను ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తోంది. 4DX టెక్నాల‌జీలో సినిమాను చూడాలంటే రూ.1400 రేటుతో టికెట్‌ను కొనాలి. అలాగే 3D టెక్నాల‌జీలో సినిమాను చూడాలంటే రూ.1050ల‌తో టికెట్‌ను కొనుగోలు చేయాలి. అవతార్ చిత్రంలో పండోరా గ్రహంపై పోరాటాన్ని చిత్రీకరించిన జేమ్స్ కామెరూన్.. అవతార్ 2 సినిమా నీటిలో చేసే పోరాటంగా చిత్రీక‌రించారు.


Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×