E-Paper
Advertisement

Bhola Shankar : ‘భోళా శంకర్’ సెట్‌ని సందర్శించిన దర్శకేంద్రుడు

Bhola Shankar : ‘భోళా శంకర్’ సెట్‌ని సందర్శించిన దర్శకేంద్రుడు
Advertisement

Bhola Shankar : మెగాస్టార్ చిరంజీవి, స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ మెగా మాసివ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ “భోళా శంకర్” షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన మాసీవ్ కోల్‌కతా సెట్‌లో ఈ సినిమా పాట చిత్రీకరణ జరుగుతోంది. చిరంజీవి, కీర్తి సురేష్, మరికొందరు నటీనటులు, 200 మంది డ్యాన్సర్లు పాల్గొంటున్న ఈ పాట చిత్రీకరణ భారీ ఎత్తున జరుగుతోంది. ఈ పాటకు కొరియోగ్రఫీని శేఖర్ మాస్టర్ చేస్తుండగా, మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు.

లెజెండరీ ఫిల్మ్ మేకర్ కె రాఘవేంద్రరావు సినిమా సెట్‌ని సందర్శించి టీమ్‌తో సరదాగా గడిపారు. మెగాస్టార్ చిరంజీవి బ్లాక్‌బస్టర్ ‘చూడాలని వుంది’ లోని సూపర్‌హిట్ పాటను చిత్రీకరించినప్పుడు కోల్‌కతా సెట్‌ను సందర్శించిన జ్ఞాపకాలను ఆయన గుర్తు చేసుకున్నారు. కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న భోళా శంకర్ చాలా పెద్ద బ్లాక్‌బస్టర్ అవుతుందని టీంకు బెస్ట్ విశేష్ అందించారు.

Advertisement

మెగాస్టార్ చిరంజీవితో జగదేకవీరుడు అతిలోకసుందరి, రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు మొదలైన అనేక బ్లాక్‌బస్టర్‌లను రూపొందించిన రాఘవేంద్రరావు.. వాల్తేరు వీరయ్య విజయంపై మెగాస్టార్‌ను అభినందించడానికి భోళా శంకర్ సెట్‌కి వచ్చారు. సెట్‌లో అద్భుతమైన వైబ్స్ చూసిన రాఘవేంద్రరావు మాట్లాడుతూ .. ప్రస్తుతం చిత్రీకరిస్తున్న పాట రామ్మ చిలకమ్మ లాగా చార్ట్‌బస్టర్ అవుతుందని, భోళా శంకర్ సినిమా ‘చూడాలని వుంది’ లాంటి బ్లాక్ బస్టర్ అవుతుందని అన్నారు.

భోళా శంకర్ కోర్ టీమ్‌తో కె రాఘవేంద్రరావు ఫోటోని మేకర్స్ షేర్ చేశారు. చిరంజీవి, కీర్తి సురేష్ సంప్రదాయ దుస్తుల్లో కనిపిస్తున్నారు. మెహర్ రమేష్ చిరంజీవిని స్టైలిష్, ఇంకా మాస్ క్యారెక్టర్‌లో ప్రెజెంట్ చేస్తున్న ఈ సినిమాలో డాజ్లింగ్ బ్యూటీ తమన్నా కథానాయికగా నటిస్తోంది. కీర్తి సురేష్ చిరంజీవి సిస్టర్ గా కనిపించనుంది. క్రియేటివ్ కమర్షియల్స్‌తో కలిసి అనిల్ సుంకర ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మహతి స్వర సాగర్ సంగీతం అందించగా, డడ్లీ డీవోపీగా పని చేస్తున్నారు. సత్యానంద్ కథ పర్యవేక్షణ చేయగా తిరుపతి మామిడాల డైలాగ్స్ అందిస్తున్నారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×