E-Paper
Advertisement

Balayya and jr Ntr : బాలయ్య 109 ఫిక్స్..అబ్బాయికి బాబాయి భారీ షాక్..

Balayya and jr Ntr :  బాలయ్య 109 ఫిక్స్..అబ్బాయికి బాబాయి భారీ షాక్..
Advertisement
Balayya and jr Ntr

Balayya and jr Ntr : టాలీవుడ్ లో నందమూరి కుటుంబానికి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. నందమూరి నట వారసులుగా ఇప్పటికే ఆ కుటుంబం నుంచి ఎందరో హీరోలు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. వీరందరిలో బాలకృష్ణ ,జూనియర్ ఎన్టీఆర్ స్టార్ హీరోలుగా తమ సత్తా చాటుతున్నారు.

వరుస హిట్ లతో బాబాయి..అబ్బాయి ఇద్దరు మంచి ఫామ్ లో ఉన్నారు. రాబోయే సంక్రాంతికి అబ్బాయికి బాబాయి పెద్ద షాక్ ఇవ్వబోతున్నాడు అని ఇండస్ట్రీ టాక్. ఇప్పటికే బాలయ్య 109 మూవీ గురించి వచ్చిన క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. 

Advertisement

షూటింగ్ ప్రారంభమైన దానికి ఇండికేషన్ గా గొడ్డలి పైన సన్ గ్లాసెస్ తో ఉన్న సూపర్ హైప్ పోస్టర్ ను మూవీ మేకర్స్ విడుదల చేశారు.శరవేగంగా షూటింగ్ పూర్తి చేసి సంక్రాంతి బరిలో మూవీని దింపడానికి మేకర్ స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యారు అని వార్తలు వచ్చాయి. వరుస హిట్ మూవీస్ తో నటసింహం మంచి జోరు మీద ఉంది.. ఈ నేపథ్యంలో రాబోయే మూవీపై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ ఏడాది ఆరంభంలో సంక్రాంతికి వీరసింహారెడ్డి బాక్సాఫీస్ వద్ద వీరవిహారం చేసింది. అదే జోరుతో దసరాకి వచ్చిన ‘భగవంత్ కేసరి’ వసూళ్ల వర్షం కురిపించింది. అఖండ తర్వాత ఇది హ్యాట్రిక్ విజయం కావడంతో బాలయ్య ఫుల్ స్పీడుతో దూసుకుపోతున్నాడు. 

అయితే ఇప్పుడు ఈ రిలీజ్ విషయంపై మరొక అప్డేట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. బాలయ్య సినిమా సంక్రాంతికి కాకుండా వచ్చే సమ్మర్ కి సందడి చేయబోతోందట. మరోపక్క జూనియర్ ఎన్టీఆర్ దేవర చిత్రంతో ప్రేక్షకుల ముందుకి నెక్స్ట్ సమ్మర్ కి వస్తున్నాడు .ఆర్ఆర్ఆర్ సక్సెస్ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న నెక్స్ట్ మూవీ దేవర. అందుకే ఈ చిత్రం పై అంచనాలు భారీగా ఉన్నాయి. తారక్, కొరటాల కాంబోలో వస్తున్న ఈ మూవీ తో శ్రీ దేవి కూతురు జాన్వి కపూర్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీ రెండు భాగాలుగా రిలీజ్ చేయాలి అని మేకర్స్ అనుకున్న విషయం తెలిసిందే. ఇందులో పార్ట్ 1 ఏప్రిల్ 5వ తారీఖున గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది.

Advertisement

1980 నేపథ్యంలో సాగే బాలయ్య కథను వీలైనంత త్వరగా పూర్తిచేసి సమ్మర్లో విడుదల చేయబోతున్నట్లు ఇండస్ట్రీ టాక్. పైగా ఈ చిత్రం వచ్చే సంవత్సరం మార్చి 29వ విడుదలయ్య అవకాశం ఉందని తెలుస్తోంది. మార్చి 28వ తేదీకి లెజెండ్ సినిమా విడుదలై 10 సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ నేపథ్యంలో 29వ తారీఖున బాలయ్య 109 మూవీ విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారట.

ఇదే కనుక జరిగితే ఎన్టీఆర్ మూవీకి వారం రోజుల ముందు బాలయ్య మూవీ విడుదలవుతుంది. అంటే ఈ రెండు మూవీస్ మధ్య భయంకరంగా క్లాష్ వచ్చే అవకాశం ఉంది. ఇదే జరిగితే అబ్బాయికి..బాబాయ్ నుంచి మంచి షాక్ ఇచ్చినట్లు అవుతుంది అని అందరూ అనుకుంటున్నారు.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×