Balayya : నందమూరి నటసింహం బాలయ్య గురించి ప్రత్యేక పరచాల అవసరం లేదు. నందమూరి తారక రామారావు వారసుడుగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ చేతన టాలెంట్ తో ఒక్కో సినిమాతో ఒక్కో మెట్టు ఎదుగుతూ ఇప్పుడు స్టార్ హీరో అయ్యాడు. పవర్ ఫుల్ డైలాగులు యాక్షన్ సీన్లలో బాలయ్య అదరగొడతాడు.. ఒక్క మాటలో చెప్పాలంటే మాస్ సినిమాలకు కేరాఫ్ హీరో బాలయ్య. దేవుడి మీద విపరీతమైన భక్తి చూపించే బాలయ్య నోటి నుండి 24 గంటలు ఎదో ఒక మంత్రం ఉచ్చరణలో ఉంటుంది.. ఆయన స్టేజ్ మీద ఏది మాట్లాడినా ఖచ్చితంగా దేవుడి గురించి ఏదో ఒక మాట మాత్రం మాట్లాడుతూనే ఉంటాడు. తాజాగా బాలయ్య చేసిన అతి పెద్ద మిస్టేక్ వల్లే మోక్షజ్ఞ ఎంట్రీ ఆలస్యమైందని ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అసలు బాలయ్య చేసిన మిస్టేక్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
జాతకాలను బాలయ్య నమ్ముతాడా..?
నందమూరి వారసుడు బాలయ్య నటించిన సినిమాలు ఈ మధ్య బాగానే హిట్ అవుతున్నాయి. అందుకే కంటెంట్ తో పాటు జ్యోతిష్యం కూడా అని కొందరు అభిప్రాయ పడుతున్నారు. అయితే దైవ భక్తి గల బాలయ్య, తన కొడుకు విషయం లో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. బాలయ్య కు ఒక పూజారి ఎన్నో ఏళ్ళ నుండి తన సొంత కుటుంబ సభ్యుడిగా మెలుగుతూ వస్తున్నాడట.. నందమూరి ఫ్యామిలీలో ఎలాంటి శుభకార్యాన్ని మొదలు పెట్టాలన్న ఆ పూజారిని అడిగి తెలుసుకుని మరి బాలయ్య మొదలు పెడతాడట. అయితే మోక్షజ్ఞ విషయంలో కూడా బాలయ్య అదే చేశాడు.. కానీ అవకాశాలు రాలేదు.. మరి మోక్షజ్ఞ విషయంలో బాలయ్య ఏం చేశాడో చూడండి..
Also Read : హిస్టరీ రిపీట్.. ‘పుష్ప 2’ ను వెనక్కి నెట్టేసిన ‘మ్యాడ్ 2’..!
మోక్షజ్ఞ సినిమాకు ఆలస్యమెందుకు..?
బాలయ్య వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి ఫ్యాన్స్ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు ఇప్పుడు తమ హీరో వారసుడ్ని స్క్రీన్ మీద చూద్దాం అని ఆశ పడుతున్నారు. మోక్షజ్ఞ లుక్ అయితే రివీల్ చేశారు కానీ.. సినిమా చేసేందుకు డైరెక్టర్ దొరకలేదు. అందుకు కారణం బాలయ్య అని టాక్. అవును నిజమే.. ప్రతి పనిని పూజారి చెప్పినట్లే చేస్తూ వస్తున్నాడు. ఇక మోక్షజ్ఞ ఎంట్రీ కూడా ఆయన చెప్పినట్లే చేశాడు. 30 ఏళ్ళ వయస్సు దాటిన తర్వాత ఎంట్రీ ఇస్తే మంచి ఫలితాలు అందుతాయని చెప్పాడట. పూజారి చెప్పినట్టుగానే మోక్షజ్ఞకు 30 ఏళ్ళ వయస్సు వచ్చే వరకు ఎదురు చూసి ఇప్పుడు లాంచ్ చేయాలనుకున్నారు కానీ డైరెక్టర్ కుదరలేదు ప్రస్తుతం సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మోక్షజ్ఞను లాంచ్ చేయబోతున్నట్లు టాక్.. త్వరలోనే ఈ మూవీపై అధికారిక ప్రకటన రాబోతున్నట్లు టాక్.. ఇప్పటికే మోక్షజ్ఞ ఎంట్రీ ఆలస్యమైంది ఇక ఇప్పుడు కూడా ఆలస్యం చేస్తే అతను సినిమాలు చేసి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకోవడానికి ఇంకాస్త ఆలస్యం అవుతుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.