BigTV English

OTT Movie : అమ్మ బాబోయ్ ఎగ్జామ్స్ లో ఇలా కూడా కాపీ కొట్టొచ్చా? చిన్న పిల్లలు చూడకూడని మూవీ

OTT Movie : అమ్మ బాబోయ్ ఎగ్జామ్స్ లో ఇలా కూడా కాపీ కొట్టొచ్చా? చిన్న పిల్లలు చూడకూడని మూవీ

OTT Movie  : ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సినిమాలు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. వీటిలో కొన్ని సినిమాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. సినిమా మొదటి నుంచి చివరి దాకా, చూపుతిప్పుకోకుండా చేస్తాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో యాక్షన్ సన్నివేశాలు ఏమాత్రం ఉండవు. అయినా కూడా ఈ సినిమా ఆకట్టుకుంటుంది. ఒక తెలివైన విద్యార్థి డబ్బు కోసం, ఎగ్జామ్స్ లో మార్కులు తెప్పించే విధంగా చేస్తుంది. ఈ మూవీ చివరి వరకు ఆసక్తికరంగా సాగుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది? అనే వివరాల్లోకి వెళితే …


నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) లో

ఈ థాయ్ హీస్ట్ త్రిల్లర్ మూవీ పేరు ‘బాడ్ జీనియస్’ (Bad Genius). 2017లో వచ్చిన ఈ మూవీకి నట్టావుట్ పూన్‌పిరియా దర్శకత్వం వహించాడు. ఈ సినిమా నిజ జీవిత సంఘటన ఆధారంగా తెరకెక్కింది. ఇది SAT పరీక్షలలో జరిగిన మోసం గురించి వివరిస్తుంది. ఈ స్టోరీ ఒక తెలివైన విద్యార్థిని చుట్టూ తిరుగుతుంది. ఆమె తన తెలివిని ఉపయోగించి పరీక్షలలో మోసం చేయడం ద్వారా డబ్బు సంపాదిస్తుంది. బాడ్ జీనియస్ 2017 మే 3 న థాయ్‌లాండ్‌లో విడుదలైంది. థాయ్ బాక్సాఫీస్ వద్ద రెండు వారాల పాటు మొదటి స్థానంలో నిలిచింది. 2017లో అత్యధిక వసూళ్లు చేసిన థాయ్ చిత్రంగా 100 మిలియన్ భాట్‌లను సంపాదించింది.ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) లో అందుబాటులో ఉంది.


స్టోరీలోకి వెళితే

లిన్ అనే అమ్మాయి చదువులో చాలా చురుకైన విద్యార్థి. ఆమె తండ్రి ఒక సాధారణ ఉపాధ్యాయుడు. లిన్‌కి ఒక పేరుపొందిన స్కూల్‌లో స్కాలర్‌షిప్ దొరుకుతుంది. అక్కడ ఆమె ధనవంతులైన విద్యార్థులతో స్నేహం చేస్తుంది. ఒక రోజు ఆమె స్నేహితురాలు గ్రేస్, ఆమె బాయ్‌ఫ్రెండ్ పాట్ లిన్‌ని పరీక్షలో హెల్ప్ చేయమని అడుగుతారు. ఎందుకంటే వారికి మంచి మార్కులు కావాలి. లిన్ తన తెలివిని ఉపయోగించి, పియానో నోట్స్ లాంటి సంకేతాలతో సమాధానాలను ఇతరులకు చేరవేసే ఒక పద్ధతిని అభివృద్ధి చేస్తుంది. ఈ పనికి ఆమెకు డబ్బు కూడా లభిస్తుంది. కొంతకాలం తర్వాత ఇది ఒక పెద్ద వ్యాపారంగా మారుతుంది. లిన్‌తో పాటు బ్యాంక్ అనే మరో తెలివైన విద్యార్థి కూడా ఈ ప్లాన్ లో చేరతాడు. వారు అంతర్జాతీయ STIC (SAT) పరీక్షలలో డబ్బుకోసం కొంతమందికి హెల్ప్ చేయాలని నిర్ణయిస్తారు.

అయితే ఈ పరీక్ష సిడ్నీలో జరుగుతుంది. వారు అక్కడికి వెళ్లి సమాధానాలను తమ దేశంలోని స్నేహితులకు పంపాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో వారు ఎన్నో ఒత్తిళ్లను ఎదుర్కొంటారు. చివర్లో, లిన్ తన చర్యల గురించి ఆలోచిస్తుంది. ఆమె తన తప్పును ఒప్పుకుని, ఈ మోసపూరిత జీవితం నుండి బయటపడాలని అనుకుంటుంది. బ్యాంక్ మాత్రం ఇదే మార్గాన్ని కొనసాగించాలని భావిస్తాడు. కానీ లిన్ తన జీవితాన్ని సరిదిద్దుకోవడానికి దూరంగా వెళ్లిపోతుంది. ఈ సినిమా ఉత్కంఠభరితంగా ఉంటుంది. విద్యా వ్యవస్థలోని లోపాలు గురించి లేవనెత్తుతుంది. ఇది ఒక హీస్ట్ సినిమా లాగా ఉన్నప్పటికీ, పరీక్షల చుట్టూ తిరిగే కథ కావడం వల్ల ఇది ప్రత్యేకంగా నిలుస్తుంది.

Related News

Mothevari Love story: స్ట్రీమింగ్ కి సిద్ధమైన మోతెవరి లవ్ స్టోరీ.. తెలంగాణ గ్రామీణ ప్రేమకథగా!

OTT Movie : ఆ 19వ ఫ్లోర్ నరకం… యాక్సిడెంట్ తో వర్చువల్ రియాలిటీ గేమ్ ఉచ్చులో… ఓడితే కోమాలోకి

OTT Movie : అయ్య బాబోయ్ టీచర్ కు అబ్బాయిల మోజు… పోలీస్ తోనే వైరల్ వయ్యారి రాసలీలలు

OTT Movie : అందమైన అమ్మాయిపై కన్నేసే మాఫియా డాన్… 365 రోజులు బందీగా ఉంచి అదే పని… అన్నీ అవే సీన్లు

OTT Movie : భార్య ప్రైవేట్ ఫొటోలు బయటకు…. భర్త ఉండగానే దారుణం… బ్లాక్‌మెయిలర్

OTT Movie : స్కామర్ తో మిలియనీర్ సయ్యాట… ఒక్క నైట్ కలిశాక థ్రిల్లింగ్ ట్విస్ట్

Big Stories

×