BigTV English

Mahender Reddy: హరీష్‌రావుకు మంత్రి కౌంటర్.. ఆనాడేమైంది? అప్పుడు రాజ్యాంగం గుర్తు రాలేదా?

Mahender Reddy: హరీష్‌రావుకు మంత్రి కౌంటర్.. ఆనాడేమైంది? అప్పుడు రాజ్యాంగం గుర్తు రాలేదా?

Mahender Reddy: అధికార కాంగ్రెస్-విపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం మళ్లీ మొదలైందా? మండలి చీఫ్ విప్‌గా పట్నం మహేందర్‌రెడ్డిని నియమించడాన్ని కారు పార్టీ జీర్ణించుకోలేక పోతోందా? మంత్రి శ్రీధర్‌బాబు-మాజీ మంత్రి హరీష్‌రావుల మధ్య చిన్నస్థాయి మాటల వార్ ఎటు వైపుకు దారితీస్తోంది? ఇదే చర్చ అప్పుడే మొదలైపోయింది.


ఆదివారం మీడియా చిట్ చాట్‌లో పలు అంశాలను లేవనెత్తారు మాజీ మంత్రి హరీష్‌రావు. ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డిని మండలి చీఫ్ విప్‌గా ఎలా అపాయింట్ చేస్తారని ప్రశ్నించారు. ఆయన ఎవరికి విప్ జారీ చెయ్యాలన్నారు.

పార్టీ మారినందుకు ఆయనపై అనర్హత వేటు వేయాలని ఛైర్మన్ దగ్గర పిటిషన్ పెండింగ్‌‌లో ఉందన్న విషయాన్ని గుర్తు చేశారు హరీష్. ఈ వ్యవహారంపై సీఎస్, గవర్నర్‌లకు లేఖ రాస్తామన్నారు. మాజీ మంత్రి వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్‌బాబు కౌంటరిచ్చారు.


ప్రతిదాన్ని రాజకీయం చేయటం హరీష్‌రావుకు అలవాటుగా మారిందన్నారు. వ్యవస్థలను రాజకీయాల్లోకి లాగడాన్ని మంత్రి తప్పుపట్టారు. రాజ్యాంగానికి లోబడే పట్నం మహేందర్ రెడ్డిని మండలి చీఫ్ విప్‌గా నియమించామని అన్నారు.

ALSO READ: ప్రజల్లోకి కేసీఆర్.. డిసెంబర్‌కు నుంచి, టార్గెట్ అదే

గతంలోకి వెళ్తే.. హరీష్‌రావు శాసనసభ వ్యవహారాలమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్‌లో ఎలా చేర్చుకున్నారో సమాధానం చెప్పాలన్నారు మంత్రి శ్రీధర్‌బాబు. కేసీఆర్ హాయాంలో రాజ్యాంగం గుర్తుకు రాలేదా? పీఏసీ ఛైర్మన్ పదవిని సంప్రదాయం ప్రకారం ప్రతిపక్షానికే ఇచ్చామన్నారు. ఎమ్మెల్యేల అనర్హత వేటు అంశం కోర్టు పరిధిలో ఉందన్నారు మంత్రి శ్రీధర్‌బాబు.

Related News

Revanth Reddy: బీసీల హక్కుల కోసం కట్టుబడి ఉన్నాం.. గాంధీ భవన్‌లో సీఎం రేవంత్ రెడ్డి

Gandhi Hospital: భార్యతో గొడవ… బ్లేడ్లు మింగిన ఆటో డ్రైవర్… చివరికి గాంధీ వైద్యుల అద్భుతం!

Congress PAC: ఓటు చోరీపై కాంగ్రెస్ దూకుడు.. PAC కీలక నిర్ణయాలు!

Hyderabad rains: హైదరాబాద్ వర్షాల కొత్త అప్‌డేట్.. వాతావరణం చల్లగా, గాలులు వేగంగా.. తస్మాత్ జాగ్రత్త!

Bhupalpally: ప్రిన్సిపాల్ మీద కోపంతో మంచినీళ్ల ట్యాంక్‌లో పురుగుల మందు కలిపిన సైన్స్ టీచర్

Suryapet Crime: పట్ట పగలే ముగ్గురిపై హత్యాయత్నం.. వీడియో వైరల్..

Big Stories

×