E-Paper
Advertisement

Prince Yawar: హనీ ట్రాప్ ఉచ్చులో బిగ్ బాస్ యావర్.. లక్షల్లో నష్టాలు!

Prince Yawar: హనీ ట్రాప్ ఉచ్చులో బిగ్ బాస్ యావర్.. లక్షల్లో నష్టాలు!
Advertisement

Prince Yawar:  బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో ప్రిన్స్ యావర్(Prince Yawar) ఒకరు. ఈ కార్యక్రమంలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న యావర్ తాజాగా హనీ ట్రాప్ (Honey Trap)ఉచ్చులో తెలుస్తోంది. ఒక బిల్డర్ కు డబ్బులు ఇచ్చి మోసపోయానని తిరిగి డబ్బులు అడగడంతో హనీ ట్రాప్ చేయించారు అంటూ ఈయన ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ఈయన హనీ ట్రాప్ ఉచ్చులో చిక్కుకోవడానికి గల కారణాలు ఏంటి? అసలేం జరిగింది? ఎంత మొత్తంలో డబ్బులు నష్టపోయారు అనే విషయానికి వస్తే..

రూ.23 లక్షలు మోసపోయిన ప్రిన్స్ యావర్..

గచ్చిబౌలికి చెందిన బిల్డర్ నవాజ్ అనే వ్యక్తి యావర్  వద్దకు వచ్చి తన కుమార్తెతో నిశ్చితార్థం చేయిస్తాను అంటూ మాటలు కలిపి తనతో మంచి పరిచయం ఏర్పరచుకున్నారు. ఈ పరిచయం కారణంగానే యావర్ నుంచి రియల్ ఎస్టేట్ పెట్టుబడి పేరుతో సుమారు 23 లక్షల రూపాయల వరకు డబ్బును తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విధంగా యావర్ నుంచి ఇంత పెద్ద మొత్తంలో డబ్బు తీసుకున్న నవాజు కొద్ది రోజుల తర్వాత 40 లక్షల రూపాయలతో తిరిగి చెల్లిస్తాను అంటూ నమ్మించాడు. ఇక నవాజ్ చెప్పిన గడువు వరకు ఎదురు చూసిన యావర్ ఆ గడువు కాస్త పూర్తి కావడంతో తిరిగి నవాజ్ ను డబ్బు అడగడంతో నవాజ్ తనకు డబ్బులు చెల్లించకపోగా డబ్బు విషయంలో ఎదురు తిరిగారు.

పద్ధతి ప్రకారమే యావర్ ను ట్రాప్ చేసిన బిల్డర్..

Advertisement

ఈ విధంగా నవాజ్ డబ్బు చెల్లించకపోవడంతో మోసపోయానని గ్రహించిన యావర్ వెంటనే చార్మినార్ పోలీస్ స్టేషన్ లో బిల్డర్ నవాజ్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలా తనపై కేసు నమోదు కావడంతో బిల్డర్ నవాజ్ తన కుమార్తె చేత యావర్ ను హనీ ట్రాప్ చేయించి తనపై ఆరోపణలు చేయడమే కాకుండా యావర్ పై రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఈ విధంగా తనపై కేసు నమోదు కావడంతో యావర్ తనకు న్యాయం చేయాలి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బిల్డర్ నవాజ్ పద్ధతి ప్రకారమే ముందస్తు ప్రణాళికలతో తనతో పరిచయం ఏర్పరచుకొని తన వద్ద నుంచి డబ్బు తీసుకున్నారని, తిరిగి ఆ డబ్బు చెల్లించకపోవడమే కాకుండా తనపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు.

కేటీఆర్ పేరుతో మోసం ..

Advertisement

ఇలా తనని ఇబ్బందులకు గురిచేయడంతో ప్రిన్స్ యావర్ పోలీస్ కమిషనర్ ను కలిసి తన బాధను మొత్తం బయటపెట్టారు. ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. మరి ఈ విషయంలో యావర్ కు న్యాయం జరుగుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. అయితే గత కొద్ది రోజుల క్రితం ఇదే విషయం గురించి యావర్ ఒక వీడియోని షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఇలా డబ్బులు తీసుకుని మోసం చేశారని డబ్బులు అడుగుతుంటే తనకు కేటీఆర్ పేరు చెప్పి బెదిరింపులకు గురి చేస్తున్నారు అంటూ ఈయన ఆవేదన చెందారు. ఇక ఇప్పుడు ఆ డబ్బు విషయంలోనే ఈయన పట్ల హాని ట్రాప్ చేశారు అంటూ ఆవేదన చెందుతున్నారు.

Also Read: Oka Roju movie Trailer: సాయి పల్లవి జునైద్ ఏక్ దిన్ తెలుగు ట్రైలర్ రిలీజ్..

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×