E-Paper
Advertisement

Nani – Sujeeth Combo: నాని, సుజీత్ కొత్త మూవీ.. హీరోయిన్ గా భాగ్యశ్రీ.. ఇక కన్నుల పండగే!

Nani – Sujeeth Combo: నాని, సుజీత్ కొత్త మూవీ.. హీరోయిన్ గా భాగ్యశ్రీ.. ఇక కన్నుల పండగే!
Advertisement

Bhagyashree Borse as a Heroine in Nani- Sujeeth Combo Movie: నేచురల్ స్టార్ నాని ఎప్పుడూ కొత్త దర్శకులతో సినిమాలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటాడు. ఇందులో భాగంగానే గతేడాది రెండు సినిమాలతో వచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెలాతో ‘దసరా’, శౌర్యువ్‌తో ‘హాయ్ నాన్న’ మూవీలతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నాడు.

అయితే ఈ ఏడాది కూడా మరికొన్ని సినిమాలను లైన్‌లో పెట్టాడు. అందులో యంగ్ డైరెక్టర్ సుజీత్‌తో ఓ మూవీని ఇటీవలే తన బర్త్ డే రోజున అనౌన్స్ చేశారు. ఈ మేరకు ఓ వీడియో రిలీజ్ చేయగా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇందులో నాని లుక్ బాషా రేంజ్‌లో ఉందని కామెంట్లు కూడా వినిపించాయి.

Advertisement

ఈ మూవీని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. దర్శకుడు సుజీత్ ఈ చిత్రాన్ని గ్రాండ్ లెవెల్లో తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ న్యూస్ బయటకొచ్చి వైరల్‌గా మారింది. నాని – సుజీత్ కాంబోలో తెరకెక్కుతోన్న ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించబోతున్నట్లు తాజాగా ఓ వార్త వినిపిస్తోంది. దీంతో నాని – భాగ్యశ్రీ జోడీ సూపర్‌గా ఉంటుందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. అయితే దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.

Also Read: ‘శ్రీరంగనీతులు’ మూవీ రివ్యూ.. మూడు కథలు.. ముగ్గురు జీవితాలు.. హిట్టా ఫట్టా..?

Advertisement

ఇక నాని, సుజీత్ ఇప్పుడు పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. నాని ప్రస్తుతం ‘సరిపోదా శనివారం’ మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రానికి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చాయి. అలాగే ఈ మూవీతో పాటు మరో రెండు ప్రాజెక్టులు నాని లైనప్‌లో ఉన్నాయి. ‘బలగం’ ఫేం వేణు దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా ఓ సినిమా చేయబోతున్నాడు. అలాగే సుజీత్ దర్శకత్వంలో దానయ్య నిర్మాతగా మరో సినిమాలో నటించబోతున్నాడు.

ఇక సుజీత్ ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో ‘ఓజీ’ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీపై ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ గాని హిట్ అయితే.. నానితో చేయనున్న సినిమాపై అంచనాలు మరింత పెరిగే అవకాశముంది.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×