Manchu Manoj: టాలీవుడ్ లో మల్టీ స్టార్ సినిమాలు ట్రెండ్ అవుతున్నాయి. ఇద్దరు హీరోలతో మూవీస్ చేస్తూ దర్శకులు మల్టీస్టారర్ కథలను సిద్ధం చేస్తున్నారు. అయితే ఈసారి ముగ్గురు హీరోలతో విజయ్ కనకమెడల దర్శకత్వంలో భైరవం తెరకెక్కుతోంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ కలిసి చేస్తున్న సినిమా భైరవం. ప్రమోషన్స్ లో భాగం గా, ముగ్గురు హీరోలు కలిసి ఫన్నీ చిట్ చాట్ ఇంటర్వ్యూ ను నిర్వహించారు. ఈ చిత్రం మే 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. అందులో భాగంగా మంచు మనోజ్ చేసిన,వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలు చూద్దాం..
స్కూల్ రోజులోనే అనుకున్న ..హీరో అవ్వాలని ..
టాలీవుడ్ లో భారీ స్థాయిలో, రూపొందుతున్న చిత్రం భైరవం. అతిథి శంకర్, దివ్య పిల్లే, ఆనంది కథానాయకులుగా నటిస్తున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఫన్నీ చిట్ చాట్ ను నిర్వహించారు. మంచు మనోజ్ తన ఇంటి నుండి బయలుదేరి, నారా రోహిత్ ఇంటికి వచ్చాడు. ఇద్దరూ కలిసి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇంటికి వెళ్తారు. ముగ్గురు కలిసి ఆ ఇంట్లో బయటకు వచ్చి తీసినప్పుడు వారి సినిమా గురించి మాట్లాడుకున్నారు. మొదట మంచి మనోజ్ సాయి శ్రీనివాస్ ను నీకు సినిమాలోకి రావాలని ఎప్పుడు అనిపించింది. అని అడుగుతారు. సాయి శ్రీనివాస్ నేను స్కూల్లో చదివేటప్పుడు, అబ్దుల్ కలాం గారు స్కూల్ కి వచ్చారు. స్కూల్లో నేను కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నిట్లో ఫస్ట్ వచ్చాను. స్టేజ్ పైకి పిలిచి ప్రైజ్ ఇచ్చారు. అందరి మధ్యలో నుండి నేను ప్రైస్ తీసుకొని వచ్చేటప్పుడు అందరూ క్లాస్ కొడుతుంటే ఆరోజు అనుకున్నాను ఇలానే నేను అందరిలో గొప్పగా నాకంటూ ఒక స్టేజి ఏర్పాటు చేసుకోవాలని అలా ఇండస్ట్రీ లోకి వచ్చాను అని తెలిపారు.
ఆ సీన్స్ అలా ఎలా గురూ..అప్పుడే ఎలా అనుకున్నావ్ ..
నారా రోహిత్ ని మంచు మనోజ్ నెక్స్ట్ నువ్వు ఎలా వచ్చావ్ అని అడుగుతాడు. నారా రోహిత్ మాట్లాడుతూ.. మా నాన్న నారా రామ్మూర్తి నాయుడు, మొదట్లో నాటకాలు వేసేవారు, ఆయన నన్ను సినిమాల్లోకి రావడానికి ప్రోత్సాహం అందించారు. అలా నేను సినిమాలోకి వచ్చాను అని తెలిపారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నువ్వు ఏ వయసులో ఇండస్ట్రీకి వచ్చావు, అని మనోజ్ ని అడుగుతాడు. మంచు మనోజ్ మాట్లాడుతూ.. 11 నెలల అప్పుడే ఇండస్ట్రీ లోకి వచ్చాను. నా మొగుడు నాకే సొంతం, బ్రహ్మ తర్వాత మేజర్ చంద్రకాంత్, పుణ్యభూమి నాదేశం, ఈ మూవీకి నాకు అవార్డు కూడా వచ్చింది. మేజర్ చంద్రకాంత్ మూవీ చేసేటప్పుడు నాకు ఎనిమిది సంవత్సరాలు. నేను చిన్నప్పుడే ఫిక్స్ అయిపోయాను.హీరో అవ్వాలని చిన్నప్పుడే అనుకున్న అలానే సినిమాల్లోకి వచ్చాను. ఎక్కువ స్కూల్స్ మారింది కూడా నేనే, నేను చదివే స్కూల్ కి వచ్చి నాకు ఈ అబ్బాయి కావాలి అని ఇండస్ట్రీ లోకి తీసుకువెళ్లారు. ఇక రాజు భాయ్ సినిమా అప్పటినుంచి ప్యూర్ యాక్షన్ హీరోగా మారిపోయాను. ఆ సినిమాలో స్టంట్ మాస్టర్ ని పెట్టలేక, ఎన్నో యాక్షన్ సీన్స్ వారం రోజులో చేయాలనుకున్నాను. మూడు రోజుల్లో కంప్లీట్ చేసేసాము. బిందాస్ సినిమా కూడా యాక్షన్ సీన్స్ ఐదు రోజుల్లో కంప్లీట్ చేశాను. మీరు కాబట్టి ఒకరోజు అయిపోయింది మేమైతే ఒక రోజులో కంప్లీట్ చేయలేము అని సాయి శ్రీనివాస్ అనడంతో మంచు మనోజ్ నవ్వుతు ఆపేస్తాడు. ఈ వీడియో చూసిన వారంతా సినిమా గురించి మాట్లాడకుండా, సొంత డబ్బా కొట్టుకోవడం ఏంటి అని మంచు మనోజ్ పై కామెంట్ చేస్తున్నారు. స్టేజ్ ఏదైనా షో ఏదైనా డబ్బా కొట్టడం లో మీకు మీరే సాటి అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
ఇక భైరవ మూవీ తమిళంలో ఘనవిజయం సాధించిన, గరుడన్ సినిమాకి రీమేక్ గా రానుంది. సత్య సాయి బ్యానర్ పై కే రాధామోహన్ నిర్మిస్తున్నారు. విజయ్ కనక మెడల దర్శకత్వంలో రూపొందుతోంది. ఏప్రిల్ 30న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎన్నో రోజులుగా హిట్ కోసం ఎదురుచూస్తున్న, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మంచు మనోజ్ నారా రోహితులకు ఈ సినిమా కీలకంగా మారనుంది. ఈ ముగ్గురు హీరోలకి ఈ సినిమా విజయం కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.