E-Paper
Advertisement

Bathukamma: సల్మాన్ ఖాన్ సినిమాలో బతుకమ్మ సాంగ్.. తెలంగాణ ఎఫెక్ట్..

Bathukamma: సల్మాన్ ఖాన్ సినిమాలో బతుకమ్మ సాంగ్.. తెలంగాణ ఎఫెక్ట్..
Advertisement

Bathukamma: ఇండస్ట్రీలో దక్షిణాది సినిమాలు అదరగొడుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ యాసలో వచ్చిన సినిమాలు రచ్చ చేస్తున్నాయి. అర్జున్ రెడ్డి, డీజే టిల్లు, బలగం ఇటీవల వచ్చిన దసరా సినిమాలు బాక్సాఫీస్ బద్దలు కొట్టాయి. ఇది కలిసొస్తుండడంతో డైరెక్టర్లు కూడా తెలంగాణ యాసలో సినిమాలు తీసేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఈ క్రేజ్‌ను అలాగే కొనసాగిస్తున్నారు.

తెలంగాణ యాస, సంస్కృతి సంప్రదాయాల్లో వచ్చిన ప్రతి సినిమా హిట్ అయింది. దీంతో బాలీవుడ్ కూడా తెలంగాణ వైపు చూస్తోంది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల్లో సినిమాలను రూపొందిస్తున్నారు బాలీవుడ్ డైరెక్టర్లు. ఫర్హాద్ సామ్జీ దర్శకత్వంలో తెరకెక్కతున్న లేటెస్ట్ మూవీ ‘కిసీ కా భాయ్.. కిసీ కా జాన్’. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ మూవీలో తెలంగాణ సంస్కృతి, పండుగలను కళ్లకు కట్టినట్లు చూపించనున్నారు. ఈ మూవీలో సల్మాన్ ఖాన్, వెంకటేష్, జగపతి బాబు, పూజా హెగ్దే, షెహ్‌నాజ్ గిల్, భూమిక ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

Advertisement

తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ బతుకమ్మ సాంగ్‌ను రిలీజ్ చేశారు. వెంకటేష్, పూజా హెగ్దే, భూమిక బతుకమ్మలను తీసుకొచ్చి పాటలు పాడుతూ బతుకమ్మ ఆడడం సాంగ్‌లో చూడొచ్చు. సాంగ్ మధ్యలో పంచకట్టులో సల్మాన్ ఖాన్ ఎంట్రీ అదిరిపోయింది. అచ్చమైన తెలుగు సినిమాలోని సాంగ్‌లా ఉంది ఈ పాట. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×