BigTV English

Matka: తస్సాదియ్యా.. జీవితం గురించి ఏం చెప్పాడ్రా.. అదిరిపోయింది పాట

Matka: తస్సాదియ్యా.. జీవితం గురించి ఏం చెప్పాడ్రా.. అదిరిపోయింది పాట

Matka: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. గత కొన్నేళ్లుగా మంచి విజయం కోసం కష్టపడుతూనే ఉన్నాడు. మంచి మంచి కథలను ఎంచుకుంటున్నా.. అవి బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. ఇక ఆ పరాజయాలను పట్టించుకోకుండా ఒక్క విజయం.. ఒకే ఒక్క విజయం అంటూ  యుద్ధం చేస్తూనే ఉన్నాడు. అలా ఈసారి వరుణ్.. మట్కా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. కరుణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను విజయేందర్ రెడ్డి తీగల, రజని తాళ్లూరి నిర్మిస్తున్నారు.


Kaleshwaram Commission: కథ.. స్క్రీన్ ప్లే.. డైరెక్షన్.. అంతా కేసీఆర్‌దే!

ఇక ఈ సినిమాలో వరుణ్ సరసన మీనాక్షీ చౌదరి, నోరా ఫతేహి నటిస్తున్నారు. కొన్ని యదార్ధ సంఘటనల ఆధారంగా మట్కా సినిమా తెరకెక్కింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా.. కొన్ని కారణాల వలన వాయిదాలు పడుతూ చివరికి నవంబర్ 14 న రిలీజ్ కు రెడీ అవుతుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్.. తాజాగా మరో లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు.


తస్సాదియ్యా అంటూ సాగిన ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. జీవీ ప్రకాష్ మ్యూజిక్ సినిమాకు హైలైట్ గా నిలుస్తుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ” కూర్చుంటే ఏది రాదు.. నిలబడి చూస్తుంటే కాదు .. కలబడిది నీదే దునియా అంతా” అంటూ మొదలైన ఈ సాంగ్ అదిరిపోయింది. జీవితం గురించి, డబ్బు గురించి  గేయ రచయిత భాస్కరభట్ల ఎంతో అద్భుతంగా  రాశారు.

Bigg Boss 8 Telugu Promo: పరువు పోగొట్టుకుంటున్న ఓజీ టీమ్.. ‘సై’ సినిమా రేంజ్‌లో నిఖిల్ మోటివేషన్

ఇక ఈ సాంగ్ ను తమ బేస్ వాయిస్ తో పాడి మెప్పించాడు సింగర్ మనో. సాంగ్ మొత్తం ఒక ఎత్తు అయితే.. వరుణ్ గెటప్ మరో ఎత్తు.  1980 కాలంలో  వాడే కాస్ట్యూమ్స్, హెయిర్ స్టైల్ లో అద్భుతంగా కనిపించాడు. విజువల్స్ కూడా ఎంతో అద్భుతంగా చూపించారు. లిరిక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతోనైనా వరుణ్ తేజ్.. విజయాన్ని అందుకుంటాడేమో చూడాలి. 

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×