E-Paper
Advertisement

Big tv kissik Talks: అరియానా అసలు పేరు ఇది కాదా… పేరు మార్పుకు ఇదే కారణమా!

Big tv kissik Talks: అరియానా అసలు పేరు ఇది కాదా… పేరు మార్పుకు ఇదే కారణమా!
Advertisement

Big tv kissik Talks: అరియానా గ్లోరీ పరిచయం అవసరం లేని పేరు. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి యాంకర్ గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి ఎన్నో అవమానాలను ఎదుర్కొంటూ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అనంతరం బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొని అవకాశం అందుకోవడం, బిగ్ బాస్ తర్వాత బుల్లితెర కార్యక్రమాలతో వెబ్ సిరీస్లలో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించారు . త్వరలోనే అరియానా(Ariyana) వెండితెరపై కూడా ప్రేక్షకులను సందడి చేయటానికి సిద్ధమవుతున్నారు. ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న అరియానా తాజాగా బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్ (Big tv kissik Talks)కార్యక్రమంలో పాల్గొన్నారు.

అర్చన గ్లోరీ..

ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె తన వ్యక్తిగత విషయాలతో పాటు వృత్తి పరమైన అంశాల గురించి కూడా మాట్లాడుతూ ఎన్నో విషయాలను తెలియచేశారు. ఈ సందర్భంగా తన ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ తన తండ్రి హిందూ అని తన తల్లి క్రిస్టియన్ అని తెలిపారు. అలాగే తన పేరు గురించి ప్రస్తావనకు రావడంతో తన అసలు పేరు అరియానా కాదని అర్చన(Archana) అని ఈమె వెల్లడించారు. నాన్న హిందూ కావడం తనకి ఇష్టంగా అర్చన అని అమ్మ క్రిస్టియన్ అవ్వడంతో నా పేరు పక్కన గ్లోరీ చేర్చి అర్చన గ్లోరీ అని పెట్టారు. ఇండస్ట్రీలోకి వచ్చేముందు తాను అరియానా అని పెట్టుకున్నట్లు తెలియజేశారు.

దరిద్రాలన్నీ నా వెంటే..

Advertisement

అర్చన గ్లోరీగా ఉన్న సమయంలో అష్ట దరిద్రాలన్ని కూడా నా వెంటే ఉండేవి. ఏం చేసినా సక్సెస్ ఉండేది కాదు అందుకే ఇండస్ట్రీలోకి రావడానికి ముందు తన పేరును మార్చుకోవాలనుకున్నాను. ఆ సమయంలోనే వెతుకుతూ ఉంటే అరియానా అనే పేరు నచ్చి పెట్టుకున్నాను. ఇక అమ్మ నాకు ఎంతో ముద్దుగా గ్లోరీ అని పెట్టుకోవడంతో అరియానా గ్లోరీగా అందరికీ పరిచయమయ్యానని తెలిపారు. ఈ పేరు పెట్టుకున్న తర్వాత తాను ఇండస్ట్రీలో ఒక్కో మెట్టు ఎక్కుతూ మంచి సక్సెస్ అందుకున్నానని ఈమె తెలియజేశారు.

Advertisement

ఇక తన ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ తనకొక చెల్లి కూడా ఉందని ప్రస్తుత ఆమె స్టడీస్ పూర్తి చేసే పనిలో ఉన్నారని తెలియజేశారు. తన అమ్మ చెల్లితో తాను కలిసి ఉంటున్నానని అరియానా వెల్లడించారు. ఇక తన కెరీర్ గురించి మాట్లాడుతూ ప్రస్తుతం వెబ్ సిరీస్ తో పాటు కొన్ని సినిమాలలో కూడా నటిస్తున్నానని తెలిపారు . సినిమాలో నా పాత్ర చిన్నది అయినప్పటికీ చాలా కీలకంగా ఉంటుందని త్వరలోనే ఈ సినిమాలన్నీ విడుదల కాబోతున్నాయని తెలియజేశారు. ఇక తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి కూడా ఈ సందర్భంగా అరియానా మాట్లాడుతూ కాస్త ఎమోషనల్ అయ్యారు.

Also Read: Prabhas -Saptagiri: ప్రభాస్ పెద్ద కమెడియన్.. సప్తగిరి పై ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్!

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×