BigTV English

Sridevi daughters: ఆ‘నందమూరి’స్తున్న అక్కచెల్లెళ్లు..జాన్వీ, కుషీకపూర్

Sridevi daughters: ఆ‘నందమూరి’స్తున్న అక్కచెల్లెళ్లు..జాన్వీ, కుషీకపూర్

Beauty queen Sridevi daughters Tollywood entry with Nandamuri Heroes: ఎంతో కాలంగా నందమూరి వంశంలో మూడో తరం వారసుడు మోక్షజ్ణ ఎంట్రీ ఎప్పుడా అని అభిమానులు ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. నందమూరి బాలకృష్ణ అరవై నాలుగేళ్ల వయసులోనూ అఖండ విజయాలను సొంతం చేసుకుంటున్నారు. అటు రాజకీయ రంగంలోనూ సక్సెస్ కెరీర్ కొనసాగిస్తున్నారు. అయితే ఎట్టకేలకు ఈ సంవత్సరం మోక్షజ్ణ ఎంట్రీ ఖాయం అంటున్నారు. బాలయ్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు సమాచారం. మొన్నటిదాకా టీడీపీ అధకారంలోకి లేకపోవడంతో ఎలాగైనా పార్టీని బలోపేతం చేసే హడావిడిలో గత ఐదు సంవత్సరాలుగా మోక్షజ్ణ సీనీ కెరీర్ పై బాలయ్య దృష్టిపెట్టలేకపోయారు. ఇప్పుడు గతంలో ఉన్న టెన్షన్లు అన్నీ తొలగిపోయాయి.


హనుమాన్ దర్శకుడితో..

మళ్లీ టీడీపీ పూర్వ వైభవం సంతరించుకుంది. రాజకీయ పదవులకు మొదటినుంచి దూరంగా ఉంటున్న బాలయ్య ఎమ్మెల్యేగా కొనసాగుతూనే సినిమాలను కూడా పూర్తిచేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పుడు తన కుమారుడు మోక్షజ్ణ ఎంట్రీని ఓ పాన్ ఇండియా దర్శకుడితో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. హనుమాన్ మూవీతో టాప్ మోస్ట్ పాన్ ఇండియా దర్శకుడిగా మారిన ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ణ ఎంట్రీ ఇప్పించాలని బాలకృష్ణ భావిస్తున్నట్లు సమాచారం. అయితే అది పౌరాణికమా లేక సాంఘీకమా అనేది ఇంకా తేలలేదు. మోక్షజ్ణను మాత్రం అభిమన్యుడి పాత్రలో చూపించాలని అనుకుంటున్నట్లు సమాచారం.


నందమూరి హీరోలతో ఎంట్రీ

పౌరాణిక కథలంటే ఇష్టపడే బాలయ్య తన వారసుడిని కూడా పౌరాణిక పాత్రలో చూసుకోవాలని అనుకుంటున్నారు. అయితే పౌరాణికాన్ని టచ్ చేస్తూ ఆధునిక కాలాన్ని జోడిస్తూ వస్తున్న సినిమాలను జనం బాగా ఆదరిస్తున్నారు. మొన్నటి కల్కి, హనుమాన్ లాంటి సినిమాల కథలన్నీ ఈ కోవలోకి చెందినవే. అయితే నందమూరి మోక్షజ్ణ పక్కన ఎవరైనా ఫ్రెష్ హీరోయిన్ తీసుకోవాలని ఆలోచిస్తున్న తరుణంలో ఒకప్పటి అందాల తార శ్రీదేవి చిన్న కూతురు కుషీ కపూర్ ని తీసుకోవాలని చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ ఎన్టీఆర్ మూవీ దేవరతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనుంది. ఇప్పుడు చెల్లెలు కూడా నందమూరి హీరోతోనే ఎంట్రీ ఇవ్వాలని అనుకోవడం యాధృచ్ఛికమే. మరి ఈ అక్కచెల్లెళ్లలో టాలీవుడ్ లో పాగా వేసేది ఎవరు? ఇక్కడ నిలదొక్కుకునేది ఎవరు అనేది త్వరలోనే తెలిపోతుంది.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×