E-Paper
Advertisement

Hari Hara Veera Mallu : పవన్ మూవీలో డైలాగ్ లీక్.. అసలు విషయం చెప్పిన బాలీవుడ్ స్టార్..

Hari Hara Veera Mallu : పవన్ మూవీలో డైలాగ్ లీక్.. అసలు విషయం చెప్పిన బాలీవుడ్ స్టార్..
Advertisement
Hari Hara Veera Mallu

Hari Hara Veera Mallu : పవన్ కళ్యాణ్.. టాలీవుడ్ లో తన పేరుని బ్రాండ్ గా మార్చుకున్న పవర్ స్టార్. వరుస క్రేజీ ప్రాజెక్ట్స్ తో ఇటు సినిమాలలో.. అటు రాజకీయాలలో ఫుల్ బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ మూవీస్ కోసం అభిమానులు క్రేజీగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు మూవీ గురించి ఎప్పటినుంచో పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి.పీరియాడిక్ డ్రామా కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం లో పవన్ లుక్స్ దగ్గర నుంచి ప్రతిదీ అభిమానులకు కొత్తగానే ఉంది.

అందుకే ఈ మూవీ కోసం చాలా ఎక్సైటింగ్గా ఎదురుచూస్తున్నారు. కానీ తెలుగు రాష్ట్రాల ఎలక్షన్స్ హడావిడి కారణంగా ఈ మూవీ షూటింగ్ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే ఉంది. అయినా సరే ఈ మూవీ నుంచి ఏ చిన్న వార్త వచ్చినా వైరల్ చేసేస్తున్నారు పవన్ ఫ్యాన్స్. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలో భాగమైన బాబీ వీడియో లీక్ చేసిన ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది.

Advertisement

బాబీ డియోల్.. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో రేపు డిసెంబర్ ఒకటి విడుదల కాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ యానిమల్ లో విలన్ క్యారెక్టర్ పోషిస్తున్నాడు. అలాగే పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు చిత్రంలో కూడా బాబి డియోల్ నటిస్తున్నాడు. నిన్న యానిమల్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాటిస్పేట్ చేసిన బాబీ.. పవన్ కళ్యాణ్ మూవీ నుంచి ఓ డైలాగ్ ని లీక్ చేశాడు. ప్రస్తుతం ఈ డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

నేను తెలుగులో ఒక సినిమా లో నటిస్తున్నాను.. అందులో ఒక డైలాగ్ నాకు బాగా గుర్తుండిపోయింది. ఇప్పుడు మీకు అదే చెప్పాలి అనుకుంటున్నాను అన్న బాబీ డియోల్..’బాద్షా బేగం మా ప్రాణం. ఆ ప్రాణం నువ్వు కాపాడావు. నీకు ఏం కావాలో కోరుకోమని నేను ఆదేశిస్తున్నాను’ అనే డైలాగ్ తనకు వచ్చిన తెలుగులో చెప్పాడు. ప్రస్తుతం ఈ డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. బహుశా ఇది బాబీ..పవన్ తో చెప్పే డైలాగ్ అయి ఉంటుంది అని అందరూ భావిస్తున్నారు.ఇక హరిహర వీరమల్లు మూవీ విషయానికి వస్తే.. ఇప్పటికే సినిమా షూటింగ్ 60 శాతం పైగా పూర్తి అయింది. బ్యాలెన్స్ కూడా పూర్తి అయితే త్వరలోనే ఇది థియేటర్లోకి విడుదల అవుతుంది. మొదటిసారి పవన్ కళ్యాణ్ ఒక పిరియాడిక్ జోనర్ లో వారియర్ గా నటిస్తున్న మూవీ కావడంతో దీనిపై ఆసక్తికరమైన బజ్ నెలకొని ఉంది.

Advertisement

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×