BigTV English

TMC MP Saugata Roy Comments: ప్రధాని కావడానికి మమతాకు అన్ని అర్హతలు ఉన్నాయి.. టీఎంసీ ఎంపీ కీలక వ్యాఖ్యలు!

TMC MP Saugata Roy Comments: ప్రధాని కావడానికి మమతాకు అన్ని అర్హతలు ఉన్నాయి..  టీఎంసీ ఎంపీ కీలక వ్యాఖ్యలు!
Trinamool Congress MP Saugata Roy: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సౌగతా రాయ్ రాబోయే సార్వత్రిక ఎన్నికలకు కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశ తదుపరి ప్రధానమంత్రిగా మమతా బెనర్జీకి అన్ని అర్హతలు ఉన్నాయని విశ్వాసం వ్యక్తం చేశారు.


“జూన్ 4న ఇది తథ్యం. మమతా 30 మందికి పైగా ఎంపీలతో కీలకంగా మారుతారు. ఆమెకు ప్రధానమంత్రి కావడానికి అన్ని అర్హతలు ఉన్నాయి. 3 సార్లు ముఖ్యమంత్రిగా నిరూపించుకున్నారు” అని సౌగతా రాయ్ చెప్పారు.

76 ఏళ్ల సౌగతా రాయ్ లోక్‌సభకు నాలుగోసారి పోటీ చేస్తున్నారు. కేంద్ర మంత్రిగా పనిచేశారు.


‘‘నాకు ఇది నాలుగోసారి.. నేను ఒకప్పుడు బరాక్‌పూర్‌ నుంచి ఎంపీని కూడా చేశాను. 1977లో తొలిసారి ఎంపీ అయినప్పుడు చరణ్‌సింగ్‌, మొరార్జీ దేశాయ్‌ లాంటి పెద్ద పెద్దవాళ్లను చూశాను. ఈరోజుల్లో అలాంటి దిగ్గజాలను మీరు చూడలేరు” అని సౌగతా రాయ్ అన్నారు.

‘‘కాలం మారింది.. ఇంతకు ముందు నా మొదటి మాటల్లో లీడర్లను, సీనియర్లను అడిగేవాడిని.. ఇప్పుడు నన్ను గూగుల్ అంకుల్ అని పిలుస్తారు.. యువ ఎంపీలు ఏదైనా తెలుసుకోవాలనుకున్నప్పుడు వచ్చి అడుగుతారు. రామ్ విలాస్ పాశ్వాన్, శరద్ పవార్ వీరు నాతో పనిచేశారు. ఇప్పుడు వారి పిల్లలు నాతో కలసి పనిచేస్తున్నారు. ఇది ప్రజా సేవ, ప్రభుత్వ ఉద్యోగం కాదు.. బీజేపీకి ఈ ఆంక్ష ఉంది, 75 ఏళ్ల తర్వాత వారు క్రియాశీలక రాజకీయాలలో ఉండరు. ఎల్‌కే అద్వానీ లాంటి వారిని తప్పించారు. ఒక వేళ రాజకీయ నాయకుడు తాను మానసికంగా, శారీరకంగా అలసిపోయానని భావిస్తే వారు తప్పుకోవచ్చు. లేదంటే వారు క్రియాశీలక రాజకీయాల్లో ఉండొచ్చు. కానీ ప్రజల ఆమోదం తప్పనిసరి,” అని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సౌగతా రాయ్ పేర్కొన్నారు.

Also Read: మోదీ గ్యారంటీ అంటే ప్రతిపక్ష నాయకులను జైల్లో పెట్టడమే: మమతా బెనర్జీ!

బెంగాల్‌లో బీజేపీ గెలుస్తుందనే వాదనపై అమిత్ షాను ఉద్దేశించి సౌగతా రాయ్ ఇలా అన్నారు, “బీజేపీకి అభ్యర్థులు దొరకడం లేదు, ఈ రోజు వారికి ఎస్ఎస్ అహ్లూవాలియా దొరికారు. అంతకుముందున్న వ్యక్తి పారిపోయారు. అతను తన నియోజకవర్గంలో ఏమీ చేయలేదని పేరు పొందారు. అతని ప్రయాణం డార్జిలింగ్ నుంచి బుర్ద్వాన్.. ఇప్పుడు అసన్సోల్‌.. ఇప్పటికీ డైమండ్ హార్బర్‌కు అభ్యర్థి లేరు.”

“ఇప్పుడు 30 అంటున్నారు కానీ ఎప్పుడో బీజేపీ 35 గెలుస్తుందని అమిత్ షా కచ్చితంగా అంటారు. కానీ వాళ్లకు తెలియని విషయం ఏంటంటే ఆ పార్టీకి అభ్యర్థులు లేరు. ఇది వాస్తవం,” అన్నారాయన.

Related News

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Big Stories

×