E-Paper
Advertisement

Bigg Boss: నబీల్ ప్రేయసిని చూశారా? ఎంత క్యూట్ గా ఉందో.. ఈమె బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే..?

Bigg Boss: నబీల్ ప్రేయసిని చూశారా? ఎంత క్యూట్ గా ఉందో.. ఈమె బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే..?
Advertisement

Bigg Boss.. బిగ్ బాస్ సీజన్ 8లోకి కంటెస్టెంట్ గా అడుగుపెట్టి తనదైన పర్ఫామెన్స్ తో ఆడియన్స్ ను ఆకట్టుకుంటూ.. గేమ్ స్ట్రాటజీ తో ఆడియన్స్ మనసు దోచుకుంటున్నారు నబీల్ ఆఫ్రిది (Nabeel Afridi). ప్రస్తుతం ఇతని ఆట తీరు చూస్తుంటే రోజురోజుకీ మరింత స్ట్రాంగ్ అవుతున్నాడని చెప్పవచ్చు. ప్రస్తుతం నాలుగవ వారం నామినేషన్స్ లో కూడా టాప్ పొజిషన్లో కొనసాగుతున్నారు. నామినేషన్ లోకి వచ్చినా.. దాదాపు భారీ ఓటింగ్ సొంతం చేసుకున్నారు నబీల్ . దీంతో ఈవారం కూడా ఇతడు సేఫ్ అయినట్టే. ముఖ్యంగా సోనియాతో గొడవకు దిగుతూ ఆమె మాటలను తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈయన ప్రేమలో పడినట్లు తెలుస్తోంది.. అంతేకాదు తన ప్రేయసిని కూడా నబీల్ పరిచయం చేశారు. మరి ఆమె ఎవరు? ఎక్కడుంటుంది? ఎలా పరిచయం? అనే విషయాలు వైరల్ గా మారుతున్నాయి.

ప్రేమ విషయాన్ని బయటపెట్టిన నబీల్..

Advertisement

ఇకపోతే నబీల్ విషయానికి వస్తే.. వరంగల్ కి చెందిన ఈయనకు సినిమాలలోకి వెళ్లాలనే కోరిక బలంగా ఉండేదట. ఆ కోరికే ఆయనను యూట్యూబ్ దిశగా అడుగులు వేసేలా చేసింది. అలా మొదట యూట్యూబ్ ఛానల్ పెట్టి వీడియోలు చేస్తూ తనను తాను నెటిజెన్స్ కి పరిచయం చేసుకున్నాడు. అందులో ఫ్రాంక్ , కామెడీ వీడియోలతో తెగ పాపులారిటీ సంపాదించుకున్నారు నబీల్. ప్రస్తుతం యూట్యూబ్లో 16 లక్షలకు పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు అంటే ఆఫ్రిదికి ఏ రేంజ్ లో పాపులారిటీ ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ పాపులారిటీని మరింత పెంచుకోవడానికి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టారు నబీల్.

అమ్మాయి అందానికి ఫిదా అవుతున్న నెటిజన్స్..

Advertisement

ఈ నేపథ్యంలోనే హౌస్ లో ఉండే ఈయన తన ప్రేమ విషయాన్ని కూడా బయటపెట్టారు. తన యూట్యూబ్ వీడియోలలో నటించే ఆధ్య రెడ్డి (Adhya Reddy)అనే అమ్మాయితో తాను ప్రేమలో ఉన్నాను అనే విషయాన్ని రివీల్ చేశాడు. ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఫోటోలు పోస్ట్ చేసి తన ప్రేమను బయటపెట్టాడు నబీల్. మొత్తానికి తన ప్రేమ విషయాన్ని బయటపెట్టి అందరిని ఆశ్చర్యపరిచారు నబిల్. ఇకపోతే హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆధ్యారెడ్డిని వివాహం చేసుకోబోతున్నారు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి మరి అందరిలాగా హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత బ్రేకప్ చెప్పుకుంటారా? లేక తమ ప్రేమ గట్టిది అని నిరూపించుకొని వివాహం చేసుకుంటారా ? అన్నది తెలియాల్సి ఉంది. మొత్తానికి అయితే ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుండగా ఈమె చాలా క్యూట్ గా ఉందని, హీరోయిన్గా ట్రై చేస్తే కచ్చితంగా అవకాశాలు వస్తాయని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. మరి నెటిజన్స్ కోరిక మేరకు.. ఆధ్య రెడ్డి ఇండస్ట్రీలో హీరోయిన్ గా ట్రై చేస్తుందో లేదో చూడాలి.

Related News

బిగ్ బాస్10 హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ తనేనా?

బిగ్ బాస్ హౌస్ లోకి గుండెనిండా గుడి గంటలు హీరో.. ఈ ట్విస్ట్ ఏందీ బాలు..వీడియో వైరల్!

బిగ్ బాస్ 10 లాంచింగ్ ఎపిసోడ్… చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో!

న్యూ చాప్టర్ బిగిన్స్.. బిగ్ బాస్ 10 ఎంట్రీ పై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ!

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

Big Stories

Advertisement
×