BigTV English

Balakrishna: నటి సంయుక్త కోసం బాలయ్య బేరాలు…ఈ యాంగిల్ కూడా ఉందా?

Balakrishna: నటి సంయుక్త కోసం బాలయ్య బేరాలు…ఈ యాంగిల్ కూడా ఉందా?

Balakrishna: టాలీవుడ్ స్టార్ హీరో, బాలకృష్ణ (Balakrishna) ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు ఈయన వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు. ప్రస్తుతం బాలయ్య తన వయసుకు తగ్గ పాత్రలలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తూ వరుస హిట్టు సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్నారు. ఇటీవల బాలకృష్ణ డాకు మహారాజ్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా కూడా 100 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. ప్రస్తుతం బాలయ్య బోయపాటి శ్రీను(Boyapati Sreenu) దర్శకత్వంలో అఖండ 2(Akhanda 2) సినిమా పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా దసరా లేదా ఈ ఏడాది చివరిన డిసెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది.


ఇక బాలకృష్ణ కేవలం నటుడిగా మాత్రమే కాకుండా రాజకీయ నాయకుడిగా కూడా మంచి సక్సెస్ అందుకున్నారు. ఈయన హిందూపురం నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా భారీ మెజారిటీతో విజయం సాధించి రాజకీయాలలో కూడా తిరుగు లేదనిపించుకున్నారు. ఇలా రాజకీయాలలోనూ, సినిమాలలో కొనసాగుతున్న బాలయ్య తనలో మరో యాంగిల్ కూడా దాగి ఉంది అంటూ ఏకంగా అన్ స్టాపబుల్ టాక్ షో కి హో స్ట్ గా వ్యవహరిస్తూ అందరిని ఆశ్చర్యపరిచారు. మొదట్లో ఈ కార్యక్రమానికి బాలయ్య హోస్ట్ అని తెలియగానే అందరూ కూడా బాలకృష్ణ ఏంటి హోస్ట్ గా మారడం ఏంటి అంటూ విమర్శలు చేశారు.

అన్ స్టాపబుల్ …


ఇలా తన గురించి విమర్శలు చేసిన వారికి బాలయ్య తన మాట తీరుతోనే గట్టి సమాధానం చెప్పారని చెప్పాలి. అన్ స్టాపబుల్ టాక్ షో ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే అప్పటివరకు కూడా బాలయ్య ఎలాంటి బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించలేదు కానీ అన్ స్టాపబుల్ తర్వాత పలు బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయారు. ఈ క్రమంలోనే ఈయన వేగ జ్యువెలర్స్(Vega Jewellery) నగల సమస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

నగల షోరూం ప్రారంభోత్సవం..

తాజాగా ఈ నగల సంస్థకు సంబంధించిన సరికొత్త షోరూం ప్రారంభించడం కోసం బాలకృష్ణ నటి సంయుక్త మీనన్ తో కలిసి ఏలూరుకు (Eluru)వెళ్లారు. అక్కడ బాలయ్యకు అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ షోరూం ప్రారంభించిన తర్వాత బాలకృష్ణ షోరూంలోని ఒక లాంగ్ హారం తీసుకొని సంయుక్త మీనన్ తో ఆ నగ గురించి మాట్లాడుతూ.. దీని ధర ఎంత? 10 లక్షలకే ఇస్తారా అంటూ బేరం ఆడటం మొదలుపెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారడంతో బాలయ్య ఇలా బేరాలు కూడా ఆడుతారా అంటూ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఇక బాలకృష్ణ సంయుక్త మీనన్ ఇద్దరు ఆఖండ 2 సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×