WTC 2025 Final : ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2025 ఫైనల్ మ్యాచ్ ( World Test Championship 2025 final match ) జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య బిగ్ ఫైట్ జరుగుతోంది. ఈ రెండు జట్లు కూడా అద్భుతంగా రాణిస్తున్నాయి. ఒక సెషన్ లో ఆస్ట్రేలియా పై చేయి సాధిస్తే..మరో సెషన్ లో దక్షిణాఫ్రికా పై చేయి సాధిస్తుంది. ఈ నేపథ్యంలోనే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ గెలుపు రెండు జట్ల మధ్య ఉత్కంఠ గా మారింది. ఆస్ట్రేలియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ మూడో రోజుకు చేరుకుంది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 282 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సౌతాఫ్రికా ఒక వికెట్ కోల్పోయింది. మిచెల్ స్టార్క్ బౌలింగ్ లో రికెల్టన్ 6 పరుగుల కీపర్ అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి మొదటి వికెట్ గా వెనుదిరిగాడు.
Also Read : Finn Allen : గేల్ రికార్డు బ్రేక్.. న్యూజిలాండ్ ఓపెనర్ సిక్సర్లతో ఊచకోత
ఈ మ్యాచ్ లో విజయం సాధించడానికి సౌతాఫ్రికా కి అద్భుతమైన అవకాశం అనే చెప్పవచ్చు. ప్రస్తుతం సౌతాఫ్రికా ఆటగాళ్లు మార్క్రమ్, వియాన్ ముల్డర్ అద్బుతమైన బ్యాటింగ్ చేస్తున్నారనుకునే తరుణంలోనే 17.4 ఓవర్ లో స్టార్క్ బౌలింగ్ లో లబుషెన్ క్యాచ్ పట్టడంతో ఔట్ అయ్యాడు. 50 బంతుల్లో 27 పరుగులు చేశాడు ముల్డర్. మరోవైపు ఆస్ట్రేలియా బౌలర్లు 282 టార్గెట్ ని కాపాడుకుంటే ఆస్ట్రేలియా విజయం సాధిస్తుంది. లేదంటే.. దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్స్ నిలకడగా ఆడితే WTC ఫైనల్ లో విజయం సాధించవచ్చు. రెండు జట్లకు ఈ మ్యాచ్ ఉత్కంఠగా జరుగుతుందనే చెప్పవచ్చు. ముఖ్యంగా ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ లో ( WTC 2025) ఆస్ట్రేలియా (Australia) అలాగే సౌత్ ఆఫ్రికా జట్లు రెండు కూడా అదరగొడుతున్నాయి. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 212 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. అదే సమయంలో దక్షిణాఫ్రికా మొదటి ఇన్నింగ్స్ లో 138 పరుగులకే ఆల్ అవుట్ కావడం గమనార్హం.
Also Read : Sara-Shubman Gill: రాకుమారుడి కోసం లండన్ వెళ్లిన సారా టెండూల్కర్ ?
ఇక దీంతో ఆస్ట్రేలియా కు లీడ్ భారీగానే లభించింది. ఇక రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా కాస్త తడబడింది. రెండో రోజు ముగిసే సమయానికి… 8 వికెట్లు నష్టపోయిన ఆస్ట్రేలియా 144 పరుగులు చేసింది. దీంతో ఈ మ్యాచ్ లో 218 పరుగుల లీడ్ సంపాదించింది ఆస్ట్రేలియా. ఇక ఇవాళ మూడవ రోజులో ఆ చివరి రెండు వికెట్లు తీసేసి.. దక్షిణాఫ్రికా ప్రస్తుతం బ్యాటింగ్ చేస్తోంది. దక్షిణాఫ్రికా ఇప్పటి వరకు 2 వికెట్లను కోల్పోయింది. మరో 200 పరుగులు చేయగలిగితే.. సులభంగా WTC కప్ ని ముద్దాడనుంది. లేదంటే.. మళ్లీ మరోసారి ఆస్ట్రేలియానే విజయం సాధిస్తుంది. మొత్తానికి WTC ఫైనల్ లో ఆస్ట్రేలియా బౌలర్లు రాణిస్తారా..? లేక దక్షిణాఫ్రికా బ్యాటర్లు రాణిస్తారా..? అనేది వేచి చూడాలి మరీ.