BigTV English

Janhvi Kapoor Marriage: షాకింగ్.. త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనున్న దేవర బ్యూటీ.. ?

Janhvi Kapoor Marriage: షాకింగ్.. త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనున్న దేవర బ్యూటీ.. ?


Rumors on Janhvi Kapoor Boy Friend: బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ పెళ్లి చేసుకోబోతుందా.. ? అంటే.. నిజమే అన్న మాట వినిపిస్తుంది. అందాల అతిలోక సుందరి శ్రీదేవి, నిర్మాత బోనీ కపూర్ ముద్దుల తనయగా జాన్వీ బాలీవుడ్ కు పరిచయమైంది. వరుసగా మంచి మంచి సినిమాలు చేసుకుంటూ వస్తున్న ఈ చిన్నది.. దేవర చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమవుతుంది. ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ కాకుముందే RC17 లో కూడా జాన్వీ ఛాన్స్ పట్టేసింది. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన జాన్వీ నటిస్తోంది.

ఇక జాన్వీ సినిమాల విషయం పక్కన పెడితే.. గత కొంతకాలంగా ఈ చిన్నది.. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ పహారియాతో చెట్టపట్టాలు వేసుకొని తిరుగుతుంది, పబ్, పార్టీ, గుడి అని తేడా లేకుండా ఎక్కడ చూసిన ఈ జంటనే కనిపిస్తున్నారు. వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఎన్నోసార్లు ఈ జంట మీడియా కంట కనపడడం కూడా జరిగింది. అయినా ఈ విషయమై జాన్వీ ఎన్నడూ నోరు విప్పింది లేదు. ఇక తాజాగా వీరి రిలేషన్ పై జాన్వీ తండ్రి బోనీ కపూర్ స్పందించాడు.


Also Read: VK Naresh: ఏపీ ఎలక్షన్స్.. రక్తపాతం తప్పదు.. నరేష్ సంచలన వ్యాఖ్యలు

బోనీ కపూర్ నిర్మించిన మైదాన్ ప్రమోషన్స్ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో బోనీకి జాన్వీ, శిఖర్ ల రిలేషన్ పై ప్రశ్న ఎదురైంది. శిఖర్ పహారియా గురించి చెప్పండి అన్న ప్రశ్నకు బోనీ మాట్లాడుతూ.. ” అతన్ని నేనెప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాను. కొన్నేళ్ల క్రితం అసలు జాన్వీకి పరిచయం కాకముందే అతడు నా స్నేహితుడు. ఎప్పుడు శిఖర్ మాతోనే ఉంటాడు..నేను అతన్ని ఎప్పుడు మాజీ కానివ్వను. మా చుట్టూనే ఉంటాడు.. మాకు ఎప్పుడు అండగా ఉంటాడు. నాకోసం కానీ, జాన్వీ కోసం కానీ, అర్జున్ కోసం కానీ.. ప్రతి ఒక్కరితో అతను ఫ్రెండ్లీగానే ఉంటాడు. మా సర్కిల్ లో అలాంటి వ్యక్తిని కలిగి ఉండడం.. మాకు దేవుడు ఇచ్చిన గొప్ప ఆశీర్వాదం” అని చెప్పుకొచ్చాడు. ఇన్ డైరెక్ట్ గా శిఖర్ నచ్చాడని చెప్పుకొచ్చాడు. జాన్వీ, శిఖర్ కలిసి ఉంటున్నారని తెలిపాడు. దీంతో వీరి పెళ్లి త్వరలోనే ఉంటుందని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×