BigTV English

Kaleshwaram Commission: కథ.. స్క్రీన్ ప్లే.. డైరెక్షన్.. అంతా కేసీఆర్‌దే!

Kaleshwaram Commission: కథ.. స్క్రీన్ ప్లే.. డైరెక్షన్.. అంతా కేసీఆర్‌దే!
  • కాళేశ్వరం కమిషన్ ముందుకు మాజీ ఈఎన్‌సీ వెంకటేశ్వర్లు
  • నిజాలే చెప్పాలని స్పష్టం చేసిన కమిషన్
  • నిరాధారమైన వ్యాఖ్యలు చేస్తే చర్యలు ఎదురుకోవాల్సి వస్తుందని వార్నింగ్
  • డీపీఆర్ నిర్ణయంపై గుచ్చి గుచ్చి ప్రశ్నించిన ఘోష్
  • అంతా కేసీఆర్ ఆదేశాలతోనే జరిగిందన్న వెంకటేశ్వర్లు
  • 2016లో సమీక్షకు పిలిచే వరకు తమకేం తెలియదని స్పష్టం
  • మూడు బ్యారేజీలను వ్యాప్కోస్ ఫైనల్ చేసిందన్న మాజీ ఈఎన్‌సీ

హైదరాబాద్, స్వేచ్ఛ: త్వరలో పొలిటికల్ బాంబులు పేలుతాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ అంతటా హాట్ టాపిక్‌గా మారాయి. కాళేశ్వరం, ధరణి, ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన కేసుల్లో గత ప్రభుత్వ పెద్దలకు ఉచ్చు బిగుస్తోందని మంత్రి చేసిన కామెంట్స్‌తో ఎప్పుడేం జరుగుతుందో అనే ఉత్కంఠ నెలకొంది. ఇదే సమయంలో కాళేశ్వరంపై విచారణ జరుపుతున్న పీసీ ఘోష్ కమిషన్ దూకుడుగా వ్యవహరిస్తోంది. బహిరంగ విచారణలో అధికారులను గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తోంది. తప్పంతా గత ప్రభుత్వ పెద్దలదేనని వారు చెబుతుండడంతో కమిషన్ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుందోననే చర్చ జరుగుతోంది.


రెండోరోజు కమిషన్ ముందుకు మాజీ ఈఎన్‌సీ నల్లా

కాళేశ్వరం ప్రాజెక్ట్ అవకతవకలకు సంబంధించి బహిరంగ విచారణ జరుపుతోంది ఘోష్ కమిషన్. ఇప్పటికే ఓ దఫా విచారణ జరిపింది. బుధవారం నుంచి రెండో దఫా విచారణ చేస్తోంది. ఈ క్రమంలోనే రెండోరోజు మాజీ ఈఎన్‌సీ నల్లా వెంకటేశ్వర్లును విచారించింది. తర్వాతి రోజు కూడా విచారణకు హజరు కావాలని స్పష్టం చేసింది. వెంకటేశ్వర్లును రెండు విడుతలుగా విచారించిన కమిషన్, కీలక ప్రశ్నలు వేసింది. ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరును పలుమార్లు ప్రస్తావించారు వెంకటేశ్వర్లు. టెక్నికల్ అంశాల తర్వాత డీపీఆర్ ఎవరు అప్రూవల్ చేశారని కమిషన్ ప్రశ్నించగా, కేసీఆర్ చేసినట్టు చెప్పారు. డీపీఆర్‌లు వేర్వేరుగా చేశారా, ఒకే డీపీఆర్ ఉందా అని అడగగా, మూడు బ్యారేజీలకు వేర్వేరుగా, ఒకసారి మొత్తం కలిపి, మరొకసారి రెండు ఉన్నాయని వివరించారు. మేడిగడ్డ బ్యారేజీ కింద కోల్బెడ్ టెస్టులు నిర్వహించారా అని అడిగారు ఘోష్. బ్యారేజీలలో నీళ్లను నిల్వ చేయాలని ఎవరు ఆదేశించారని ప్రశ్నించారు. దీనికి ఆనాటి ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకే నీళ్లను నిలువ చేసినట్లు సమాధానం ఇచ్చారు వెంకటేశ్వర్లు. ప్రతిరోజు రెండు టీఎంసీలు ఎత్తిపోసేందుకు 40 వేల కోట్ల వరకు ఉండే ఖర్చు 3 టీఎంసీలు అయ్యేసరికి డబుల్ ఎలా అయిందని ప్రశ్నిచింది కమిషన్. కేవలం అదనంగా 2 లక్షల ఎకరాల కోసం అన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాలా అని అడిగింది. ప్రాణహిత – చేవెళ్ల వద్ద రెండు లిఫ్టులు తక్కువ విద్యుత్ ఖర్చు కాదని కాళేశ్వరం మూడు లిఫ్టులు ఎక్కువ ఖర్చులు ఎందుకు చేశారని ప్రశ్నించింది. కాళేశ్వరం ప్రాజెక్టు నార్మల్ కాదని, ఇది ప్రత్యేకమైన గ్యారేజీ అని తెలిపారు వెంకటేశ్వర్లు.


