BigTV English

Budget on Congress: బడ్జెట్ పూర్తిగా ట్రాక్ తప్పింది.. కాంగ్రెస్ తీవ్ర విమర్శలు

Budget on Congress: బడ్జెట్ పూర్తిగా ట్రాక్ తప్పింది.. కాంగ్రెస్ తీవ్ర విమర్శలు

Budget on Congress: ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌పై ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ స్పందించింది. ఈ బడ్జెట్ ద్వారా ఎవరికి ఉపయోగమని కాంగ్రెస్ ప్రశ్నించింది. నాలుగు కీలక రంగాలను అభివృద్ధికి శక్తి ఇంజిన్లుగా పేర్కొనడంపై విమర్శలు గుప్పించింది. బడ్జెట్ రైలుకు అనేక ఇంజిన్లు ఉన్నాయని.. ఇది కాస్త పట్టాలు తప్పిందని కాంగ్రెస్ ఎద్దేవా చేసింది.


బడ్జెట్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి జైరాం రమేష్ కూడా స్పందించారు. ‘ఆర్థిక మంత్రి నాలుగు కీలక రంగాల గురించి మాత్రమే మాట్లాడారు. వ్యవసాయం, ఎంఎస్ఎంఈ, పెట్టుబడులు, ఎగుమతులు అనే నాలుగు ఇంజిన్ల గురించే మాత్రమే బడ్జెట్‌లో ఆమె ప్రసంగించారు. కానీ చాలా ఇంజిన్లు ఉన్న ఈ బడ్జెట్ పూర్తిగా పట్టాలు తప్పింది. త్వరలో బిహార్‌లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. వారి స్వార్థం కోసమే మాత్రమే ఆ రాష్ట్రంలో వరాలను కురిపించింది’ అని జైరాం రమేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.

Also Read: CM Chandrababu Naidu: ఒక్కో వ్యక్తికి ఏడాదికి రూ.48,000.. ఇందులో మీరున్నారా..? సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు


మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో ఇంటర్నేషనల్ కంపెనీలు కోరుకున్న 2010 నాటి న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్‌ను బీజేపీ నేత అరుణ జైట్లీ సూచన మేరకు దెబ్బతీసిందని జైరాం రమేష్ పేర్కొన్నారు. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడైన డోనాల్డ్ ట్రంప్‌ను బుజ్జగించేందుకు.. తాజాగా చట్టాన్ని సవరించినట్లు ప్రకటించారని జైరాం రమేష్ కీలక ఆరోపణలు చేశారు

Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×