E-Paper
Advertisement

Lok Sabha Elections 2024: మూడో విడత ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ..

Lok Sabha Elections 2024: మూడో విడత ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ..
Advertisement

3rd Phase election Schedule Released by Election Commission: మూడో విడత ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం షెడ్యూల్ విడుదల చేసింది. కాగా దీనికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్‌ను రేపు విడుదల చేయనుంది. 2024 సార్వత్రిక ఎన్నికల మూడో దశ నామినేషన్ల ప్రక్రియ రేపటి(ఏప్రిల్ 12) నుంచి ప్రారంభంకానుంది.

మూడో దశలో 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలోని 94 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. అస్సాం, బీహార్, ఛత్తీస్‌ఘడ్, దాద్రా నగర్ హవేలీ, డామన్ & డయ్యు, గోవా, గుజరాత్, జమ్మూ &కాశ్మీర్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో మూడో దశలో ఎన్నికలు జరగనున్నాయి.

Advertisement

మధ్యప్రదేశ్‌లోని బేతుల్ నియోజకవర్గానికి రెండో దశలో ఎన్నికలు జరగాల్సి ఉండగా బేతుల్ బీఎస్పీ ఎంపీ అభ్యర్థి మరణించడంతో ఆ స్థానానికి మూడో దశలో ఎన్నికలు నిర్వహించనున్నారు.

Also Read: Kashi Vishwanath Temple: వివాదంలో యోగి సర్కార్.. అర్చుకుల వేషధారణలో పోలీసులు

Advertisement

ఇక నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం(ఏప్రిల్ 12) నుంచి ప్రారంభంకానుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్ 19 చివరి తేది. ఏప్రిల్ 20న నామినేషన్ల పరిశీలన జరగనుంది. ఇక నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఏప్రిల్ 22.

మూడో దశలో పోలింగ్ మే 7వ తేదీన జరగనుండగా.. కౌంటింగ్ జూన్ 4వ తేదీన జరుగుతుంది.

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×