BigTV English
Advertisement

Aamir Khan : మూడో పెళ్లికి రెడీ అవుతున్న బాలీవుడ్ హీరో.. ఆమెతోనే పెళ్లా..?

Aamir Khan : మూడో పెళ్లికి రెడీ అవుతున్న బాలీవుడ్ హీరో.. ఆమెతోనే పెళ్లా..?

Aamir Khan : బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు అందుకున్నాడు. దంగల్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు నటించి తెలుగు ప్రేక్షకుల మనసుని దోచుకున్న స్టార్ నటుడు అమీర్ ఖాన్.. మంచి సక్సెస్ రేంజ్ లో ఉన్న ఈ స్టార్ హీరో పర్సనల్ లైఫ్ విషయంలో మాత్రం కాస్త అటు ఇటు అడుగులు వేస్తున్నారని ఓ వార్త ఇండస్ట్రీలో వినిపిస్తుంది. చాలామంది అస్సలు పెళ్లిళ్లు కాక బాధపడుతుంటే.. అమీర్ ఖాన్ మాత్రం జోరుగా పెళ్లిళ్లు చేసుకుంటున్నాడు. ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకున్న అమీర్, ఇక మూడో పెళ్లికి రెడీ అవుతున్నాడని, అది కూడా పిల్లలకు పెళ్లిళ్లు చెయ్యాల్సిన టైమ్ లో పెళ్లి చేసుకోవడం ఏంటి అని సోషల్ మీడియాలో ఈ టాపిక్ ఓ రేంజులో హైలెట్ అవుతుంది.. మరి ఈయన మూడు పెళ్లి ఎవరిని చేసుకోబోతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..


అమీర్ ఖాన్ కు ప్రస్తుతం అరవైఏళ్ల వయసు ఉంటుంది.. ఈ వయసులో ఉన్న బాలీవుడ్‌ నటుడు అమీర్‌ ఖాన్‌ మళ్లీ ప్రేమలో పడ్డారు. బెంగళూరుకి చెందిన ఓ యువతితో ఆయన ప్రేమాయణం సాగిస్తున్నారనీ, ఇటీవలే ఆమెను తన కుటుంబ సభ్యులకు పరిచయం చేశారనీ బీ టౌన్‌లో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. ఆమె ఎవరన్నా విషయాలు ప్రస్తుతానికి అయితే తెలియవు కానీ అమీర్ ఖాన్ ప్రేమించారని తెలియగానే అతని కుటుంబ సభ్యులు ఆ ప్రేమకు ఆమోదం తెలిపారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక త్వరలోనే వీరి పెళ్లి జరగనుందని తెలుస్తుంది.. నిజానికి అమీర్ ఖాన్ కు ఇది మూడో పెళ్లి. గతంలో రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు..

అమీర్‌ ఖాన్‌ తొలి వివాహం 1986లో రీనా దత్తాతో జరిగింది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు.. జునైద్‌ , ఐరా ఖాన్‌. 2002లో మనస్పర్థలు రావడంతో భార్య నుంచి విడిపోయారు బడా హీరో. ఆ తర్వాత దర్శకురాలు కిరణ్‌ రావుతో నాలుగేళ్లు డేటింగ్‌ చేసి, 2005లో ఆమెని వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ ఒక కుమారుడు ఆజాద్‌ ఉన్నాడు. 15 ఏళ్ల వైవాహిక బంధానికి గుడ్‌ బై చెప్పేసి 2021లో వీరిద్దరూ కూడా కోర్టు మెట్లేక్కి విడాకులు తీసుకున్నారు.. ఇప్పుడు మూడో పెళ్లికి రెడీ అయ్యారు.


అందుతున్న సమాచారం మేరకు.. అమీర్ ఖాన్ చేసుకోబోతున్న ఆమె బెంగుళూరు వాసి.. ఆమెను 59 ఏళ్ల అమీర్ తన కుటుంబానికి ఇప్పటికే పరిచయం చేశారట. రియా చక్రవర్తికి చెందిన పోడ్‌కాస్ట్ 2వ ఎపిసోడ్‌లో అమీర్ ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను మూడో పెళ్లి చేసుకునే అవకాశాలు ఉన్నాయని స్పష్టంగా వెల్లడించారు.. ఇప్పటికీ తన ఇద్దరు భార్యలతో సన్నిహితంగానే ఉన్నానని ఇక మూడో పెళ్లి కచ్చితంగా చేసుకుంటానని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు అమీర్ ఖాన్.. మరి పెళ్లెప్పుడు అన్నది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది.. త్వరలోనే పెళ్లి జరగనుందని సమాచారం.. పెళ్లి డేట్ ను మరికొద్ది రోజుల్లో అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×