BigTV English

CM Chandrababu: 1995లోనే ఐటీని తెచ్చా.. హైదరాబాద్ బెస్ట్ సిటీ.. డ్రోన్స్ కంపెనీలకు స్వాగతం పలుకుతున్నా.. సీఎం చంద్రబాబు

CM Chandrababu: 1995లోనే ఐటీని తెచ్చా.. హైదరాబాద్ బెస్ట్ సిటీ.. డ్రోన్స్ కంపెనీలకు స్వాగతం పలుకుతున్నా.. సీఎం చంద్రబాబు

CM Chandrababu: దేశంలోనే అతిపెద్ద డ్రోన్ సమ్మిట్ ఏపీలో నిర్వహించడం తనకు గర్వంగా ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ లో రెండ్రోజులపాటు జరగనున్న డ్రోన్ సమ్మిట్-2024ను సీఎం చంద్రబాబు మంగళవారం ప్రారంభించారు. డ్రోన్ సమ్మిట్ కు కేంద్రమంత్రి రామ్మోహన్, మంత్రులు బీసీ జనార్థన్ రెడ్డి, అనిత, అచ్చెన్నాయుడు, సంధ్యారాణి పలువురు హాజరయ్యారు. ఈ డ్రోన్ సమ్మిట్ లో 521 పైగా కంపెనీలకు చెందిన 6,929 మంది ప్రతినిధులు [పాల్గొన్నారు. ఏపీని డ్రోన్ హబ్ గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్న ప్రభుత్వం


ఈ సంధర్భంగా సీఎం మాట్లాడుతూ.. శంలోనే అతిపెద్ద డ్రోన్ సమ్మిట్ ఏపీలో నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. టెక్నాలజీలో భారత్ దూసుకుపోతోందని, ప్రతి ఒక్కరూ వికసిత్ భారత్-2047 లక్ష్యంగా పని చేయాలన్నారు. అలాగే ప్రధాని నరేంద్ర మోడీ డైనమిక్ ప్రైమ్ మినిస్టర్ అంటూ కొనియాడిన చంద్రబాబు.. దేశం ఆధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొనేందుకు కేంద్రం అన్ని రకాలుగా సహకరిస్తుందన్నారు. అందుకే డ్రోన్ నిబంధనలను కేంద్రం సులభతరం చేసిందన్నారు. మనం ఇప్పటికే సాంకేతిక పరిజ్ఞాన పరంగా అడ్వాన్స్ డ్రోన్స్, మొబైల్ ఫోన్స్, శాటిలైట్ అధునాతన వ్యవస్థను కలిగి ఉన్నామన్నారు.

భవిష్యత్ లో డ్రోన్స్.. గేమ్ ఛేంజర్స్..
భవిష్యత్ లో డ్రోన్స్ గేమ్ ఛేంజర్స్ లా తయారవుతాయని సీఎం జోస్యం చెప్పారు. ఇప్పటికే డ్రోన్స్ లను బాంబులు విసిరేందుకు కూడా పలు దేశాలు ఉపయోగిస్తున్నాయన్నారు. అయితే మన దేశం మాత్రం డ్రోన్స్ ను ప్రజా సంక్షేమానికి ఉపయోగిస్తుందన్నారు. ఇటీవల విజయవాడ వరదల సమయంలో డ్రోన్స్ సేవలు మరువలేనివన్నారు. హెలికాప్టర్ సాయంతో తాము అన్నం ప్యాకెట్లను, భాదితులకు చేరవేసే ప్రయత్నం చేస్తే.. అవి సరైన రీతిలో అందలేదన్నారు. అదే డ్రోన్స్ సాయంతో అన్నం ప్యాకెట్లు చెక్కుచెదరకుండా అందాయని, 150000 మంది భాదితులకు డ్రోన్స్ సాయం చేశాయన్నారు. అలాగే నేటి రోజుల్లో వ్యవసాయ రంగానికి డ్రోన్స్ ఉపయోగపడుతున్నాయని, నేరాల నియంత్రణ, ప్రజా రక్షణలో వీటి పాత్ర ప్రధానంగా కనిపిస్తోందన్నారు.


Also Read: UnstoppableS4 Promo: ఆట మొదలైంది.. సీఎంతో మామూలుగా ఉండదు..!

హైదరాబాద్ దేశంలోనే బెస్ట్ సిటీ..
తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరం ది బెస్ట్ సిటీ ఇన్ ఇండియా అంటూ చంద్రబాబు అన్నారు. 1995 లోనే తాను ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఐటీ గురుంచి ఆలోచించానన్నారు. మైక్రోసాఫ్ట్ తో పాటు చాలా కంపెనీలను హైదరాబాద్ కు తీసుకువచ్చామన్నారు. అదే రీతిలో ఇప్పుడు ఏపీ అభివృద్ది బాటలో నడిచేందుకు తాము అన్ని చర్యలు తీసుకుంటున్నామని, కంపెనీలకు తాము ఎప్పటికీ స్వాగతిస్తామన్నారు. డ్రోన్స్ తయారీ కంపెనీలకు ఏపీ ఒక కేంద్రంలా మార్చడమే తన ముందున్న లక్ష్యమన్నారు. ఇలా డ్రోన్ సమ్మిట్ ప్రారంభం కాగా, అధునాతన టెక్నాలజీ గల డ్రోన్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సమ్మిట్ విజయవంతమయ్యేందుకు కృషి చేసిన అధికారులను, సమ్మిట్ కు హాజరైన కంపెనీల ప్రతినిధులను బాబు అభినందించారు.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×