BigTV English

Big TV Exclusive : అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే కాదు..ఫర్ పుష్ప.. పుష్ప 2 ప్రమోషన్స్‌కి బాలయ్యను ఇలా వాడేస్తున్నారుగా..!

Big TV Exclusive : అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే కాదు..ఫర్ పుష్ప.. పుష్ప 2 ప్రమోషన్స్‌కి బాలయ్యను ఇలా వాడేస్తున్నారుగా..!

Big TV Exclusive.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ప్రముఖ స్టార్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పుష్ప (Pushpa). హిందీలో ఎటువంటి ప్రమోషన్స్ లేకుండా ఏకంగా అక్కడ భారీ పాపులారిటీ సొంతం చేసుకొని, అల్లు అర్జున్ కు పాన్ ఇండియా మార్కెట్ ను అందించింది. అదే ఊపు తో ఇప్పుడు పుష్ప -2 సినిమాను కూడా విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే. ఇకపోతే భారీ అంచనాల మధ్య డిసెంబర్ 6వ తేదీన ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ఇప్పటికే థియేట్రికల్ , నాన్ థియేట్రికల్ బిజినెస్ కూడా పూర్తి చేసుకుంది. అలా ఒక్క ప్రీ రిలీజ్ బిజినెస్ లోనే ఏకంగా రూ.1000 కోట్లు దాటేసి రికార్డు సృష్టించింది ఈ సినిమా. దేశంలోనే అత్యధికంగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రంగా పుష్ప -2 నిలవబోతోంది అని వార్తలు వినిపిస్తున్నాయి.


ప్రమోషన్స్ మొదలుపెట్టిన పుష్ప టీమ్..

ఇదిలా ఉంటే..ఒక సినిమా ప్రేక్షకులకు రీచ్ అవ్వాలి అంటే కచ్చితంగా ప్రమోషన్స్ చేపట్టాలి. ముఖ్యంగా తన సినిమాను అందరికీ చేరవేసే ప్రయత్నంలో దిగ్గజ దర్శకుడు రాజమౌళి (Rajamouli) సక్సెస్ అయిన విషయం తెలిసిందే. ఆయన సినిమా బడ్జెట్ కు కొంత పెడితే, అందులో ఎక్కువ భాగం ప్రమోషన్స్ కే కేటాయిస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాజమౌళి చిత్రాలు ఎప్పుడు కూడా హై రేంజ్ లో కలెక్షన్స్ వసూలు చేస్తూ ఉంటాయి. ఇప్పుడు అదే స్ట్రాటజీని సుకుమార్ కూడా ఫాలో అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక దేశంలో నెంబర్ వన్ షోగా గుర్తింపు తెచ్చుకున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే (Unstoppable with NBK) షో ని ప్రమోషన్స్ కోసం ఉపయోగించుకోబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.


బాలయ్య షో కి పుష్ప టీమ్..

ప్రస్తుతం దేశవ్యాప్తంగా మంచి టీఆర్పీ రేటింగ్ తో దూసుకుపోతున్న ఏకైక రియాల్టీ షో అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే. ఈనెల 25వ తేదీన చాలా గ్రాండ్ గా ప్రారంభం కానున్న ఈ షో కి ముఖ్య అతిథిగా మొదటి ఎపిసోడ్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) రాబోతున్నారు. ఈ మేరకు ఈ ఎపిసోడ్ కు సంబంధించిన తాజా ప్రోమోని కూడా కొద్దిసేపటి క్రితం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక ఇంతటి పాపులర్ షో వేదికపై తమ సినిమా ప్రమోషన్స్ చేపడితే అందరికీ సులభంగా రీచ్ అవుతుందని దర్శకనిర్మాతలు ఆలోచించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పుష్పరాజ్ అలియాస్ అల్లు అర్జున్, పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్.. ఈ సినిమా విడుదలకు వారం రోజులు ముందుగా ఈ షో కి రాబోతున్నట్లు ఒక వార్త హల్చల్ చేస్తోంది.

ఏకంగా బాలయ్యనే వాడేస్తున్నారా..

ఒకవేళ ఇదే నిజమైతే అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె కాదు.. పుష్ప -2 ప్రమోషన్స్ కి ఏకంగా బాలయ్యనే వాడబోతున్నారు అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే తన సినిమాకు బాలయ్యను ఉపయోగించుకొని మరింత మార్కెట్ క్రియేట్ చేసుకోబోతున్నారని చెప్పవచ్చు. ఏది ఏమైనా లెక్కలు మాస్టర్ భారీగానే ప్లాన్ చేశారని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×