BigTV English

Daaku Maharaj : బిగ్ షాక్.. ఓటీటీలోకి రాకముందే ఆన్‍లైన్‍లో ‘డాకు మహారాజ్ ‘ 4k ప్రింట్ లీక్..

Daaku Maharaj : బిగ్ షాక్.. ఓటీటీలోకి రాకముందే ఆన్‍లైన్‍లో ‘డాకు మహారాజ్ ‘ 4k ప్రింట్ లీక్..

Daaku Maharaj : నందమూరి నటసింహం బాలయ్య నటించిన లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్ ‘.. ఈరోజు ఏడాది సంక్రాంతి కానుకగా ఈ మూవీ జనవరి 12 ప్రేక్షకులకు ముందుకు వచ్చిన ఈరోజు మూవీ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.. డాకు మహారాజ్ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. ఈ యాక్షన్ మూవీకి బాబీ కొల్లి దర్శకత్వం వహించారు. డాకు మహారాజ్ చిత్రం త్వరలో ఓటీటీలోకి రానుంది.. ఓటీటీ డేట్ ను అనౌన్స్ చెయ్యక ముందే ఈరోజు మూవీకి బిగ్ షాక్ తగిలింది.. ఈ మూవీ హెచ్ డి ప్రింట్ ఆన్ లైన్లో లీకయిందని ఓ న్యూస్ సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది.. ఇందులో నిజమేంత ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..


డాకు మహారాజ్ ఆన్లైన్లో లీక్… 

బాలయ్య నటించిన తాజా చిత్రం డాకు మహారాజ్.. జనవరి 12 న థియేటర్లలో రిలీజ్ అయ్యింది. మూవీ రిలీజయ్యాక ఈ మూవీ లీక్ కాగా.. ఇప్పుడు తాజాగా మరో హెచ్‍డీ ప్రింట్ వెర్షన్ పైరసీ సైట్లలో కనిపిస్తోంది. ఏకంగా ఓటీటీల్లో ఉండే లాంటి ప్రింట్ లీకైపోయింది.. ఓటీటీలో ఇంకా స్ట్రీమింగ్ డేట్ ను అనౌన్స్ చెయ్యక ముందే ఇలా నెట్టింట ఫుల్ క్వాలిటీతో సినిమా లీక్ అవ్వడం అటు మేకర్స్, ఇటు ఓటీటీ సంస్థకు బిగ్ షాక్ అనే చెప్పాలి. ఇటీవలి కాలంలో హెచ్‍డీ వెర్షన్‍ల లీక్ బెడద పెరిగిపోతోంది. పుష్ప 2, గేమ్ ఛేంజర్ చిత్రాల హెచ్‍డీ వెర్షన్‍లు కూడా ఆన్‍లైన్‍లో బయటికి వచ్చేశాయి. ఇప్పుడు డాకు మహారాజ్ కు అదే విధంగా లీకుల దెబ్బ పడటం గమనార్హం.. లీక్‍లను అడ్డుకునేందుకు మూవీ టీమ్ సభ్యులు కఠిన చర్యలు తీసుకోవాలనే ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు..


ఓటీటీ డీటెయిల్స్..

బాలయ్య డాకు మహారాజ్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ సొంతం చేసుకుంది. ఫిబ్రవరి రెండో వారంలో ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ తేవాలని ఆ ఓటీటీ ప్లాన్ చేసుకుంటోందని రూమర్లు వస్తున్నాయి.. ఓటీటీలో రిలీజ్ అవ్వక ముందే ఇలాంటి లీకులు బయటరవడం బిగ్ షాక్.. సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. ఈ చిత్రం రూ.150కోట్ల గ్రాస్ కలెక్షన్ల మార్క్ దాటింది.. మొదటి రోజు నుంచే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద జోరు కనబరిచింది.. తొలి వీకెండ్‍లోనే రూ.100 కోట్లు అధిగమించింది. సాలిడ్ వసూళ్లు సాధించింది. ఆ తర్వాత వసూళ్లలో డ్రాప్ కనిపించింది. అయితే, వరుసగా నాలుగోసారి రూ.100కోట్ల చిత్రాన్ని బాలయ్య నమోదు చేశారు.. ఇక ఈరోజు మూవీలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ నటించారు.. చాందినీ చౌదరి, షైన్ టామ్ చాకో, ఊర్వశి రౌతేలా, మకరంద్ దేశ్‍పాండే కీలకపాత్రలు చేశారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించారు.. ఇక ఈ మూవీని సితార ఎంటర్‌టైన్‍మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, నాగసౌజన్య ఈ మూవీని నిర్మించారు.. ప్రస్తుతం అఖండ 2 మూవీలో నటిస్తున్నారు. ఈరోజు ఏడాది సెప్టెంబర్ లో మూవీ థియేటర్లలో రిలీజ్ రాబోతుంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×