E-Paper
Advertisement

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు.. మాగుంట రాఘవకు 10 రోజుల ఈడీ కస్టడీ

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు.. మాగుంట రాఘవకు 10 రోజుల ఈడీ కస్టడీ
Advertisement

Delhi Liquor Scam: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీవాసులురెడ్డి కుమారుడు మాగుంట రాఘవను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. శనివారం మధ్యాహ్నం సీబీఐ ప్రత్యేక కోర్టులో ఈడీ అధికారులు రాఘవను ప్రవేశపెట్టారు. సౌత్ గ్రూప్ తరుపున చెల్లించిన రూ. 100 కోట్ల ముడుపుల వ్యవహారంలో రాఘవ పాత్ర ఉందని.. ఇప్పటికే అరెస్ట్ అయిన నిందితులతో రాఘవకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని కోర్టుకు ఈడీ అధికారులు వివరించారు. ఈ కేసులో మరిన్ని వివరాలను రాబట్టేందుకు రాఘవను 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరారు.

ఈ మేరకు వాదనలు విన్న కోర్టు రాఘవకి కస్టడీ విధించింది. ఈడీ అధికారులు కోరినట్లుగానే 10 రోజుల కస్టడీకి అనుమతిచ్చింది. కస్టడీ ముగిశాక రాఘవను తిరిగి కోర్టులో ప్రవేశపెట్టాలని అధికారులను అదేశించింది.

Advertisement

ఇక ఈ కేసుకు సంబంధించి వారం రోజుల వ్యవధిలో ఈడీ అధికారులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. మంగళవారం ఎమ్మెల్సీ కవిత ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబును హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకోగా… పంజాబ్‌కు చెందిన మద్యం వ్యాపారి, ఒయాసిస్ గ్రూప్ ప్రమోటర్ గౌతమ్ మల్హోత్రాను బుధవారం అదుపులోకి తీసుకున్నారు.

బుధవారం సీబీఐ ప్రత్యేక జడ్జి ఎంకే నాగ్‌పాల్ ఎదుట గోరంట్ల బుచ్చిబాబును హాజరుపర్చారు. కేసుకు సంబంధించిన మరింత సమాచారం రాబట్టేందుకు 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని సీబీఐ అధికారులు కోర్టును కోరారు. అయితే కోర్టు మూడు రోజుల సీబీఐ కస్టడీకి ఇస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఇక గౌతమ్ మల్హోత్రాను కూడా అదే రోజు కోర్టులో హాజరుపర్చి కస్టడీకి ఇవ్వాలని అధికారులు కోరగా.. ఏడు రోజుల కస్టడీకి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక మాగుంట రాఘవను కూడా కస్టడీకి తీసుకునేందుకు కోర్టు అనుమతి కోరనున్నట్టు ఈడీ అధికారులు తెలిపారు.

Tags

Related News

స్థానిక ఎన్నికల వేల నేతలకు సీఎం చంద్రబాబు వార్నింగ్.. ఎమన్నారంటే?

ఎంపీ మిథున్ రెడ్డికి బిగ్ షాక్.. ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే చాన్స్..?

ఏపీలో తీవ్ర విషాదం.. అమలాపురం మాజీ ఎంపీ బుచ్చిబాబు కన్నుమూత!

తెలుగుదేశం పార్టీ రెండో జాబితా విడుదల.. ఇందులోను మహిళలదే హవా!

పులివెందులలో హైటెన్షన్.. నామినేషన్ కేంద్రం వద్ద కాల్పులు జరిపిన పోలీసులు!

సాలూరు జనసేనలో భగ్గుమన్న చైర్మన్ టికెట్ వివాదం.. కేడర్ తీవ్ర ఆగ్రహం!

రాజంపేటలో ఉద్రిక్తత.. వైసీపీ ఎమ్మెల్యే అమర్‌నాథ్ రెడ్డి ఇంటిపై దాడి!

ఏపీలో స్థానిక ఎన్నికల ఘర్షణలు.. వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్!

Big Stories

Advertisement
×