E-Paper
Advertisement

Bhamakalapam 2 : భామాకలాపం సీక్వెల్ ఫస్ట్ లుక్..ఈ సారి నేరుగా థియేట‌ర్‌ లోనే ..

Bhamakalapam 2 : భామాకలాపం సీక్వెల్ ఫస్ట్ లుక్..ఈ సారి నేరుగా థియేట‌ర్‌ లోనే ..
Advertisement
Bhamakalapam 2

Bhamakalapam 2 : ప్రియమణి ప్రధాన పాత్రలో 2022 లో అభిమన్యు తాడిమేటి డైరెక్షన్ లో వచ్చిన మూవీ భామాకలాపం. అయితే ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీ లో విడుదల చేశారు. తెలుగు ఓటీటీ దిగ్గజ సంస్థ ఆహా లో నేరుగా విడుదలైన ఈ చిత్రం రికార్డు స్థాయి విజయాన్ని నమోదు చేసింది. ప్రస్తుతం సమాజంలో సాగుతున్న సోషల్ మీడియా ఫీవర్ ట్రెండింగ్ కాన్సెప్ట్ తో వినూత్నంగా తెరకెక్కించిన భామాకలాపం అందరినీ ఆకట్టుకుంది.

యూట్యూబ్లో కొత్త కొత్త వంటకాలు చేసి ఫేమస్ అవ్వాలి అనుకునే ఒక గృహిణి.. అనుకోకుండా ఓ హత్య కేసులో  ఇరుక్కుంటుంది. ఈ నేపథ్యంలో ఎదురయ్యే పరిస్థితుల వల్ల ఆమె కుటుంబం ఎన్ని ఇబ్బందులు పడాల్సి వచ్చింది అనే కాన్సెప్ట్ తో మూవీ సాగుతుంది. థ్రిల్లర్ జోనర్ లో ఓటిటిలోకి వచ్చిన ఈ మూవీ బాగా ట్రెండింగ్ అయింది. ఈ మూవీలో ప్రియమణి నటన అందరిని ఆకట్టుకుంది. భామాకలాపంతో ప్రియమణి వైవిధ్యమైన పాత్రలో కూడా చేయగలనని నిరూపించుకుంది.

Advertisement

లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి మరొక తాజా సాలిడ్ అప్డేట్ వైరల్ అయింది. ప్రస్తుతం ఎక్కడ చూసినా సినిమాకి సీక్వెల్ ట్రెండ్ ఈ నేపథ్యంలో మొదటి సినిమా బాగా హిట్ అవడంతో ఈ చిత్రానికి సీక్వెల్ రాబోతున్నట్టు మేకర్స్ తెలిపారు. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా చిత్ర బృందం విడుదల చేశారు. ఈ పోస్టర్లో ప్రియమణి ప్రపంచంలోనే ఆడవాళ్లను రెప్రజెంట్ చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఒక చేతిలో వ్యాక్యూమ్ క్లీనర్ పట్టుకొని ఎర్ర చీరలో అమ్మ వారిలా నిలబడింది. ఇక ఆమె చుట్టూ విధ్వంసం ఉగ్రరూపం లో కనిపిస్తుంది. పోస్టర్ మూవీపై మంచి బజ్ క్రియేట్ చేస్తోంది.

 రీసెంట్ గా ప్రియమణి షారుక్ జవాన్ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్రలో నటించి.. అందరినీ మెప్పించింది. ఇక భామ కలాపం పార్ట్ 1 కి దర్శకత్వం వహించిన అభిమన్యు పార్ట్ 2 కి కూడా డైరెక్షన్ వహించబోతున్నారు. అయితే పార్ట్ 1 ను ఓటీటీ లో విడుదల చేశారు. కానీ ఈసారి మూవీ కి ఉన్న క్రేజ్ చూసి నేరుగా థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ ఫిక్స్ అయ్యారు. ఆహా స్టూడియో, డ్రీమ్ ఫార్మర్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని సుధీర్ ఈదర ,భోగవల్లి బాపినీడు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఓటీటీ లో చెడుగుడాడిన ఈ చిత్రం థియేటర్లలో ఎంతవరకు రాణిస్తుందో చూడాలి.

Advertisement

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×