E-Paper
Advertisement

Bahishkarana Trailer: బహిష్కరణ ట్రైలర్.. అదరగొట్టిన అంజలి

Bahishkarana Trailer: బహిష్కరణ ట్రైలర్.. అదరగొట్టిన అంజలి
Advertisement

Bahishkarana Trailer: హీరోయిన్ అంజలి ప్రస్తుతం ఒక పక్క సినిమాల్లో.. మరోపక్క వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా మారింది. తాజాగా ఆమె నటించిన వెబ్ సిరీస్ బహిష్కరణ. జీ5 లో ఈ సిరీస్ రిలీజ్ కు రెడీ అవుతుంది. ముకేశ్ ప్రజాపతి దర్శకత్వం వహించిన ఈ సిరీస్ లో అనన్య నాగళ్ల కూడా కీలక పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

తాజాగా బహిష్కరణ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. రివెంజ్ విలేజ్ డ్రామాగా బహిష్కరణ కథ తెరకెక్కినట్లు తెలుస్తోంది. మంచోడు చేసే తప్పు ఏంటో తెలుసా.. చెడ్డవాడి చరిత్ర గురించి తెలుసుకోవడమే అనే డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమయ్యింది.

Advertisement

దర్శి(శ్రీ తేజ్) కు పుష్ప( అంజలి) అంటే బాగా ఇష్టం. ఆమెతో జీవితాన్ని ఊహించుకుంటాడు. కొత్తగా గ్రామానికి వచ్చిన పుష్ప ఎవరో ఏంటో కూడా తెలుసుకోకుండా ప్రేమిస్తాడు. ఆమె కూడా అతడితో సన్నిహితంగా ఉంటుంది. అయితే ఆ గ్రామంలో శివయ్య( రవీంద్ర విజయ్) పుష్ప మీద కన్నేస్తాడు. ఇక అలా పుష్ప వేశ్య అన్న విషయం తెలుస్తోంది. దీంతో మనసు విరిగిన దర్శి.. పుష్ప డబ్బుకోసమే ఇదంతా చేస్తుంది అని అనుకుంటాడు. కానీ, పుష్ప మాత్రం ఆ ఊరిలో జరిగే దురాగతాలను ఎదుర్కోవడానికి వచ్చానని చెప్తోంది. అసలు పుష్ప ఎవరు.. ? ఆమె గతం ఏంటి.. ? శివయ్యకు పుష్పకు ఉన్న రిలేషన్ ఏంటి.. ? అనన్య నాగళ్ళ ఎవరు.. ? అనేది సిరీస్ చూసి తెలుసుకోవాల్సిందే.

అంజలి పుష్పగా అదరగొట్టింది. రివెంజ్ తీర్చుకోవడానికి ఎలాంటి పని అయినా చేయడానికి రెడీ అయ్యి వేశ్యగా మారినట్లు ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. ఇక జూలై 19 న ఈ సిరీస్ జీ5 లో స్ట్రీమింగ్ కానుంది. మరి ఈ సిరీస్ తో అంజలి ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Advertisement

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×