BigTV English

Pakistan rains 14 people killed: పాకిస్థాన్‌లో వర్ష బీభత్సం, 14 మంది మృతి

Pakistan rains 14 people killed: పాకిస్థాన్‌లో వర్ష బీభత్సం, 14 మంది మృతి

Pakistan rains 14 people killed(World news today): పాకిస్థాన్‌ను వర్షాలు వెంటాడుతున్నాయి. ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్సులో భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. వర్షాల దాటికి ఇప్పటివరకు 14 మంది మృతి చెందారు. వర్షాల ప్రభావం మరో రెండురోజుల వరకు ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.


పాకిస్థాన్‌లో ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్సులో వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలు కురుస్తుండడంతో కాలువలు, నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. పరిస్థితి గమనించిన అధికారులు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్తగా పలు రహదారులను మూసివేశారు.

డేరా ఇస్మాయిల్ ఖాన్ నగరంలోని కోట్-ముర్తాజా ప్రాంతంలో వర్షాల కారణంగా ఓ ఇంటి పైకప్పు కూలింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే సమీపం లోని ఆసుపత్రికి తరలించారు.


ALSO READ: భారత్‌లోనే కంపెనీలు స్థాపించండి..చైనాకు నీతి అయోగ్ సూచన

గడిచిన 24 గంటల్లో వర్షాల ధాటికి ఇప్పటివరకు 14 మంది మృతి చెందారు. కరక్ జిల్లాలో కనీసం ఏడుగురు మరణించారు. మరో నలుగురు గల్లంతయ్యారు. వర్షాల కారణంగా దెబ్బతిన్న కుటుంబాలకు పరిహారం ప్రకటించారు ఖైబర్ ఫఖ్తున్ఖ్వా ముఖ్యమంత్రి అలీ అమీన్ గండాపూర్.

ఆగష్టు నాలుగు నుంచి 8 వరకు భారీ వర్షాలు కురుస్తాయిని పాక్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అలాగే కాబూల్ నదికి ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో వరద ముప్పు పొంచి వుందని పేర్కొంది. మరోవైపు వర్షాల కారణంగా పలు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

Related News

Gen Z Movement: రీల్స్ లేవు.. షార్ట్స్ లేవు.. రొడ్డుపైకెక్కి గగ్గోలు పెడుతోన్న నేపాల్ యువత, 16 మంది మృతి

Elon Musk: ప్రపంచంలోనే అత్యధిక జీతం.. మస్క్ మామకు టెస్లా భారీ ఆఫర్.. వామ్మో, అన్ని లక్షల కోట్లా?

Donald Trump: నా జానే జిగర్ మోదీ! వెనక్కి తగ్గిన ట్రంప్..

Afghan Women: అఫ్ఘాన్ భూకంప శిథిలాల్లో మహిళలు.. బతికున్నా రక్షించకుండా వదిలేసిన మగాళ్లు!

MRI Accident: మెడలో మెటల్ చైన్‌తో ఎంఆర్ఐ గదిలోకి.. క్షణాల్లో ప్రాణం గాలిలోకి.. ఎక్కడంటే?

Donald Trump: భారత్‌తో సంబంధాలపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు… కుట్రబుద్ధి ఉన్న చైనాతో..?

Big Stories

×