E-Paper
Advertisement

Horoscope  Today February 1st: ఆ రాశి వారికి ఈరోజు దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యలు

Horoscope  Today February 1st: ఆ రాశి వారికి ఈరోజు దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యలు
Advertisement

Horoscope Today : గ్రహాల సంచారం ప్రకారం రాశిఫలాలను అంచనా వేస్తారు. ఫిబ్రవరి 1న ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి: ఈ రాశి వారు ఈరోజు శ్రమతో కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో స్థానచలన సూచనలున్నవి. చేపట్టిన పనులు మందగిస్తాయి. ఇంటా బయట పని ఒత్తిడి వలన తగిన విశ్రాంతి ఉండదు. బంధువర్గంతో చిన్న చిన్న   వివాదాలు తప్పవు. వ్యాపారాలలో ఆలోచించి ముందుకు సాగడం మంచిది.

Advertisement

వృషభ రాశి: ఈ రాశి వారికి ఈరోజు సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ప్రయాణాలలో నూతన వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు మరింత లాభాసాటిగా సాగుతాయి. సంతాన వివాహ విషయంలో శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పురోగతి సాధిస్తారు. బంధువుల కలయిక ఉత్సాహనిస్తుంది.

మిధున రాశి: ఈ రాశి వారికి ఈరోజు వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు అధికమవుతాయి. చేతిలో డబ్బు నిలువ ఉండక నూతన రుణాలు చేస్తారు. దూర ప్రయాణాలు వాయిదా పడుతాయి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి.

Advertisement

కర్కాటక రాశి: ఈ రాశి వారు ఈరోజు వ్యాపార విస్తరణకు శ్రీకారం చుడతారు. ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలుపరుస్తారు. చేపట్టిన వ్యవహారాలు లాభసాటిగా సాగుతాయి.

సింహ రాశి: ఈ రాశి వారు ఈరోజు తీసుకునే నిర్ణయాలు కుటుంబ సభ్యులకు నచ్చకపోవచ్చు. సన్నిహితులతో వివాదాలు కొంత మానసికంగా కలచివేస్తాయి. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి.

కన్యా రాశి: ఈ రాశి వారికి ఈరోజు వ్యాపార, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి. సంతాన వివాహయత్నాలు సానుకూలమవుతాయి. ఇంటా బయట నూతన విషయాలు తెలుస్తాయి. చిన్ననాటి మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి కొనుగోలుకు అవరోధాలు తొలగుతాయి.

 

ALSO READ:  గ్రహ బాధలు, సమస్యలు పట్టి పీడిస్తున్నాయా? ఈ సింపుల్ రెమెడీస్‌తో మీ బాధలన్నీ పరార్‌

 

తులా రాశి: ఈ రాశి నిరుద్యోగులకు ఈరోజు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఇంటాబయట మీ నిర్ణయాలు అందరూ గౌరవిస్తారు. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు.

వృశ్చిక రాశి: ఈ రాశి వారికి ఈరోజు భాగస్థులతో ఒప్పందాలు వాయిదా పడతాయి. చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. వ్యాపార ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. సోదరులతో ఆస్తి వివాదాలు కొంత చికాకు పరుస్తాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి.

ధనస్సు రాశి: ఈ రాశి వారు ఈరోజు ఆలయ దర్శనాలు చేసుకుంటారు. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో ఇబ్బందులు తప్పవు. బంధువులతో మాటపట్టింపులుంటాయి. దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.

మకర రాశి: ఈ రాశి వారు ఈరోజు వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. నూతన వాహనయోగం ఉన్నది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దూరపు బంధువుల నుండి ఆసక్తికర సమాచారం అందుతుంది.

కుంభ రాశి: ఈ రాశి వారికి ఈరోజు ఇంటాబయట ఒత్తిడులు పెరుగుతాయి. చేపట్టిన పనుల్లో అవాంతరాలు ఉంటాయి. వ్యాపారాలు మందగిస్తాయి. ఆర్థిక ఇబ్బందులు తప్పవు. దూర ప్రయాణాలు వాయిదా పడుతాయి. సోదరులతో కలహా సూచనలున్నవి. ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.

మీన రాశి: ఈ రాశి వారికి ఈరోజు ఉద్యోగాలలో ఊహించని స్థానచలన సూచనలున్నాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగవు. స్థిరాస్తి కొనుగోలులో ఆటంకాలు ఉంటాయి. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. చిన్ననాటి మిత్రులతో కలహా సూచనలున్నవి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

 

ALSO READ: Donga Mallanna Temple: దేవుడినే దొంగను చేసిన భక్తులు –  ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?

 

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×