BigTV English

Israel-Hamas War : ఇజ్రాయెల్ గూఢచారిగా హమాస్ నాయకుడి కొడుకు.. లక్ష్యమేంటో చెప్పిన యూసఫ్

Israel-Hamas War : ఇజ్రాయెల్ గూఢచారిగా హమాస్ నాయకుడి కొడుకు.. లక్ష్యమేంటో చెప్పిన యూసఫ్

Israel-Hamas War : హమాస్ వ్యవస్థాపకుడు షేక్ హసన్ యూసఫ్ కుమారుడు మొసాబ్ హసన్ యూసఫ్ ఉగ్రవాద సంస్థ యొక్క అసలు కోణాన్ని స్పష్టంగా తెలియజేశాడు. ఆ ఉగ్రవాద సంస్థ నుంచి బయటికొచ్చిన యూసఫ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. గతంలో ట్విట్టర్ (X) లో పోస్ట్ చేసిన ఒక వీడియోలో యూసఫ్ హమాస్ గురించి మాట్లాడుతూ.. ఒక నిజం చెప్పినట్లు తెలుస్తోంది. రెండునిమిషాల నిడివి ఉన్న ఆ వీడియోలో హమాస్ కు అధికారం ఇచ్చేందుకు గాజా ప్రజలు తీవ్రంగా కష్టపడుతున్నారని పేర్కొన్నాడు.


ఇజ్రాయెల్ పాలనలో.. గాజా ప్రజలు చాలాకాలంగా అణచివేతకు గురయ్యారని తెలిపాడు. అలాగే హింసను, అనేక యుద్ధాలను ఎంతో సహనంతో భరించారని.. ఇదంతా గాజాలో హమాస్ అధికారం కోసం, రాజకీయ ఆశయం కోసమే చేశారని చెప్పాడు. అంతేకాదు.. హమాస్ కు డబ్బు కావలసినప్పుడల్లా యుద్ధం చేస్తుందని, ఇది వారికి ఆట అని యూసఫ్ పేర్కొన్నాడు. ఇజ్రాయెల్.. పాలస్తీనా రక్తంతో తన దాహాన్ని తీర్చుకోవాలనుకోవడం లేదని యూసఫ్ ఆ వీడియోలో చెప్పుకొచ్చాడు.

అక్టోబర్ లో గాజాలోని ఒక ఆసుపత్రిలో పేలుడు జరిగిన తర్వాత యూసఫ్.. ఇజ్రాయెల్ ను సపోర్ట్ చేస్తూ వ్యాఖ్యలు చేశాడు. ఒక మిస్ ఫైర్ కారణంగా జరిగిన పేలుడు వల్ల ఆసుపత్రిలో ఆశ్రయం పొందుతున్న వందలాది శరణార్థులు మరణించడంతో.. అందరూ ఇజ్రాయెల్ ను నిందించారు కానీ.. నిజానికి ఇజ్రాయెల్ ఇది కావాలని చేసిన ప్రతిచర్య కాదన్నాడు. ఇజ్రాయెల్ ఒక ప్రజాస్వామ్య దేశమని, ప్రతిదానికి జవాబుదారిగా ఉందన్నాడు.


పాలస్తీనాకు చెందిన పిల్లలు, సమాజం అంతా హమాస్ ఉగ్రవాదులు హైజాక్ చేశారని, వారికి సపోర్ట్ చేసేవారెవరైనా సరే.. ఈ నేరంలో పాలు పంచుకుంటారని వివరించాడు. మానవ జీవితంకంటే తమ ఆదర్శాలకే విలువనిచ్చే హమాస్ కు.. యూసఫ్ ఒక విన్నపం చేశాడు. రక్షణ లేని పౌరుల ప్రాణాలను పణంగా పెట్టిన మీరు.. వారిని మానవకవచాలుగా మాత్రం ఉపయోగించవద్దని సూచించారు. గాజాలో శరణార్థులు ఆకలికేకలతో అల్లాడుతుంటే.. హమాస్ తీవ్రవాదులు మాత్రం విలాసవంతంగా జీవించారని వాపోయాడు. హమాస్ చేసే ప్రతిచర్య ఇజ్రాయెల్ ను నాశనం చేయడానికే తప్ప.. పాలస్తీనాను నిర్మించడానికి కాదని తీవ్ర ఆరోపణలు చేశాడు.

మోసబ్ హసన్ యూసఫ్ ఎవరు?

మోసబ్ హసన్ యూసఫ్.. 60 మంది హమాస్ వ్యవస్థాపక నాయకులలో ఒకరైన షేక్ హసన్ యూసఫ్ కుమారుడు. అతని తండ్రి ఈ ఏడాది అక్టోబర్ మధ్యలో వెస్ట్ బ్యాంక్‌లో జరిగిన దాడిలో అరెస్టయ్యాడు.

‘గ్రీన్ ప్రిన్స్’గా పిలవబడే యూసఫ్, హమాస్ నుండి బయటికి వచ్చేశాడు. 1997 నుండి 2007 వరకు ఇజ్రాయెల్ గూఢచారిగా పనిచేశాడు. అతను ఆత్మాహుతి బాంబు దాడులు, ఉగ్రవాద చర్యలను నిరోధించడంలో సహాయపడే విలువైన గూఢచారాన్ని అందించాడు.

అమెరికన్ మీడియా సంస్థలకు ఇచ్చిన అనేక ఇంటర్వ్యూలలో.. యూసెఫ్ తన తండ్రి.. హమాస్ ప్రాదేశిక పాలస్తీనాను స్వాధీనం చేసుకోవడంపై మాత్రమే దృష్టి పెట్టలేదని, అంతులేని మత యుద్ధంపై దృష్టి కేంద్రీకరించారని హెచ్చరించాడు.

DailyMail నివేదిక ప్రకారం, యూసఫ్ తన తండ్రి ఉద్దేశాలు, యూదులను ‘నాశనం’ చేయడం, ప్రపంచవ్యాప్తంగా షరియా చట్టాన్ని స్థాపించాలనే హమాస్ లక్ష్యం గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ ఉనికికి మద్దతిచ్చే వారిని హతమార్చాలని, ఆ తర్వాత ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించాలన్నది కూడా హమాస్ లక్ష్యమని తెలిపాడు.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×