E-Paper
Advertisement

Bandla Ganesh Comments: ప్రజల చూపు కాంగ్రెస్ వైపే.. తెలంగాణలో అధికారం ఖాయం..

Bandla Ganesh Comments: ప్రజల చూపు కాంగ్రెస్ వైపే..  తెలంగాణలో అధికారం ఖాయం..
Advertisement
Bandla Ganesh Latest Comments

Bandla Ganesh Latest Comments(Telangana news updates):

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం ఖాయమనే చర్చ సర్వత్రా నడుస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే చాలా మంది బీజేపీ, బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లో చేరిపోయారు. చేరికల ప్రక్రియ రోజురోజు మరింత జోరుగా సాగుతోంది. ఎన్నికల సమీపిస్తున్న కొద్దీ కాంగ్రెస్ బలం మరింత పెరుగుతోందని అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో సినీ నిర్మాత, కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విపక్షాలు సోషల్‌ మీడియా వైపు చూస్తుంటే.. జనాలు మాత్రం కాంగ్రెస్ వైపు చూస్తున్నారని వ్యాఖ్యానించారు.

Advertisement

నవంబర్ 30న జరిగే పోలింగ్ కోసం ఓటర్లు ఎదురు చూస్తున్నారని బండ్ల గణేష్ అన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అద్భుతం స్తృష్టిస్తుందని జోస్యం చెప్పారు. దేశం కోసం గాంధీ ఫ్యామిలీ ఎన్నో త్యాగాలు చేసిందన్నారు. దేశం కోసం సోనియా, రాహుల్, ప్రియాంక సేవ చేస్తున్నారని తెలిపారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను చెప్పిన ప్రకారమే అమలు చేస్తుందని భరోసా ఇచ్చారు. తాను పుట్టినప్పటి నుంచి కాంగ్రెస్ కార్యకర్తనేనని స్పష్టం చేశారు. ఇంతవరకు కాంగ్రెస్‌కు తప్ప వేరే పార్టీకి ఓటేయలేదని బండ్ల గణేష్ అన్నారు.

కురుక్షేత్ర మహాసంగ్రామంలో కాంగ్రెస్ ఘన విజయం ఖాయమని బండ్ల గణేష్ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌లో సీఎం ఎవరనేది బీఆర్‌ఎస్‌కు సంబంధం లేదన్నారు. డిసెంబర్ 9న ఎల్బీస్టేడియంలో కాంగ్రెస్ సీఎం ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరుగుతుందని జోస్యం చెప్పారు.

Advertisement

.

.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×