E-Paper
Advertisement

Nani: సరిపోదా శనివారంలో సమంత.. రివీల్ చేసిన నాని

Nani: సరిపోదా శనివారంలో సమంత.. రివీల్ చేసిన నాని
Advertisement

Nani: న్యాచురల్ స్టార్ నాని, ప్రియాంకా మోహన్ జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సరిపోదా శనివారం. DVV ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో ఎస్ జె సూర్య విలన్ గా కనిపిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆగష్టు 29 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన నాని.. వరుస ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా మారాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో నాని.. ఒక ఆసక్తికరమైన విషయాన్నీ పంచుకున్నాడు. అదేంటంటే.. సరిపోదా శనివారం సినిమాలో సమంత కుడా కనిపించనుందట. సామ్ కు సరిపోదా శనివారంకు ఏదో బంధం ఉందని నాని చెప్పుకొచ్చాడు . అంటే ఇందులో సామ్ క్యామియో లో కనిపిస్తుందని చెప్పకనే చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

ఇక ఈ విషయం తెలియడంతో అభిమానులు నిన్న జరిగింది యాదృచ్చికం కాదని తేలిపోయింది. అసలు నిన్నేం జరిగింది అంటే.. ముంబై ప్రమోషన్స్ కు వెళ్తున్న  నానికి ఎయిర్ పోర్ట్ లో సమంత కనిపించింది. వీరిద్దరూ కొద్దిసేపు ముచ్చటించుకున్నారు. అయితే అది అనుకోకుండా జరిగిన  కలయిక కాదని, కావాలనే వారు  కలిసి.. ప్రమోషన్స్ చేసినట్లు తెలుస్తోంది.

సామ్, నాని అలా కనిపించడంతో సినిమాపై మరింత హైప్ పెరిగింది.  వీరిద్దరి కాంబోలో ఇంకో సినిమా వస్తే బావుంటుంది అని  అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. ఇప్పటికే వీరి కాంబోలో ఈగ, ఎటో వెళ్ళిపోయింది మనసు లాంటి మంచి సినిమాలు వచ్చాయి. ఇక  ఇప్పుడు సరిపోదా శనివారం లో ఈ చిన్నది కనిపిస్తే.. థియేటర్ లు బద్దలు అవ్వడం ఖాయమని చెప్పాలి. మరి సామ్.. ఈ చిత్రంలో ఎలాంటి  పాత్రలో కనిపిస్తుందో చూడాలంటే  వచ్చేవారం వరకు ఆగాల్సిందే.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×