BigTV English

Balakrishna : కొత్త ఇంటికి మారుతున్న బాలయ్య.. అసలు రీజన్ అదేనా?

Balakrishna : కొత్త ఇంటికి మారుతున్న బాలయ్య.. అసలు రీజన్ అదేనా?

Balakrishna : ఆరుపదుల వయసులో కూడా వరుస హిట్లతో దూసుకుపోతున్న హీరో నందమూరి బాలకృష్ణ. బాలకృష్ణకు కొన్ని విషయాల్లో ప్రత్యేకమైన సెంటిమెంట్లు ఉన్నాయి అన్న సంగతి అందరికీ తెలిసిందే. పూజలు, హోమాలు ,యాగాలు ఇలాంటివి తరచూ చేయించే బాలకృష్ణకు వాస్తు విషయంలో కూడా ఎన్నో పట్టింపులు ఉన్నాయి. అయితే అఖండకు ముందు బాలకృష్ణ కెరియర్ లో డిజాస్టర్ చిత్రాలు కూడా ఉన్నాయి. అందుకే బాలకృష్ణ ఒక నిర్ణయం తీసుకున్నారట.ఈ నేపధ్యంలో ప్రస్తుతం బాలకృష్ణకు తీసుకున్న ఆ నిర్ణయం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.


అది మరి ఏమిటో కాదండి.. వాస్తు పరంగా ఇల్లు అచ్చి రావడం లేదు అనే ఉద్దేశంతో బాలయ్య వేరే ఇంటికి షిఫ్ట్ అవ్వాలి అని ఫిక్స్ అయ్యాడట. ఇప్పుడు బాలయ్య మారుతున్న ఆ ఇల్లు కూడా చిరంజీవి ఇంటి పక్కనే కావడం మరొక విశేషం. పొద్దున నిద్రలేచినప్పటి నుంచి తిథి..నక్షత్రం ,వారం..వర్జం చూడకుండా బాలయ్య ఇంట్లో నుంచి అడుగు కూడా బయట పెట్టరట. అందుకే కెరియర్ పరంగా బాగా క్లిక్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఈ నందమూరి అందగాడు ఇల్లు మారాలని ఫిక్స్ అయ్యాడు.

అందుకే బాలయ్య జూబ్లీహిల్స్ లో ఉన్న మరొక ఇంటికి మరమ్మత్తులు చేస్తున్నారట .ప్రస్తుతం జూబ్లీహిల్స్ లో చిరంజీవి నివాసం ఉంటున్న మెగా కాంపౌండ్ సమీపంలో ఉన్న ఇంటికే బాలయ్య షిఫ్ట్ కాబోతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.వచ్చే ఏడాది ఫిబ్రవరిలో బాలయ్య నూతన గృహప్రవేశం ఉండే అవకాశాలు ఉన్నాయని టాక్. అయితే ఇంకా దీనిపై పూర్తి స్పష్టత లేదు.


బాలయ్య నటించిన గత మూడు సినిమాలు 100 కోట్ల కలెక్షన్స్ రాబట్టి సంచలన విజయాలను నమోదు చేశాయి. ఆహా ప్లాట్ ఫామ్ పై అన్ స్టాపబుల్ అనే టాక్ షో తో బాలయ్య కు మంచి పాపులారిటీ వచ్చింది. అందుకే ఆ షో సీజన్ పై సీజన్ చేసుకుంటూ దూసుకు వెళ్తుంది. రీసెంట్ గా అనిల్ రావిపూడి డైరెక్షన్లో వచ్చిన బాలయ్య మూవీ భగవంత్ కేసరి దసరా పండక్కి విడుదలై బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించింది. ఈ నేపథ్యంలో కొందరు ఇల్లు మారడం వెనక కారణం కెరీర్ కాదని..వ్యక్తిగతం లేక రాజకీయ కారణాల వల్ల మారుతూ ఉండొచ్చని భావిస్తున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×