BigTV English

Allu Arjun: హృతిక్ రోషన్‌పై అల్లు అర్జున్ షాకింగ్ కామెంట్స్, వైరల్ అవుతోన్న వీడియో.. రాజమౌళిపైనా ట్రోలింగ్

Allu Arjun: హృతిక్ రోషన్‌పై అల్లు అర్జున్ షాకింగ్ కామెంట్స్, వైరల్ అవుతోన్న వీడియో.. రాజమౌళిపైనా ట్రోలింగ్

Director Rajamouli Allu arjun old video comments on Hrithik Roshan viral: బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ కల్కి మూవీపై గతంలో కామెంట్స్ చేశారు. ఓ పాన్ ఇండియా స్టార్ హీరోని ఈ మూవీలో కేవలం ఓ జోకర్ గా చూపించారని అసలు ఆయన లుక్కే బాగోలేదని అంటూ కల్కి మూవీ తనకు నచ్చలేదని కామెంట్స్ పెట్టారు. దానితో అతని వ్యాఖ్యలపై తీవ్ర దుమారమే రేగింది. అంతకు ముందు కేసీఎప్ నటుడు యష్ మీద చేసిన కామెంట్స్ పైనా నెటిజన్స్ అర్షద్ వార్సీ పై విరుచుకుపడ్డారు. సౌత్ హీరోలను టార్గెట్ చేసి మాట్లాడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. కొందరు నటులు కూడా అర్షద్ వార్సీ అలా మాట్లాడటం తగదని పోస్టింగులు పెడుతున్నారు.


పాత వీడియో వైరల్
అయితే ఇదే సమయంలో అల్లు అర్జున్, రాజమౌళి హృతిక రోషన్ పై చేసిన కామెంట్స్ వీడియో పాతది ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అది ఎప్పుడో బిర్లా రిలీజ్ సమయంలో ఓ ప్రెస్ మీట్ లో రాజమౌళి బిర్లాగా నటించిన ప్రభాస్ ని పొగుడుతూ ఇలాంటి నటుడు ఉన్నందుకు మనమంతా గర్వపడాలి. నిజానికి ధూమ్ 2 సినిమా చూశాక మన తెలుగులో ఇలాంటి నటుడు లేరా అని బాధపడేవాడిని. ప్రభాస్ మూవీ బిల్లా ట్రైలర్ చూశాక ప్రభాస్ నటన ముందు హృతిక్ ఎందుకూ పనికిరాడనిపించిందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Also Read:భారీ నష్టాల్లో హనుమాన్ ప్రొడ్యూసర్‌.. కొత్త ఆఫర్ తీసుకొచ్చిన పూరీ!


అయితే అదే సమయంలో మరో అతిథిగా వచ్చిన అల్లు అర్జున్ సైతం రాజమౌళి సరిగ్గానే చెప్పారు. డార్లింగ్ ప్రభాస్ గురించి ఎంత మాట్లాడినా తక్కువే. ప్రభాస్ నటనతో పోల్చుకుంటే హృతిక్ తక్కువే అనిపించింది. అద్భుతమైన కటౌట్ తో ఆరడుగుల ప్రభాస్ ఫైట్స్ చూస్తుంటే రెండు కళ్లూ చాలవనిపిస్తోంది. అంటూ హృతిక్ రోషన్ పై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. అప్పట్లో ఇవి అంతగా సోషల్ మీడియా అందుబాటులో లేని రోజుల్లో చేసిన కామెంట్స్ కావడంతో అంతా సైలెంట్ గా ఉన్నారు. ఇప్పుడు అర్షద్ వార్సీ కల్కి కామెంట్స్ తో మరోసారి బిల్లా కు సంబంధించిన పాత వీడియో వైరల్ గా మారింది.

 

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×