BigTV English

Prakash Raj : పోంజి స్కీమ్‌ కేసు.. ప్రకాష్ రాజ్‌కు ఈడీ షాక్.. నోటీసులు జారీ..

Prakash Raj : పోంజి స్కీమ్‌ కేసు.. ప్రకాష్ రాజ్‌కు ఈడీ షాక్.. నోటీసులు జారీ..
Prakash Raj Latest news

Prakash Raj Latest news(Current news from India):

నటుడు ప్రకాష్‌ రాజ్‌కు ఈడీ షాక్ తగిలింది. ఓ నగల షాపునకు సంబంధించి రూ.100 కోట్లు పోంజి స్కీమ్‌ కేసు విచారణను ఈడీ చేపట్టింది. ఈ కేసులో ప్రకాష్ రాజ్ ను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు నోటీసులు జారీ చేశారు.


తమిళనాడులోని తిరుచునాపల్లికి చెందిన ప్రణవ్‌ జ్యుయెలర్స్‌కు ప్రకాశ్‌ రాజ్‌ ప్రచారకర్తగా పనిచేశారు. ఆ సంస్థ పొంజి స్కీమ్‌ ద్వారా అధిక లాభాల ఆశ చూపిందని ఆరోపణలు వచ్చాయి. ప్రజల నుంచి రూ.100 కోట్లు వసూలు చేసిందని అభియోగాలు నమోదయ్యాయి.

ఈ ఏడాది అక్టోబర్ లో ప్రణవ్‌ జ్యుయెలర్స్‌ బోర్డు తిప్పేసింది. సదరు సంస్థ యజమాని మదన్‌పై తమిళనాడులో కేసు నమోదైంది. రాష్ట్ర ఆర్థిక నేరాల విభాగం ఈ కేసు నమోదు చేసింది. నవంబర్ లో ఆయనపై లుక్‌అవుట్ నోటీసులు జారీ చేసింది. అలాగే చెన్నై, పుదుచ్చేరిలో ప్రణవ్‌ జ్యుయెలర్స్‌ బ్రాంచ్‌లు, యజమానుల ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు చేశారు. ఈ క్రమంలోనే రూ.100 కోట్ల మేర మోసం జరిగిందని గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రకాష్ రాజ్ కు నోటీసులు జారీ అయ్యాయి.


Tags

Related News

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

Big Stories

×