BigTV English

Bollywood Heroine : ల్యాండ్ కబ్జా కేసులో బుక్కయిన బో** బ్యూటీ..ఇక జైలుకేనా..?

Bollywood Heroine : ల్యాండ్ కబ్జా కేసులో బుక్కయిన బో** బ్యూటీ..ఇక జైలుకేనా..?

Bollywood Heroine : బాలీవుడ్ శృంగార తార, హీరోయిన్ సన్నీ లియోన్ గురించి ఎంత చెప్పిన తక్కువే.. ఆమె చూడటానికే థియేటర్లకు యువత క్యూ కడుతుంటారు. అందుకే సినిమాలు మంచి టాక్ ను సొంతం చేసుకుంటాయి. ప్రస్తుతం బాలీవుడ్ తో పాటుగా టాలీవుడ్ లో కూడా ఈ అమ్మడు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అయితే ఒకవైపు సినిమాలతో స్టార్ ఇమేజ్ ను అందుకోవాలని చూస్తుంది. కానీ ఏదొక కారణాలతో వార్తల్లో నిలుస్తుంది. తాజాగా మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఈసారి అమ్మడుకు గట్టి షాక్ తగిలింది. జైలుకు వెళ్ళే అవకాశాలు ఉన్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అసలు విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..


సన్నీ లియోన్ వ్యాపారాలు..

బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీ లియోన్ ఒకవైపు సినిమాల తో బిజీగా ఉన్నా కూడా మరోవైపు అదిరిపోయే బిజినెస్ లను చేస్తుంది. పలు వ్యాపారాల్లో డబ్బులను ఇన్వెస్ట్మెంట్ చేసి వ్యాపారాలను క్రమంగా విస్తరించుకుంటూ పోతుంది. ఇటీవల నటిగా అవకాశాలు తగ్గిన క్రమంలోనే సన్నీలియోన్ పూర్తిగా వ్యాపారాలపై దృష్టి సారించింది.. ఈ అమ్మడు సౌందర్య ఉత్పత్తుల రంగంలో తనదైన ముద్ర వేస్తోంది. స్టార్ స్టక్ కాస్మోటిక్ బ్రాండ్ సహా రెస్టారెంట్ చైన్ వ్యాపారంలోను సన్నీలియోన్ దూసుకుపోతోంది.. ఇదిలా ఉండగా.. తాజాగా ఓ భూవివాదం ఈమె మెడకు చుట్టుకుంది. ఇక జైలుకు వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది.


భూకబ్జా కేసులో ఇరుక్కున్న సన్నీ…

అసలు విషయానికొస్తే.. సన్నీలియోన్ `చికా లోకా బై సన్నీలియోన్` పేరుతో రెస్టారెంట్ & బార్ నిర్మిస్తోంది. అయితే ఈ భవంతి నిర్మాణం ప్రస్తుతం నిలిపేశారని తెలుస్తోంది.. దానికి కారణం ఒకటే ల్యాండ్ కబ్జా చేశారని తెలుస్తుంది. పిల్లల ఆట స్థలం, కమ్యూనిటీ హాల్, సీనియర్ సిటిజన్ల కోసం ప్రభుత్వం నియోగించిన స్థలాన్ని సన్నీలియోన్ ఆక్రమించిందని ఆరోపిస్తూ హైకోర్టుకు ఫిర్యాదు చేసారు. రెస్టారెంట్, బార్ నిర్మాణం కారణంగా ఇందిరా గాంధీ ప్రతిష్ఠాన్ గోప్యత, భద్రతకు ముప్పు వాటిల్లవచ్చని ఫిర్యాదుదారు పేర్కొన్నారు.. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు స్టే విధించింది. ఇక అంతేకాదు ఆర్డర్ కాపీని ఎల్‌.డి.ఏకి పంపాలని ఫిర్యాదుదారుని ఆదేశించారు.  డెవలపర్ ఆమోదించబడిన సైట్ ప్లాన్ ని వదిలేసి పొరుగున ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసారనేది పిటీషన్‌లో ప్రధాన ఆరోపణ. ఈ నిర్మాణం ఇందిరా గాంధీ ప్రతిష్ఠాన్ గోప్యత, భద్రతకు ముప్పు కలిగిస్తుందని పేర్కొంటూ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇక ఈ కేసు తదుపరి విచారణ ఫిబ్రవరి 19 కి జరగనుంది.. ఆ విచారణకు తప్పకుండ సన్నీ హాజరు కావాలని కోర్టు నోటీసులు పంపించింది. ఈ కేసు గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.. ఇక ఈ అమ్మడు సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఈమె వరుసగా సినిమాలను అనౌన్స్ చేస్తుంది.. టాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తుంది. అయితే బ్లాక్ బాస్టర్ మూవీ ఒక్కటి కూడా పడలేదు. ఒక్క మూవీ అయిన పడుతుందేమో చూడాలి..

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×