BB Telugu 8 Diwali Special.. ఆదివారం దీపావళి ఎపిసోడ్ చాలా ఘనంగా ముగిసింది. అయితే ఈ ఎపిసోడ్ లలో హైలెట్ గా అనిపించిన అంశాలలో ఒకటి సమీరా భరద్వాజ్ పాడిన పాటలు అని చెప్పవచ్చు. కంటెస్టెంట్స్ గురించి చాలా ప్రత్యేకంగా రాసుకొచ్చి మరీ సుమారుగా అరగంట పాటూ ఆమె ఒక్కొక్క కంటెస్టెంట్ గురించి చెబుతూ పాటలు పాడింది. ముఖ్యంగా ఒక్కొక్కరి గురించి ఆమె పాడిన పాటలలో పొగడ్త ఉంది అలాగే విమర్శ కూడా ఉంది. అలాగే రాబోయే రోజులలో ఎలా ఆడాలి అని చిన్న చిన్న హింట్స్ కూడా ఇచ్చింది. మరి ఈ పాటలు సొంతంగా ఆమె రాసిందా? లేక బిగ్ బాస్ టీం ఇచ్చిందా..? అనే విషయం తెలియదు కానీ ఆమె ఉన్నంత సేపు మాత్రం అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ దొరికింది అని చెప్పవచ్చు.
సూపర్ సింగర్ ద్వారా పాపులారిటీ..
దీంతో ఈమె ఎవరు..? ఇంతకుముందు ఏ పాటలు పాడింది..? ఈమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి? అని తెలుసుకోవడానికి నెటిజన్స్ సైతం ఆసక్తి చూపిస్తున్నారు. మరి ఈమె ఎవరు ఏంటి అనే విషయాలు ఇప్పుడు చూద్దాం. ఈమె పేరు సమీరా భరద్వాజ్ (Sameera bharadwaj). ఆంధ్రప్రదేశ్లోని విజయవాడకు చెందిన అమ్మాయి. చిన్నతనం నుండే పాటలు మీద ఆసక్తి పెంచుకున్న ఈమె కర్ణాటక మ్యూజిక్ తో పాటు హిందుస్తానీ మ్యూజిక్ , వెస్ట్రన్ క్లాసిక్ మ్యూజిక్ వంటివి నేర్చుకుంది. 2015లో స్టార్ మా ఛానల్లో ప్రసారమైన సూపర్ సింగర్ ప్రోగ్రాంలో ఒక కంటెస్టెంట్ గా పాల్గొన్న ఈమె అక్కడ రన్నర్ గా నిలిచింది. అలా సూపర్ సింగర్ షో ద్వారా కోట్లాదిమంది ప్రజలకు పరిచయమైన ఈమె, అదే ఏడాది ఎనర్జిటిక్ రాం పోతినేని నటించిన శివం సినిమాలో ఐ లవ్ యు టూ అనే పాటకి ప్లే బ్యాక్ సింగర్ గా కూడా వ్యవహరించింది. ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద ఫ్లాప్ అయినప్పటికీ మ్యూజిక్ పరంగా మంచి విజయం అందుకుంది.
ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలకు సింగర్ గా..
అలా మొదలైన ఈమె సంగీత ప్రయాణం.. వరుస ఆఫర్లతో దూసుకుపోయింది. సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ఆమె ఖాతాలో ఉన్నాయనటంలో సందేహం లేదు. ముఖ్యంగా సరైనోడు , నేను లోకల్, హైపర్, రాజా ది గ్రేట్, శతమానంభవతి, బ్రూస్లీ, వాల్తేరు వీరయ్య ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో ఈమె పాటలు పాడింది. ఇకపోతే సోషల్ మీడియా ద్వారా కొంతమందికే పరిచయమైన ఈమె, ఇప్పుడు బిగ్ బాస్ షో ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. అంతేకాదు ఈమె టాలెంట్ కి నాగార్జున కూడా ముగ్దుడైపోయాడు. మరి ఈమెకు తదుపరి సీజన్లలో కంటెస్టెంట్ గా అవకాశం ఇచ్చినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. మరి సమీరా భరద్వాజ్ మునుముందైనా బిగ్ బాస్ లోకి వస్తుందో లేదో చూడాలి.