BigTV English
Advertisement

Deepseek : డీప్‌సీక్ బ్యాన్

Deepseek : డీప్‌సీక్ బ్యాన్

Deepseek : చైనీస్ డీప్‌సీక్ AI చాట్‌బాట్.. లాంచ్ అయిన అతి కొద్ది రోజుల్లోనే కోట్లాది యూజర్స్ ను ఆకర్షించేసింది. ఇప్పటికీ యాపిల్ ప్లే స్టోర్, గూగుల్ ప్లే స్టోర్ లో నెంబర్ వన్ డౌన్లోడ్ యాప్ గా నిలిచింది. అయితే ఈ యాప్ లాంచ్ అయినప్పటి నుంచి వరుస వివాదాలు చుట్టుమడుతున్నాయి. ముఖ్యంగా చైనాకు చెందిన చాట్ బాట్ కావడంతో పలు ఆరోపణలు ఎదురవుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరో వివాదం డీప్ సీక్ ను చుట్టుముట్టింది. ఐరోపా దేశాల్లో డీప్ సీక్ యూజర్స్ సున్నితమైన డేటాను దొంగలు ఇస్తుందనే ఆరోపణలు ఎదురైన నేపథ్యంలో ఇటలీ యాప్ స్టోర్ ప్లే, స్టోర్ నుంచి ఈ యాప్ ను తొలగించింది.


డీప్ సీక్ యూజర్స్ సున్నితమైన డేటాను తస్కరిస్తుందనే ఆరోపణలు ఎదురైన నేపథ్యంలో.. ఇటలీ ఈ యాప్ ను తమ ప్లే స్టోర్ నుంచి తొలగించింది. ఇటాలియన్ డేటా ప్రొటెక్షన్ అథారిటీ (DPA) కంపెనీ డేటా కలెక్షన్, స్టోరేజ్ సెక్యూరిటీ కోసం ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ యాప్ ను తీసేసినట్లు తెలుస్తుంది.

డీప్‌సీక్‌పై వినియోగదారుల హక్కుల సంఘం యూరో కన్స్యూమర్స్ ఫిర్యాదు చేసింది. డీప్‌సీక్ AIతో వ్యక్తిగత డేటాను నిర్వహించటాన్ని ఇది ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు ప్రతిస్పందనగా, ఇటలీ DPA దాని డేటా స్టోరేజ్ సిస్టమ్ గురించి డీప్‌సీక్ నుండి వివరణాత్మక సమాచారాన్ని కోరింది. అంతేకాకుండా రిప్లై ఇవ్వటానికి కంపెనీకి 20 రోజుల సమయం ఇచ్చింది. అయితే, ఇటలీ అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం డీప్ సీక్ ఎలాంటి రిప్లై ఇవ్వలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వినియోగదారుల నుంచి డీప్ సీక్ ప్రాసెసింగ్ డేటా కలెక్ట్ చేస్తుందనే ఆరోపణలు ఎక్కువవుతున్న నేపథ్యంలో ఆ దేశంలో నిషేధిస్తున్నట్లు ఇటాలియన్ అధికారులు తెలిపారు.


ALSO READ : ఫిబ్రవరిలో రాబోతున్న టాప్ 8 మెుబైల్స్ ఇవే

ఇక్కడ ఆందోళన కలిగించే మరో విషయం ఏంటంటే.. డీప్ సీక్ ఎలాంటి సెక్యూరిటీ ఫీచర్స్ ను ఫాలో అవ్వలేదని తెలుస్తోంది. అంతేకాకుండా వినియోగదారుల డేటా చైనాలోని సర్వర్స్ లో స్టోర్ అవుతుందని సమాచారం. డేటాకు సంబంధించి ఎలాంటి సెక్యూరిటీ ఫీచర్స్ ఫాలో అవుతున్నారనే విషయం ఆ కంపెనీ తెలపనప్పటికీ ఇటాలియన్ అధికారులు సైబర్ సెక్యూరిటీ, స్టోరేజ్ సెక్యూరిటీ, రాంగ్ ఇన్ఫర్మేషన్ గురించి పలు ఆరోపణలు ఆందోళనలు లేవనెత్తారు. ఇటాలియన్ రెగ్యులేటర్ల నుంచి మాత్రమే కాకుండా యూరోపియన్ అంతటా ఈ ఆరోపణలు ఒక్కసారిగా వెల్లువెత్తాయి. కఠినమైన ఏఐ ప్రొటెక్షన్ తో పాటు డేటా ప్రొడక్షన్ కు కట్టుబడి ఉండాలని అధికారులు హెచ్చరికలు పంపారు. అయినప్పటికీ డీప్ సీక్ స్పందించలేదు.డ

డీప్ సీక్ అనేది చైనా లాంచ్ చేసిన చాట్ బాట్. ఇది అమెరికా సహా అనేక దేశాల్లో డౌన్లోడ్ చార్టులలో అగ్రస్థానంలో నిలిచింది. ఇప్పటికే ఆపిల్ ప్లే స్టోర్, గూగుల్ ప్లే స్టోర్ లో నెంబర్ వన్ డౌన్లోడ్ యాప్ గా నిలిచింది. ఇప్పటివరకు ఓపెన్ ఏఐ తీసుకువచ్చిన చాట్ జీపీటీ నెంబర్ వన్ స్థానంలో ఉండగా.. ఇప్పుడు డీప్ సీక్ నెంబర్ వన్ స్థానంలో చేరింది.

 

Tags

Related News

Snapchat AI Search: ఏఐ ప్రపంచంలో కీలక ఒప్పందం.. స్నాప్‌చాట్‌లోకి పర్‌ప్లెక్సిటీ ఏఐ సెర్చ్‌!

Vivo 16GB RAM Phone Discount: వివో 16GB ర్యామ్, ట్రిపుల్ కెమెరా గల పవర్‌ఫుల్ ఫోన్‌పై షాకింగ్ రూ.34,000 డిస్కౌంట్.. ఎలా పొందాలంటే..

Smartwatch At Rs 1799: తక్కువ ధరలో టాప్‌ క్లాస్‌ లుక్‌.. రూ.8వేల స్మార్ట్‌వాచ్‌ జస్ట్ రూ1,799లకే

AI-Heart Condition: డీప్ లెర్నింగ్ కృత్రిమ మేధ.. గుండెలో దాగున్న రంధ్రాన్ని ఇట్టే పట్టేస్తుంది!

2025 Yamaha RX 100: యమహా ఆర్ఎక్స్100 లెజెండ్‌ పవర్‌ఫుల్‌ రీ ఎంట్రీ.. ఇప్పుడు కొత్త స్టైల్‌తో..

AI Professionals-Women: ఏఐ రంగంలో మహిళలకు బ్రైట్ ఫ్యూచర్.. తాజా నివేదికలో కీలక విషయాలు

Samsung’s New 5G: శామ్‌సంగ్‌ నుంచి మరో సర్‌ప్రైజ్.. బడ్జెట్‌లోనే ప్రీమియం ఫీచర్ల ఫోన్‌

Vibe Coding: డెవలపర్ల కొంపముంచుతున్న కృత్రిమ మేధ.. అసలేమిటీ వైబ్‌కోడింగ్?

Big Stories

×