కమిషన్ హెచ్చరికతో నిజాలన్నీ చెప్పిన మాజీ ఈఎన్‌సీ

బహిరంగ విచారణకు హాజరైన వెంకటేశ్వర్లును కాళేశ్వరం కమిషన్ గుచ్చి గుచ్చి ప్రశ్నించింది. జ్యుడీషియల్ కమిషన్ ఎదుట హాజరైన విషయాన్ని గుర్తు పెట్టుకొని నిజాలు, డాక్యుమెంట్ ఆధారాలు మాత్రమే చెప్పాలని ముందు హెచ్చరించింది. నిరాధారమైన వ్యాఖ్యలు చేస్తే చర్యలు ఎదురుకోవాల్సి వస్తుందని స్పష్టం చేసింది. డీపీఆర్ తయారీ నిర్ణయాలు, ఇంకా ఇతర ఆదేశాలపై ప్రశ్నించింది. దీంతో గుట్టంతా వివరించారు వెంకటేశ్వర్లు. 2016 జనవరిలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు అధికారులు రివ్యూ ఏర్పాటు చేశారని, ఆ సమీక్షలో డీపీఆర్ నిర్ణయం జరిగిందని చెప్పారు. కాళేశ్వరం ఆలోచన కేసీఆర్‌దేనని, ఆయన రివ్యూకు పిలిచే వరకు తమకు ఎలాంటి సమాచారం లేదని స్పష్టం చేశారు. డీపీఆర్ అప్రూవల్ పొందాక ఏమైనా మార్పులు చేశారా అని కమిషన్ ప్రశ్నించగా, హై పవర్ కమిటీ ఆదేశాల మేరకు మార్పులు జరిగాయని చెప్పారు. ఆ కమిటీలో ఎవరున్నారని ఘోష్ ప్రశ్నించారు. మూడు బ్యారేజీల దగ్గర పనిచేసిన ఇంజనీర్ల లెక్కలు ఇవ్వాలని ఆదేశించారు. బ్యారేజీలు నిర్మించడానికి ఎలాంటి పారామీటర్స్ పరిగణనలోకి తీసుకుంటారు? మూడు బ్యారేజీల లొకేషన్స్ ఎవరు ఫైనల్ చేశారు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. మూడు బ్యారేజీల నిర్మాణం లొకేషన్స్ వ్యాప్కోస్ సంస్థ డిసైడ్ చేసిందని వెంకటేశ్వర్లు తెలిపారు.

Related News

Former DSP Nalini: మాజీ డీఎస్పీ నళిని ఆవేదనపై సీఎం రేవంత్ రియాక్షన్.. కలెక్టర్‌ను ఇంటికి పంపి..?

Sammakka Sagar: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఎన్ఓసీ.. ఛత్తీస్‌గఢ్ సీఎంను ఒప్పించిన మంత్రి ఉత్తమ్

HMWSSB: హైదరాబాదీలకు బిగ్ అలర్ట్.. బుధవారం ఈ ప్రాంతాల్లో మంజీరా వాటర్ బంద్, కారణం ఇదే

Weather News: మళ్లీ వర్షాలు స్టార్ట్.. ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగుల వర్షం..

CM Revanth Reddy: హైవే ప్రాజెక్టులపై.. సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష

Suryapet News: సూర్యాపేటలో హై టెన్షన్.. పోలీసులను ఉరికించి ఉరికించి.. బీహార్ బ్యాచ్ అరాచకం

Indrakiladri Sharannavaratri: తెలంగాణలో అంగరంగ వైభవంగా.. భద్రకాళి అమ్మవారి ఉత్సవాలు

Bathukamma Kunta: బతుకమ్మ కుంటకు ప్రాణం పోసిన హైడ్రా.. 25న సీఎం చేతులు మీదుగా ప్రారంభం

Big Stories

×