BigTV English

Suresh Gopi Trouble: చిక్కుల్లో కేంద్రమంత్రి, సురేష్ గోపిపై కేసు

Suresh Gopi Trouble: చిక్కుల్లో కేంద్రమంత్రి, సురేష్ గోపిపై కేసు

Suresh Gopi Trouble: కేరళ బీజేపీ నేత, కేంద్రమంత్రి సురేష్ గోపికి కష్టాలు మొదలయ్యాయి. రాజకీయ నేతల ఒత్తిడితో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంతకీ కేంద్రమంత్రి చేసిన తప్పేంటి? లోతుల్లోకి ఒక్కసారి వెళ్దాం.


మోదీ కేబినెట్‌లో కేరళకు చెందిన ఏకైక మంత్రి సురేష్ గొపి. ఇటీవల ఆయన కేరళలోని త్రిస్సూర్ నిర్వహించే ఉత్సవానికి ఆయన అంబులెన్స్‌లో వచ్చారు. అలా రావడాన్ని రాజకీయ పార్టీ తీవ్రంగా తప్పుబట్టాయి.

కేంద్రమంత్రికి సహాయం చేసేందుకు ఉత్సవ కమిటీ అలా చేసిందంటూ ఆరోపణలు తీవ్రమయ్యాయి. ఈ వ్యవహారానికి రాజకీయ రంగు పులుముకుంది.  స్థానిక నేతలు ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేంద్రమంత్రి సురేష్ గోపిపై కేసు నమోదు చేశారు పోలీసులు.


రీసెంట్‌గా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో త్రిస్సూర్ నుంచి గెలిచారు సురేష్ గోపి. ఆ తర్వాత పార్లమెంటులో అడుగుపెట్టారు. అయితే మోదీ కేబినెట్‌లో ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే సొంత నియోజకవర్గంలో జరుగుతున్న పూరం ఉత్సవానికి అంబులెన్స్‌లో హాజరయ్యారు. ఒక విధంగా చెప్పాలంటే అధికారాన్ని దుర్వినియోగం చేశారన్నది కేంద్రమంత్రిపై పార్టీల ఆరోపణ.

ALSO READ: చికెన్ కర్రీ కోసం హో టల్‌లో వెయిటర్‌ హత్య.. రాత్రి కస్టమర్లు ఏం చేశారంటే..

కొన్నాళ్ల నుంచి దీనిపై రాజకీయ రచ్చ సాగుతోంది. చివరకు పోలీసులు కేసు నమోదు చేయడం జరిగిపోయింది. ఈ వ్యవహారంపై కేంద్రమంత్రి రియాక్ట్ అయ్యారు. తనపై వస్తున్న ఆరోపణలు అవాస్తవ మన్నారు. జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారాయన.

తన సొంత కారులో ఉత్సవానికి హాజరయ్యానన్నది సురేష్‌ గోపి వెర్షన్. తాను అంబులెన్సులో వెళ్లినట్టు ఎవరైనా చూస్తే ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. దీనిపై విచారణకు కేరళ పోలీసులు కరెక్ట్ కాదని, సీబీఐకి అప్పగించాలని కోరారు కేంద్రమంత్రి.

రాజకీయ పార్టీలు ఆరోపణలు బూమరాంగ్ అవుతాయని అంటున్నారు కేరళ బీజేపీ ప్రెసిడెంట్ సురేంద్రన్. అయితే, తన వాహనంపై దుండగులు దాడి చేసినందున అంబులెన్స్‌ను ఉపయోగించాల్సి వచ్చిందంటూ గతంలో సురేష్ గోపి చేసిన ప్రకటనను ఉపసంహరించుకున్న విషయం తెల్సిందే.

Related News

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

New Bride Incident: ఫ్రెండ్సే చంపేశారా? నవ వధువు కేసులో బిగ్ ట్విస్ట్!

Tamilnadu Crime: రాజకీయ నేత ఫామ్‌హౌస్.. ఎస్ఐని చంపేశారు, ఏం జరిగింది?

Karimnagar Crime: యూట్యూబ్ చూసి డైరెక్షన్ ఇచ్చింది.. పనంతా ప్రియుడు చేశాడు, చివరకు ఏమైంది?

Serial killer: అతడి ఇల్లంతా రక్తం.. ఎముకల గుట్ట.. కేరళలో ఒళ్లు గగూర్పాటు కలిగించే ఘటన!

Road Accident: చెట్టును ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి, మరో ఆరుగురికి గాయాలు

Big Stories

×