E-Paper
Advertisement

Worst Movie: వామ్మో, ఒకే సినిమాలో 30 ముద్దు సీన్లు – బాలయ్య హీరోయిన్ నటించిన ఈ మూవీ.. ఇండియాలోనే వరెస్ట్!

Worst Movie: వామ్మో, ఒకే సినిమాలో 30 ముద్దు సీన్లు – బాలయ్య హీరోయిన్ నటించిన ఈ మూవీ.. ఇండియాలోనే వరెస్ట్!
Advertisement

Worst Movie: కాలం మారింది.ప్రేక్షకుల ఆలోచనలు మారాయి. అలాగే సినిమాకి వచ్చేవారి సంఖ్య తగ్గిపోతోంది. కానీ యువత మాత్రం అధిక సంఖ్యలో చూడటంతో వారిని టార్గెట్ చేసుకుని తీసే సినిమాల సంఖ్య పెరిగిపోయింది. ఈ క్రమంలో ఇండియాలో అతి చెత్త సినిమాగా రికార్డు సృష్టించిన సినిమా ఒకటి ఉంది.

ఈ సినిమాలో 30 ముద్దు సీన్లు ఉన్నప్పటికీ, అవి సినిమాను బతికించలేదు. అంతటి ఘోరమైన సినిమా పేరు ఏమిటంటే.. ‘త్రీజీ’

Advertisement

కొంపదీసి ఆ సినిమాలో ఇమ్రాన్ హష్మీగానీ నటించాడని అనుకుంటున్నారా? అదేం లేదండి. అందులో ఈ సీరియల్ కిస్సింగ్ హీరో లేడు. ఇంతకీ అందులో హీరో, హీరోయిన్లు ఎవరంటే నీల్ నితిన్ ముఖేష్, సోనాల్ చౌహాన్. ఇది 2013లో విడుదలై భారీ డిజాస్టర్ గా నిలిచింది. దేశవ్యాప్తంగా రూ. 5.9 కోట్లు మాత్రమే వసూలు చేసింది. అంతేకాదు అతి దారుణమైన రేటింగ్స్ పొందింది. ఈ హారర్ థ్రిల్లర్ ‘3జీ’కి షీర్షక్ ఆనంద్, శంతను రే చిబ్బర్ దర్శకత్వం వహించారు.

ఇక ముద్దు సీన్ల విషయానికి వస్తే.. బాలీవుడ్ లో ఈ సంప్రదాయం 20వ శతాబ్దం ముందు వరకు లేదు. ఏదో కుటుంబసమేతంగా చూడదగ్గ సినిమాలే అన్నట్టు ఉండేవి. మసాలా కోసం ఒక క్లబ్ సాంగ్ ఉండేది. అందుకోసం బాలీవుడ్ లో హెలెన్ లాంటి నటీమణులు ఉండేవారు. మన తెలుగులో అయితే జ్యోతిలక్ష్మి, జయమాలిని, విజయలలిత, సిల్క్ స్మిత ఇలా ఉండేవారు. అక్కడైనా, ఇక్కడైనా హీరోయిన్లు ఒక పద్ధతి ప్రకారం నటించేవారు.

Advertisement

Also Read: హృతిక్ రోషన్‌పై అల్లు అర్జున్ షాకింగ్ కామెంట్స్, వైరల్ అవుతోన్న వీడియో.. రాజమౌళిపైనా ట్రోలింగ్

అయితే, 1933లో కర్మ అనే సినిమాతో బ్రేక్ వచ్చింది. అందులో తొలిసారి లిప్ టు లిప్ కిస్ సీన్ ఉంది. ఆ సినిమాలో హీరో హిమాన్షు రాయ్, అతని భార్య దేవికా రాణి మధ్య ఇండియన్ స్క్రీన్ పై తొలిసారి ముద్దు సీన్ కనిపించింది. ఆ తర్వాత ఎవరూ అంతదూరం వెళ్లలేదు. వాళ్లు భార్యాభర్తలు కాబట్టి ఎవరూ సీరియస్ గా తీసుకోలేదు.

ఎప్పుడైతే ఇరవయ్యో శతాబ్ధం ప్రారంభమైందో.. సరిగ్గా నాలుగేళ్ల తర్వాత అంటే 2004లో మర్డర్ అనే సినిమా వచ్చింది. అందులో హీరో ఇమ్రాన్ హష్మీ, మల్లికా షెరావత్ మధ్య 27 కిస్సింగ్ సీన్స్ ఉన్నాయి. కథ పరంగా బాగుండటంతో అవీ, ఇవీ తోడై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కురిపించింది. అదిగో అలా మొదలైంది. ఇప్పటికి ఓటీటీకి వచ్చేసరికి విచ్చలవిడి శృంగారంగా మారిపోయింది. ఇప్పుడు హీరోయిన్లే ఐటమ్ సాంగ్స్ చేసేస్తున్నారు. క్లబ్ డ్యాన్సర్లు తెరమరుగైపోయారు.

2013 నుంచి చాలా సినిమాలు విడుదలైనప్పటికి.. 3జీ రికార్డును ఎవరూ బద్దలు కొట్టలేకపోయారు. ఇకపోతే అదే ఏడాది విడుదలైన ‘శుద్ధ్ దేశీ రొమాన్స్’ చిత్రంలో లో 27 ముద్దు సీన్లు ఉన్నాయి. అలాగే రణ్ వీర్ సింగ్, వాణి కపూర్ నటించిన ‘బేఫిక్రే’ లో కూడా 25 ముద్దు సీన్లు ఉన్నాయి. భారతదేశంలో అతి చెత్త సినిమాగా 3జీ నిలవడంతో నెట్టింట వార్తలు వెల్లువై వస్తున్నాయి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×