E-Paper
Advertisement

Sraddha kapoor:పెళ్లిపై ఇప్పట్లో ‘శ్రద్ధ’పెట్టలేనంటోంది

Sraddha kapoor:పెళ్లిపై ఇప్పట్లో ‘శ్రద్ధ’పెట్టలేనంటోంది
Advertisement

Bollywood actress Sraddha Kapoor openion on Marriage
సెలబ్రిటీలకు అభిమానులు ఎక్కువగా ఉండటం గొప్పే.. కానీ ఒక్కోసారి అభిమానులు హద్దు మీరి పర్సనల్ ప్రశ్నలతో వేధిస్తుంటారు. కొందరు కథానాయికలు దీనిని లైట్ గా తీసుకుంటే మరికొందరు సీరియస్ గా తీసుకుంటుంటారు. ఈ సమస్య బాలీవుడ్ కథానాయిక శ్రద్ధా కపూర్ కి సైతం తప్పలేదు. ఒకప్పటి బాలీవుడ్ పాపులర్ విలన్ శక్తి కపూర్ కుమార్తె శ్రద్ధాకపూర్ తన అందం, అభినయంతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో పాన్ వరల్డ్ స్టార్ ప్రభాస్ సరసన ‘సాహో’ మూవీలో నటించింది. అయితే ఆ చిత్రంలో యాక్షన్ హీరోయిన్ గా మంచి గుర్తింపే లభించినా తెలుగులో మళ్లీ అవకాశాలు రాలేదు.

ఆషికీ టర్నింగ్ పాయింట్

Advertisement

బాలీవుడ్ లోనూ అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. ఆషికీ మూవీ ఈ బ్యూటీకి బాలీవుడ్ టర్నింగ్ పాయింట్ అయింది. అయితే ప్రస్తుతం స్త్రీ-2అనే సీక్వెల్ మూవీని చేస్తోంది. 2018లో విడుదలైన స్త్రీ మూవీ మంచి కమర్షియల్ హిట్ గా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు నిర్మాతలు ఈ సినిమాకు సీక్వెల్ గా స్త్రీ-2ను రూపొందిస్తున్నారు. రీసెంట్ గా ఈ మూవీకి సంబంధించిన ప్రమోషనల్స్ జరుగుతున్నాయి. అందులో భాగంగా ఓ ఈవెంట్ నిర్వహించింది చిత్ర యూనిట్. అభిమానులతో చిట్ చాట్ కార్యక్రమంలో పాల్గొన్నారు శ్రద్ధా కపూర్. వాళ్లడిగిన ప్రశ్నలన్నింటికీ ఓపికగా సమాధానాలు ఇచ్చారు.

అభిమానిపై అసహనం

Advertisement

అయితే ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు కొంత అసహనానికి గురయ్యారు. హఠాత్తుగా ఆ అభిమాని శ్రద్ధా మేడమ్ మీరు పెళ్లి ఎప్పుడు చేసుకోబోతున్నారు అని అడిగాడు. అది ఎవరిష్టం వారిది. నాకు ఎప్పుడు చేసుకోవాలని అనిపిస్తుందో అప్పుడే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. ప్రస్తుతానికి వివాహంపై ధ్యాస లేదని అంది. దాంతో అభిమానులు కొద్ది సేపు గోల చేయడం ఆరంభించారు. శ్రద్ధాకపూర్ కొంతకాలంగా ఓ వ్యక్తితో రిలేషన్ షిప్ లో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. వాళ్లిద్దరి ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అతని పేరు రాహుల్ మోడీ. ఇటీవల వీళ్లిద్దరూ కలిసి అంబానీ, రాధిక పెళ్లికి వెళ్లారు. అక్కడ వీరిద్దరినీ చూసి అంతా త్వరలోనే వీళ్లు కూడా వివాహం చేసుకుంటారని చర్చించుకున్నారు. అయినా శ్రద్ధా ఏనాడూ తన బాయ్ ఫ్రెండ్ గురించి ఎక్కడా, ఎవ్వరితో చెప్పకపోవడం గమనార్హం. నెటిజెన్స్ మాత్రం రాహుల్ మోడీతో శ్రద్ధాకు ఉన్న రిలేషన్ షిప్ కేవలం ఫ్రెండ్ షిప్సా లేక ఇంకేదైనా ఉందా అని తలలు బాదుకుంటున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×