BigTV English

Roman Babushkin: మోదీ పర్యటన అనంతరం రష్యా ప్రకటన, మాకు అస్సలు ఇష్టం లేదంటూ..

Roman Babushkin: మోదీ పర్యటన అనంతరం రష్యా ప్రకటన, మాకు అస్సలు ఇష్టం లేదంటూ..

Roman Babushkin: భారత పౌరులు రష్యా దేశ సైన్యంలో భాగంగా ఉండాలని తాము కోరుకోవడం లేదని భారత్‌లో రష్యా దౌత్యవేత్త రోమన్ బాబుష్కిన్ అన్నారు. ప్రధాని మోదీ రష్యా పర్యటన ముగిసిన నేపథ్యంలో బాబుష్కిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారతీయ పౌరులు రష్యా సైన్యంలో భాగం కావాలని తాము కోరుకోవటం లేదన్నారు. ఏజెంట్లు మోసం చేయడం వల్ల కొంత మంది భారతీయులు టూరిస్ట్ వీసాలపై వచ్చి రష్యా ఆర్మీలో చేరుతున్నారని తెలిపారు. అంతే కాకుండా ఈ వ్యవహారంలో ఇరు దేశాలు దర్యాప్తు చేసి సమస్యకు త్వరలోనే పరిష్కారం కనుక్కొనే చర్యలు తీసుకుటామని తెలిపారు.


ఈ వ్యవహారంపై భారత్, రష్యాలల్లో ఒకే ఆలోచన ఉంది.. అందుకే త్వరలో ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నాం అని అన్నారు. ఈ వ్యవహారాన్ని రాజకీయం చేయాలని అనుకోవటం లేదని తెలిపారు. ఈ విషయంపై తమకు స్పష్టత ఉందన్నారు. మా సైన్యంలో భారత పౌరులు భంగం కావాలని కోరుకోవటం లేదు. ఈ విషయంపై ఇప్పటి వరకు రష్యా అధికరులు సైతం ఎటువంటి ప్రకటన చేయలేదు.

చాలా మంది భారతీయ పౌరులు కేవలం డబ్బు కోసమే రష్యా సైన్యంలో చేరుతున్నారు. అలాంటి వారిని మేము ఎట్టిపరిస్థితిలో కూడా చేర్చుకోమని బాబుష్కిన్ అన్నారు. రష్యాలో సహాయక సిబ్బందిగా రిక్రూట్ అయిన భారతీయ ఆర్మీకి సంబంధించి సమస్యలు పరిష్కరించాలని తెలిపారు. మాస్కో ఆర్మీలో భారతీయులు భాగం కావాలని కోరుకోలేదని వెల్లడించారు. త్వరలోనే సమస్య పరిష్కారంఅవుతుందని ఆశిస్తున్నట్లు మీడియా సమావేశంలో సమాధానమిచ్చారు.


భారతీయులు డబ్బు సంపాదించుకోవాలనే కోరికతో రష్యా ఆర్మీలో చేరుతున్నారని తెలిపారు. వారు పూర్తిగా వాణిజ్య కారణాల కోసమే ఆర్మీలో చేరారన్నారు. మంగళవారం విదేశాంగ కార్యదర్శి వినయ్‌ కుమార్ మాట్లాడుతూ రష్యన్ సైన్యం సేవల నుంచి భారతీయ పౌరులందరిని విడుదల చేయాలని వాగ్దానం చేశారు. రష్యన్ ఆర్మీ సేవలో తప్పుదారి పట్టించిన భారతీయ పౌరులను ముందస్తుగా విడుదల చేయాలనే అంశాన్ని ప్రధాని ఘట్టిగా లేవనెత్తారు.. దీన్ని మోడీ కూడా స్వీకరించారని అన్నారు. భారత పౌరులను త్వరగా విడుదల చేస్తామని రష్యా అధినేత ఈ సందర్భంగా ప్రస్తావించినట్లు తెలిసింది.

Related News

Minneapolis shooting: మినియాపొలిస్‌లో రక్తపాతం.. చర్చి స్కూల్‌పై రైఫిల్ దాడి.. అసలేం జరిగిందంటే?

Trump Statement: భారత్, పాక్ కి నేనే వార్నింగ్ ఇచ్చా.. మరింత గట్టిగా ట్రంప్ సెల్ఫ్ డబ్బా

Trump’s Tariff War: ట్రంప్ టారిఫ్ స్టార్ట్! భారత్‌కు కలిగే నష్టాలు ఇవే..

India Vs America: అమెరికాతో ఢీ అంటే ఢీ.. ట్రంప్ సుంకాల్ని వెనుక వ్యూహమేంటి?

India-China: సుంకాల యుద్ధం.. చైనాతో భారత్ సయోధ్యకు ప్రయత్నం

Kim Jong Un: కన్నీళ్లు పెట్టుకున్న కిమ్.. నమ్మండి ఇది నిజం

Big Stories

×