Thandel Pre Release Event:గత 15 రోజులుగా రోజుకొక కార్యక్రమం చొప్పున తండేల్ (Thandel) మూవీకి సంబంధించిన పలు ఈవెంట్స్ నిర్వహిస్తూ.. ఆడియన్స్ లో సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేస్తూ వస్తున్నారు చిత్ర బృందం. ఇక అనుకున్నట్టుగానే మొన్న ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. వైజాగ్ లో పెద్ద ఈవెంట్ ఏర్పాటు చేసిన చిత్ర బృందానికి అక్కడి ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ సినిమాపై మరింత నమ్మకాన్ని పెంచిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ట్రైలర్ విడుదలైన అతి తక్కువ సమయంలోనే యూట్యూబ్లో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది. అత్యధిక వ్యూస్, లైక్స్ సాధించిన ట్రైలర్ గా రికార్డు సృష్టించింది. ఇకపోతే ఈరోజు హైదరాబాదులో తండేల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించనున్నారు అని, ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్ (Allu Arjun)!కూడా చీఫ్ గెస్ట్ గా రానున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి.
తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్..
అసలు విషయంలోకి వెళ్తే.. నాగచైతన్య(Naga Chaitanya), సాయి పల్లవి (Sai Pallavi) జంటగా నటిస్తున్న చిత్రం తండేల్. ‘కార్తికేయ 2’ సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్న చందు మొండేటి(Chandu Mondeti) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఫిబ్రవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈరోజు హైదరాబాద్లో చాలా ఘనంగా నిర్వహించాలని ప్లాన్ చేశారు. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ (Allu Aravindh) సమర్పణలో గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు(Bunny vasu) నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇక అల్లు అరవింద్ సమర్పణలో రాబోతున్న నేపథ్యంలో ‘పుష్ప2’ సినిమాతో పాన్ ఇండియా రికార్డ్స్ బద్దలు కొట్టి, సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన అల్లు అర్జున్ ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా వస్తారని అందరూ అనుకున్నారు. దీనికి తోడు పోస్టర్లను కూడా రిలీజ్ చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆగిపోయింది. మరి ఎప్పుడు ఈవెంట్ నిర్వహిస్తారు అనే విషయంపై క్లారిటీ లేదు.. వాస్తవానికి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అల్లు అర్జున్ వస్తున్నాడని తెలియడంతో అభిమానులు పెద్ద ఎత్తున సిద్ధం అయిపోయారు. తమ అభిమాన హీరోని మళ్లీ నేరుగా చూడాలని ఎన్నో కలలు కన్నారు. అటు చైతూ అభిమానులు కూడా అల్లు అర్జున్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా వస్తే కచ్చితంగా సక్సెస్ అవుతుందని , క్రేజ్ పెరుగుతుందని ఆశించారు. కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అవ్వడంతో అభిమానులు, సినీప్రియలు నిరాశ వ్యక్తం చేస్తున్నారని చెప్పవచ్చు.
పర్ఫామెన్స్ తో అదరగొడుతున్న నటీనటులు..
ఇదిలా ఉండగా ఈ సినిమాలో నాగచైతన్య రాజు పాత్రలో.. సాయి పల్లవి సత్య పాత్రలో నటిస్తున్నారు. శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్ లో మత్స్యకారుల నిజజీవిత కథగా తెరకెక్కిన ఈ సినిమా అటు దేశభక్తితో ముడిపడిన ప్రేమ కావ్యంగా తెరకెక్కించారు.ముఖ్యంగా చందు మొండేటి ఈ సినిమాను చాలా అద్భుతంగా చూపించినట్లు మనకు ట్రైలర్స్, గ్లింప్స్ చూస్తే అర్థమవుతుంది. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ బ్రేక్ చేస్తుందో చూడాలి.