E-Paper
Advertisement

Big tv kissik Talks Promo: టేస్టీతేజతో పెళ్లి షాకింగ్ కండిషన్ పెట్టిన నటి..

Big tv kissik Talks Promo: టేస్టీతేజతో పెళ్లి షాకింగ్ కండిషన్ పెట్టిన నటి..
Advertisement

Big tv kissik Talks Promo: బిగ్ టీవీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలలో కిస్సిక్ టాక్స్(Kissik Talks) కార్యక్రమం ఒకటి. ఈ కార్యక్రమానికి ఎంతో మంచి ఆదరణ లభిస్తున్న సంగతి తెలిసిందే .ప్రతివారం సెలబ్రిటీలు ఈ కార్యక్రమంలో పాల్గొని వారికి సంబంధించిన వ్యక్తిగత విషయాలతో పాటు వృత్తిపరమైన విషయాల గురించి కూడా అభిమానులతో పంచుకుంటున్నారు తాజాగా ఈ కార్యక్రమంలో ప్రముఖ యూట్యూబర్, బిగ్ బాస్ కంటెస్టెంట్ టేస్టీ తేజ హాజరయ్యారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా టేస్టీ తేజ తన యూట్యూబ్ జర్నీ గురించి, అలాగే తన వ్యక్తిగతం విషయాల గురించి అభిమానులతో పంచుకున్నారు.

సిక్స్ ప్యాక్ ఉంటేనే పెళ్లి..

ఈ క్రమంలోనే తన పెళ్లి గురించి కూడా ఈయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. టేస్టీ తేజ చూడటానికి కాస్త బొద్దుగా కనిపిస్తారు ఈ నేపథ్యంలోనే తనకు అమ్మాయిలు ఎవరు పడరని తెలిపారు. అలాగే తాను అమ్మాయిలతో మాట్లాడటానికి కూడా కాస్త ఇబ్బంది పడతానని తేజ ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ ప్రోమోలో భాగంగా తనని పెళ్లి చేసుకోవడం కోసం నటి ప్రియాంక జైన్ (Priyanka Jain)పెట్టిన కండిషన్ గురించి బయట పెట్టడంతో ఈ కామెంట్స్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బిగ్ బాస్ కంటెస్టెంట్ గా టేస్టీ తేజ ప్రియాంక మధ్య చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉంది.

టేస్టీ తేజను పెళ్లి చేసుకుంటానన్న ప్రియాంక జైన్..

Advertisement

ఈ నేపథ్యంలోనే ప్రియాంక జైన్ టేస్టీ తేజతో మాట్లాడుతూ.. నువ్వు కచ్చితంగా బరువు తగ్గి సిక్స్ ప్యాక్ ట్రై చేస్తే తానే నిన్ను పెళ్లి చేసుకుంటానని శివ్ కు బ్రేకప్ చెప్పేస్తాను అంటూ కండిషన్ పెట్టిందని టేస్టీ తేజ తెలియ చేశారు. దీంతో వర్ష ఒకసారి ప్రియాంకకు ఫోన్ చెయ్ అంటూ ఫోన్ చేయగా ప్రియాంక ఫోన్లో కూడా ఇదే విషయాన్ని తెలియజేశారు. దీంతో ఈ కామెంట్స్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బరువు తగ్గి సిక్స్ ప్యాక్ ట్రై చేస్తే పెళ్లి చేసుకుంటానంటూ ప్రియాంక పెట్టిన కండిషన్ పై అభిమానులు విభిన్న రీతిలో కామెంట్ చేస్తున్నారు.

Advertisement

ఇక ఈ ప్రోమోలో భాగంగా ఈయన తన పట్ల వచ్చిన బాడీ షేమింగ్ కామెంట్స్ గురించి అలాగే ఫుడ్ వీడియోలు చేయటం వల్ల ఎదురవుతున్న అనారోగ్య సమస్యల గురించి కూడా తెలియజేశారు.. ఫుడ్ వీడియోలు చేసేవాళ్లు చాలా అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని తాను ఎన్నో ఇబ్బందులు పడినట్లు ఈ ప్రోమోలో చెప్పినట్టు తెలుస్తుంది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా టేస్టీ తేజ ఇంకా ఎలాంటి విషయాలను తెలియజేశారనేది తెలియాలి అంటే పూర్తి ఎపిసోడ్ ప్రసారం కావాల్సిందే. ఇక పూర్తి ఎపిసోడ్ శనివారం రాత్రి 8 గంటలకు బిగ్ టీవీలో ప్రసారం కానుంది.

Also Read : Bigg Boss Telugu 9 Winner: బిగ్ బాస్ 9 విన్నర్ ఎవరో చెప్పేసిన నికిల్…తనూజ మాత్రం కాదు?

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×