E-Paper
Advertisement

Avika gor: నా అనుకున్న వాళ్ళే అసభ్యకరంగా ప్రవర్తించారు.. అవికా ఎమోషనల్ కామెంట్స్..!

Avika gor: నా అనుకున్న వాళ్ళే అసభ్యకరంగా ప్రవర్తించారు.. అవికా ఎమోషనల్ కామెంట్స్..!

Avika gor.. బాలికా వధూ అనే హిందీ సీరియల్ ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గా బుల్లితెర ఇండస్ట్రీకి పరిచయమైన అవికా గోర్ (Avika gor) ఆ తర్వాత అదే సీరియల్ తెలుగులో చిన్నారి పెళ్లి కూతురు పేరిట విడుదల చేసి భారీ పాపులారిటీని సంపాదించుకుంది. అంతేకాదు దేశంలోని పలు భాషలలో ప్రసారమైన ఈ సీరియల్ అప్పట్లో ఒక ట్రెండ్ క్రియేట్ చేసిందని చెప్పవచ్చు. అంతేకాదు ఆ కాలంలోనే వరల్డ్ పాపులారిటీ సొంతం చేసుకుంది అవికా గోర్. ఆ తర్వాత తెలుగులో ఉయ్యాల జంపాల అనే సినిమాతో హీరోయిన్ గా మారి ప్రేక్షకులను ఆకట్టుకుంది. రాజ్ తరుణ్ హీరోగా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. మొదటి ప్రయత్నంతోనే భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈమె ఆ తర్వాత పలు చిత్రాలలో నటించి ప్రేక్షకులను అలరించింది.

రక్షించాల్సిన బాడీగార్డే అసభ్యకరంగా తాకాడు..

సినిమా చూపిస్త మావ అనే సినిమాతో మరో విజయాన్ని అందుకుంది. ఇందులో కూడా రాజ్ తరుణ్ నటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సినిమా అవకాశాలు లేక సోషల్ మీడియాకు పరిమితమైన ఈమె తాజాగా ఒక ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు ఎదురైన చేదు అనుభవాలను చెప్పుకొచ్చింది. తనను కాపాడుతాడని ఉద్యోగం ఇస్తే ..ఆ వ్యక్తే తనతో చాలా అసభ్యకరంగా ప్రవర్తించి, తనను మానసికంగా ఇబ్బందులకు గురి చేశాడు అంటూ చెప్పుకొచ్చింది. పెద్దయ్యాక ఎన్నో హింసలు, సవాళ్లు కూడా ఎదుర్కొన్నాను అంటూ తెలిపింది.. తనను రక్షించాల్సిన బాడీ గార్డే తనను దారుణంగా తాకాడు అంటూ తెలిపింది. రెండుసార్లు అలాగే ప్రవర్తించాడని తనతో అసభ్యకరంగా ప్రవర్తించగానే అతడు వైపు చూసి ఏంటి అని అడగ్గా.. వెంటనే సారీ చెప్పాడని, ఇలాంటి దారుణాలు అతడి నుంచి చాలా చూశాను అంటూ చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే అతడిని తట్టుకోలేక జాబ్ నుంచి తీసేసాను అని తెలిసింది అవికా గోర్.

అమ్మాయిలందరూ ధైర్యంగా ఉండాలి..

ముఖ్యంగా ఇలా ఈ సంఘటనలు ఇతరులపై ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలియదు కానీ అలా ప్రవర్తించినప్పుడు అతడిని కొట్టాలని అనిపించేది. అయితే ఆ దైర్యమే ఉండి ఉంటే ఈపాటికి ఎంతో మందిని కొట్టేదాన్ని అంటూ తెలిపింది అవికా గోర్.. అయితే ప్రస్తుతం ఇలాంటివి ఎన్నో ఎదుర్కొని ఇప్పుడు ధైర్యంగా మారానని, తనతో అసభ్యకరంగా ప్రవర్తించిన వారిని కొట్టే సత్తా తనకి ఉంది అంటూ చెప్పుకొచ్చింది. తనలాంటి పరిస్థితి భవిష్యత్తులోనే కాదు ఇప్పటికీ కూడా ఎవరికి రాకూడదని, అలా వచ్చినప్పుడు ధైర్యంగా ఇతరులను కొట్టే శక్తి సామర్థ్యాలు తమలో నింపుకోవాలని కూడా తెలిపింది అవికా గోర్. ప్రస్తుతం అంతగా అవకాశాలు రాకపోవడం వల్లే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు చేరువయ్యే ప్రయత్నం చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఏదేమైనా అవికా గోర్ ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొందని తెలిసి.. అయ్యో చిన్నారి పెళ్ళికూతురు కి కూడా ఈ తిప్పలు తప్ప లేదా అంటూ కామెంట్లు చేస్తుంటే.. మరికొంతమంది ఆడవారికి ఎవరికైనా ఇలాంటి తిప్పలు తప్పవు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×