BigTV English
Advertisement

Nora Fatehi Birthday Special: ప్రభాస్ హీరోయిన్ నోరా ఫతేహీ బర్త్‌డే.. నార్త్ టు సౌత్.. ఐటెం సాంగ్‌లో ఆమెదే హవా

Nora Fatehi Birthday Special: ప్రభాస్ హీరోయిన్ నోరా ఫతేహీ బర్త్‌డే.. నార్త్ టు సౌత్.. ఐటెం సాంగ్‌లో ఆమెదే హవా

Nora Fatehi Birthday Special story: నోరా ఫతేహి.. సినీ అభిమానులకు, డ్యాన్స్‌ లవర్లకు పరిచయం అక్కర్లేని పేరు. మోడల్, డ్యాన్సర్‌, నటి, సింగర్‌​, రియాలిటీ షోస్‌కు జడ్జిగా.. ఇలా అన్ని రంగాల్లో ఇప్పటికే ఈ బ్యూటీ తనదైన ముద్ర వేసుకుంది. తరచూ సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అందచందాలతో కుర్రకారును హీటెక్కిస్తుంది. అయితే ఈరోజు ఈ అందాల భామ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమెకు సంబంధించిన కొన్ని విషయాలను తెలుసుకుందాం..


నోరా ఫతేహి 6 ఫిబ్రవరి 1992న కెనడాలో జన్మించింది. టొరంటోలోని వెస్ట్ వ్యూ సెంటెనియల్ సెకండరీ స్కూల్ నుంచి పాఠశాల విద్యను పూర్తి చేసింది. ఆమె అనేక హిందీ, తెలుగు సినిమాల్లో కనిపించింది. అంతేకాకుండా ప్రముఖ రియాలిటీ షోలకు జడ్జిగా కూడా వ్యవహరించింది.

నోరా ఫతేహి నటించిన మొదటి హిందీ చిత్రం ‘రోర్:టైగర్స్ ఆఫ్ సుందర్బన్’. కమల్ సదానా దర్శకత్వంలో తెరకెక్కింది. ఇక ఈ సినిమా తర్వాత అదే ఏడాదిలో ‘క్రేజీ కుక్కడ్ ఫ్యామిలీ’లో నటించి మెప్పించింది.


ఆ తర్వాత ఐటెం సాంగ్స్ వైపు ఫోకస్ పెట్టింది. తెలుగులో మొదటి సారిగా ‘టెంపర్’ మూవీలో ‘ఇట్టాగే రెచ్చిపోదాం’ అంటూ ఎన్టీఆర్‌తో డ్యాన్స్ కుమ్మేసింది. ఈ పాటకు ప్రేక్షకులు థియేటర్లలో ఈళలు వేస్తూ గోలగోల చేశారు.

ఇక ఈ సాంగ్‌తో నోరా ఫతేహికి మంచి పాపులారిటీ వచ్చింది. దీంతోపాటు ఆమె మలయాళ చిత్రం ‘డబుల్ బ్యారెల్’లోనూ స్పెషల్ సాంగ్ చేసి అదరగొట్టేసింది.

ఇక 2015లో నోరా ప్రముఖ రియాలిటీ టెలివిజన్ షో ‘బిగ్ బాస్9’లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా పాల్గొంది. అలాగే 2016లో రియాలిటీ టెలివిజన్ డ్యాన్స్ షో ‘ఝలక్ దిఖ్లా జా9’లో పాల్గొని తన డ్యాన్స్ స్కిల్స్‌ను చూపించింది.

ఇక 2018 ప్రారంభంలో యూట్యూబ్ ఛానెల్ ‘ది టైమ్‌లైనర్స్’లో ఆమె తన వెబ్ సిరీస్ ‘లేడీస్ స్పెషల్: టైప్స్ ఆఫ్ సింగిల్ గర్ల్స్’లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

అలాగే అదే ఏడాది 2018లో సత్యమేవ జయతే సినిమాలో ‘దిల్బర్’ సాంగ్ చేసి అద్భుతమైన రెస్పాన్స్‌ను అందుకుంది. ఈ సాంగ్ విడుదలైన 24 గంటల్లోనే దాదాపు 20 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఇలాంటి మాసివ్ రెస్పాన్స్ వ్యూస్ అందుకున్న తొలి హిందీ పాటగా ఇది నిలిచింది.

2019లో ‘మొరాకో మ్యాగజైన్’ కవర్ పేజీలో దర్శనమిచ్చింది. అదే ఏడాది ఆమె ప్రభాస్ హీరోగా నటించిన ‘బాహుబలి’ సినిమాలో ‘మనోహరి’ పాటలో తన డ్యాన్స్‌తో కుర్రకారును హీటెక్కించేసింది. ఈ పాటలోని ఆమె లుక్స్‌తో అందరినీ కట్టిపడేసింది. దీంతోపాటు కిక్2 సినిమాలోనూ ఐటెం సాంగ్‌ చేసి తనదైన శైలిలో రెస్పాన్స్‌ను సంపాదించుకుంది.

అలాగే లోఫర్, ఊపిరి చిత్రాల్లో కూడా ఆడిపాడింది ఈ ముద్దుగుమ్మ. రీసెంట్‌గా ‘థాంక్స్ గాడ్’ మూవీతో పలకరించింది. దీంతోపాటు డ్యాన్స్ షోలకు జడ్జిగా కూడా వ్యవహరిస్తోంది.

కేవలం ఐటెం సాంగ్‌లతో నోరా ఫతేహి తెలుగు, హిందీ, మలయాళం, తమిళ తదితర బాషల్లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇక సినిమాలతో పాటు ఇటు సోషల్ మీడియాలో కూడా ఈ భామకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

ఎలాంటి డ్యాన్స్‌ మూమెంట్స్‌ను అయిన తన స్టైల్లో అవలీలగా చేస్తూ కుర్రకారు మదిని దోచుకుంటుంది. అంతేకాకుండా ఎప్పటికపుడు సోషల్ మీడియాలో తన హాట్ హాట్ ఫొటోలతో కేక పెట్టిస్తూ ఈ ఐటం బాంబ్ మరింత ఫాలోవర్స్‌ను పెంచుకుంటోంది.

అప్పుడప్పుడు తన డ్యాన్స్ వీడియోలను కూడా షేర్ చేస్తూ అలరిస్తుంటుంది. మొత్తానికి ఈ బ్యూటీ స్పెషల్ సాంగ్‌లతో అటు బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్.. ఇతర భాషల్లో కూడా తనదైన ముద్ర వేసుకుంది.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×